ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ "ఘటికాచలం" టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్


నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్న సినిమా "ఘటికాచలం". ఈ చిత్రానికి కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ ఎం.సి.రాజు.  "ఘటికాచలం" చిత్రాన్ని ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు దర్శకుడు అమర్ కామెపల్లి. ఈ రోజు "ఘటికాచలం" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. 

"ఘటికాచలం" ఫస్ట్ లుక్ లో రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నారు హీరో నిఖిల్ దేవాదుల. ఈ రెండు లుక్స్ లో ఒకటి ఇన్నోసెంట్ గా, మరొకటి ఇంటెన్స్ గా కనిపిస్తోంది. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉండి "ఘటికాచలం" సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ఈటీవీ ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే "ఘటికాచలం" సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.


నటీనటులు - నిఖిల్ దేవాదుల, ఈటీవీ ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి, తదితరులు

టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైన్ - అంజలి
ఎడిటింగ్ - శ్రీనివాస్ బైనబోయిన
సినిమాటోగ్రఫీ - ఎస్ఎస్ మనోజ్
మ్యూజిక్ - ఫ్లేవియో కుకురోలొ
ప్రొడక్షన్ డిజైన్ - అనిల్ పొగరు
సౌండ్ డిజైన్ - సాయి మనిందర్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - విజయ్ కుమార్
డిజిటల్ ప్రమోషన్ - హౌస్ ఫుల్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా(సురేష్ - శ్రీనివాస్)
రచన - శ్రీనివాస్ మల్కార్
బ్యానర్ - ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్ 
స్టోరీ, నిర్మాత - ఎం.సి.రాజు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం - అమర్ కామెపల్లి

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

"ది ఇండియన్ స్టోరి" రివ్యూ - మంచి సందేశం, వినోదం కలిపిన సినిమా

టోని కిక్, సునీత మారస్యార్ హీరో హీరోయిన్లుగా A3 లేబుల్స్ బ్యానర్‌పై బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో లాంఛనంగా ప్రారంభమైన చిత్రం