బ్రహ్మవరం పి.ఎస్.పరిధిలో రివ్యూ & రేటింగ్ !!!

డ్రీమ్జ్ ఆన్ రీల్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం “బ్రహ్మవరం P.S. పరిధిలో”. ఈ సినిమాను ఇమ్రాన్ శాస్త్రి డైరెక్ట్ చేయగా, స్రవంతి బెల్లంకొండ, గురు, సూర్య శ్రీనివాస్, హర్షిణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీలో స్రవంతి బెల్లంకొండ ప్రధాన పాత్రలో  నటించడమే కాకుండా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆగస్ట్ 23న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.



కథ:
అమెరికా లో ట్రావెల్ రిస్త్రీక్షన్ తీసేయడంతో.. (స్రవంతి) చైత్ర ఇండియా లోని బ్రహ్మవరం కి బయల్దేరుతుంది.. అదే రోజు రాత్రి బ్రహ్మవరం లో పోలీస్ స్టేషన్ దగ్గర ఒక శవం పడి ఉంటుంది.. అక్కడ్నుంచి కథ 99 రోజుల వెనక్కి వెళుతుంది.. సాప్ట్ వేర్ ఉద్యగిని అయిన చైత్ర , సూర్య (సూర్య శ్రీనివాస్) నీ ప్రేమిస్తుంది.. ఈ కథకి ప్యార్లల్ గా..గౌతమ్ (గురు చరణ్) కథ నడుస్తుంది..గౌతమ్ తండ్రి (ప్రేమ సాగర్) పట్టాభి కానిస్టేబుల్ ..స్టేషన్ లో s.I తో అతనికి విభేదాలుంటాయి.. అసలు చైత్ర ,ఎందుకు బ్రహ్మవరం వచ్చింది..సూర్య కి ఏమైనది.. గౌతమ్ చైత్ర ఎలా ,ఎందుకు కలిశారు..పోలీస్ స్టేషన్ దగ్గర పడిన శవం ఎవరిది.. లాంటి ప్రశ్నలకి సెకండ్ హాఫ్ లో సమాధానాలు దొరుకుతాయి....


విశ్లేషణ:
 స్రవంతి బెల్లంకొండ, గురు చరణ్, సూర్య శ్రీనివాస్, హర్షిని కోడూరు, రూప లక్ష్మీ, ప్రేమ్ సాగర్ , సమ్మెట గాంధీ, రుద్ర తిప్పే స్వామి  ఈ సినిమాలో వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మెయిన్ హీరోయిన్ గా చేసిన స్రవంతి బెల్లంకొండ మొదటి సినిమా అయినప్పటికీ చాలా బాగా నటించింది.  సినిమా చూసి వచ్చాక ఈ పాత్రలు మన మనసులో ఉండిపోతాయి. 

దర్శకుడు ఇమ్రాన్ శాస్త్రి ఎంచుకున్న కథ మెయిన్ హైలెట్, దానిని తెరమీద చూపించడంలో సక్సెస్ అయ్యారు. కథను గ్రిప్పింగ్ గా తెరకెక్కించారు. సాకేత్ శ్రీరామ్ అందించిన సాంగ్ బాగుంది , అలాగే శ్రీ వెంకట్ అంధించిన నేపధ్య సంగీతం సినిమాకు బాగా సెట్ అయ్యింది. ఇలాంటి థ్రిల్లింగ్ సస్పెన్స్ కథలకు ఆర్ఆర్ బాగా కుదరాలి, ఈ సినిమాకు శ్రీ వెంకట్ బెస్ట్ వర్క్ ఇచ్చారు. ముజీర్ మాలిక్ కెమెరా వర్క్ బాగుంది. 

రొటీన్ కు భిన్నంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "బ్రహ్మవరం పి. ఎస్ పరిధిలో"...  ఒక ఆసక్తికరమైన కథ కథనాలతో వచ్చిన ఈ సినిమాను, చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మంచి సినిమాలు, కంటెంట్ బాగున్నా సినిమాలు ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అదే తరహాలోనే ఈ సినిమాను ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు.

చివరిగా: ':బ్రహ్మవారం పిఎస్ పరిధిలో'' గుడ్ సస్పెన్స్ థ్రిల్లర్

రేటింగ్: 3/5

Comments

Popular posts from this blog

Surya Purimetla's character first look from 'Ari' was released on the occasion of the inauguration of Ayodhya Ram Mandir

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

త్రిగుణ, మేఘా చౌదరి, మల్లి యేలూరి, Dr Y. జగన్ మోహన్, యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ 'జిగేల్' ఫస్ట్ లుక్ రిలీజ్