ఘనంగా "కావేరి" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 30న థియేట్రికల్ రిలీజ్....
రిషిత, ఫైజల్, షేక్ అల్లాబకాషు, ఖుషీ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కావేరి". ఈ సినిమాను స్యాబ్ క్రియేషన్స్ బ్యానర్ పై షేక్ అల్లాబకాషు నిర్మాత గా, రాజేష్ నెల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కావేరి సినిమా, ఈ నెల 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.....
సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ మాట్లాడుతూ - కావేరి సినిమాకు సంగీతాన్ని అందించే అవకాశం ఇచ్చిన నిర్మాత షేక్ అల్లా బకాషు గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఆయన ఈ సినిమాతో పాటు మరో రెండు చిత్రాలకు కూడా నన్నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. కావేరి సినిమా ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో అందరికీ కనువిప్పు కలిగించేలా ఉంటుంది. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ కుదిరింది.
హీరోయిన్ రిషిత మాట్లాడుతూ - పేరెంట్స్ ఎప్పుడూ అమ్మాయిలకే జాగ్రత్తలన్నీ చెబుతుంటారు. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది. ఇవే జాగ్రత్తలు అబ్బాయిలకు చెబితే అమ్మాయిల పట్ల ఇన్ని అకృత్యాలు ఈరోజు సొసైటీలో జరగవు. ఒక అమ్మాయికి ఏదైనా జరిగితే అదే తల్లిదండ్రులు ఎంతో వేదనకు గురవుతారు. మా సినిమాలో మంచి సోషల్ మెసేజ్ ఉంది. ఇలాంటి మూవీలో నటించే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ షేక్ అల్లాబకాషు గారికి, డైరెక్టర్ రాజేష్ గారికి థ్యాంక్స్.
హీరో ఫైజల్ మాట్లాడుతూ - నన్ను నేను బిగ్ స్క్రీన్ మీద చూసుకోవడం ఎంతో హ్యాపీగా ఉంది. మాలాంటి కొత్తవాళ్లకు అవకాశాలు రావడం అదృష్టంగా భావిస్తాం. ఎంతోమంది ఫొటోస్ పట్టుకుని అవకాశాల కోసం తిరుగుతుంటారు. మా డైరెక్టర్ రాజేష్ గారికి, మాకు అలాంటి మంచి అవకాశం ఇచ్చారు. ప్రొడ్యూసర్ షేక్ అల్లాబకాషు గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. కావేరి సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది.
డైరెక్టర్ రాజేష్ నెల్లూరు మాట్లాడుతూ - కావేరి సినిమాను ఎలాంటి ఫైనాన్షియల్ టెన్షన్స్ లేకుండా డైరెక్ట్ చేయగలిగాను అంటే అందుకు మా ప్రొడ్యూసర్ షేక్ అల్లాబకాషు గారే కారణం. ఆయన మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో మూవీ నిర్మించారు. ఇందులో కావేరి క్యారెక్టర్ బోల్డ్ గా, రా అండ్ రస్టిగ్ గా ఉంటుంది. ఈ క్యారెక్టర్ లో రిషిత ఆకట్టుకునేలా నటించారు. రాజ్ కిరణ్ మ్యూజిక్ మా మూవీకి ఆకర్షణ అవుతుంది. మంచి సోషల్ మెసేజ్ తో మేము చేసిన చిత్రమిది. ఆగస్టు 30న మీరంతా థియేటర్స్ లో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా.
