First Song "Chilake" from "ARM," starring Tovino Thomas, Krithi Shetty has been released

టోవినో థామస్ ''ఏఆర్ఎమ్" (ARM) చిత్ర మొదటి పాట "చిలకే" విడుదల !!!


మలయాళ నటుడు టోవినో థామస్ తన తదుపరి చిత్రాన్ని జితిన్ లాల్ దర్శకత్వంలోచేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ అజయంతే రాండమ్ మోషణం (ARM) అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఈ సినిమా రూపొందించబడింది.

ఈ చిత్రం నుండి ఫస్ట్ సాంగ్  ''చిలకే.. పువ్వే పువ్వే తామర పువ్వే...''  అంటూ సాగే మెలోడీ ను విడుదల చేశారు. డిబు నైనన్ థామస్ ఈ సినిమాను సంగీతం అందించారు. కపిల్ కపిలన్ ఈ సాంగ్ ను పాడడం జరిగింది, కృష్ణ కాంత్ ఈ సాంగ్ కు లిరిక్స్ రాశారు, టోవినో థామస్, కృతి శెట్టి కెమెస్ట్రీ బాగా సెట్ అయ్యింది. పాట విడుదలైన కొద్దిసేపటిలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను హృతిక్ రోషన్, నాని, లోకేష్ కనగరాజ్, ఆర్య, రక్షిత్ శెట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో విడుదల చేశారు. టీజర్ కు మంచి స్పందన లభించింది. పొడవాటి జుట్టుతో టొవినో థామస్ ఒక కఠినమైన అవతార్‌ను ప్రదర్శించడం చూసి అభిమానులు సంతోషిస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మరియు కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రానికి దిభు నినాన్ థామస్ సంగీతం అందించగా, జోమోన్ టి జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ మరియు UGM ప్రొడక్షన్స్‌పై డా. జకరియా థామస్ మరియు లిస్టిన్ స్టీఫెన్ నిర్మించిన ఈ చిత్రానికి సుజిత్ నంబియార్ కథను అందించారు.

తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ విజువల్ వండర్ గా ఉందని సినిమా ప్రేక్షకులు అంటున్నారు. సెప్టెంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://youtu.be/wDQZ0_eiNJU?si=pwGmv7idQiu7NVV4

Comments

Popular posts from this blog

Surya Purimetla's character first look from 'Ari' was released on the occasion of the inauguration of Ayodhya Ram Mandir

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

త్రిగుణ, మేఘా చౌదరి, మల్లి యేలూరి, Dr Y. జగన్ మోహన్, యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ 'జిగేల్' ఫస్ట్ లుక్ రిలీజ్