నిర్మాత షేక్ అల్లాబకాషు మాట్లాడుతూ - ఈ రోజు మా ఈవెంట్ కు అతిథులుగా వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. కావేరి సినిమాను మా దర్శకుడు రాజేశ్ అందరికీ నచ్చేలా రూపొందించాడు. మొదట్లో ఆయనే ఈ మూవీ బిగిన్ చేశాడు. ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఎదుర్కొన్నాడు. ఈ ప్రాజెక్ట్ మా దగ్గరకు తీసుకొచ్చాడు. రష్ చూడగానే మాకు నచ్చింది. మా ప్రొడక్షన్ నుంచి టేకోవర్ చేశాం. కావేరి సినిమాలో మెసేజ్ తో పాటు మంచి ఎంటర్ టైన్ మెంట్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అబ్బాయిల ప్రవర్తన బాగుంటే అమ్మాయిలు సేఫ్ గా ఉంటారు. తమపై దాడులు జరిగినప్పుడు అమ్మాయిలు ధైర్యంగా ఎదుర్కోవాలి అనే అంశాలను ఈ మూవీలో చూపిస్తున్నాం. అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా చూడాల్సిన చిత్రమిది. అన్నారు.
బిగ్ బాస్ ఫెమ్ హీరోయిన్ కీర్తి భట్ (Guest) మాట్లాడుతూ: కావేరి సినిమాలో మంచి సోషల్ మెసేజ్ ఉంది. ఆగస్టు 30న థియేటర్స్ లో సినిమా రిలీజ్ అయ్యాక ఆ మెసేజ్ సొసైటీకి తెలుస్తుంది. ఈ రోజు ఆడపిల్లలు సర్వైవ్ కావాలంటే కష్టంగా ఉంది. వాళ్లు ఎలా పోరాడాలి అనే విషయాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఇవాళ చిన్న సినిమా రిలీజ్ కు ఎన్ని కష్టాలు పడాల్సివస్తుందో చూస్తున్నాం. ఆ ఇబ్బందులు తట్టుకుని కావేరి సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నారు.
నిర్మాత డీఎస్ రావు (Guest)మాట్లాడుతూ - కంటెంట్ బాగుంటే చిన్న సినిమాకు కూడా కాసుల వర్షం కురుస్తోంది. కమిటీ కుర్రోళ్లు, ఆయ్ సినిమాలు రీసెంట్ గా మంచి సక్సెస్ అయ్యాయి. మీరు కూడా మంచి కంటెంట్ తోనే మూవీ చేశారని భావిస్తున్నా. తమపై జరిగే దాడులను ఎదుర్కొని మహిళలు పోరాడాలి అనే కాన్సెప్ట్ కావేరి చిత్రంలో చూపిస్తున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా.
నిర్మాత లయన్ సాయి వెంకట్ (Guest) మాట్లాడుతూ - ఒకప్పుడు ఇతర భాషల్లో మంచి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ వచ్చేవి. మన దగ్గర స్టార్స్ సినిమాలు ఎక్కువగా చూసేవారు. కానీ ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రమే ఆదరణ దక్కుతోంది. కావేరి కూడా అలాంటి మంచి కంటెంట్ తో తీశారని తెలుస్తోంది. పాటలు బాగున్నాయి. ఆర్టిస్టులు బాగా పెర్ఫామ్ చేశారు. ఈ సినిమా బిగ్ హిట్ కావాలని కోరుకుంటున్నా..
నటీనటులు : రిషిత, ఫైజల్, షేక్ అల్లాబకాషు, ఖుషీ యాదవ్, లక్ష్మి ప్రియా, గుజ్జల సుధీర్ రెడ్డి, ప్రశాంత్ కుమార్ రెడ్డి దువ్వూరు, తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్: స్యాబ్ క్రియేషన్స్
నిర్మాత: షేక్ అల్లా బకాషు
రచన, దర్శకత్వం: రాజేష్ నెల్లూరు
ఎడిటర్: నరేష్ దొరపల్లి
డీఓపీ: నాగేంద్ర బన్నీ
సంగీతం: రాజ్ కిరణ్
సింగర్స్: ఐశ్వర్య, దీపు, వినాయక రావు & వేణు
సాహిత్యం: జివి ప్రతాప్ చౌదరి, రామారావు, సాజిద్, కె
వెంకటేశ్వరరావు
పి.ఆర్.ఓ: తిరుమలశెట్టి వెంకటేష్
Comments
Post a Comment