''సన్నాఫ్ సునామి'' మూవీ ప్రారంభం

ఆసక్తికరమైన కథ, కథనాలతో తెలుగు తెర‌పైకి రాబోతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్  ''సన్నాఫ్ సునామి''.  
దిలీప్ కుమార్ రాథోడ్, అరవిందా అగర్వాల్, షణ్ణు హీరోహీరోయిన్లుగా చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న ''సన్నాఫ్ సునామి'' హైద‌రాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. శతృవుల గుండెల్లో దడ ట్యాగ్ లైన్. కృష్ణ ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ''సన్నాఫ్ సునామి'', ''బాల తేజం''చిత్రాలు  ఘనంగా ప్రారంభమైయ్యాయి. నటీనటులపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ క్లాప్ ఇచ్చి ప్రారంభించారు. 

అనంతరం చీఫ్ గెస్ట్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. సన్నాఫ్ సునామి నటీనటులు బాగా నటించే వారే. ఈ సినిమా కాన్సెఫ్ట్ చాలా బాగుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సినిమా యూనిట్ కు మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా దర్శక నిర్మాతలకు మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ద్వారా పూర్తి  సహాకారం అందిస్తాము. సినిమా రిలీజ్‌కు పూర్తి సహాకారం అందిస్తామని తెలిపారు.

హీరో దిలీప్ కుమార్ రాథోడ్ మాట్లాడుతూ.. ఎవరైన ప్రోడ్యూసర్ ఒక్క సినిమా అవకాశం ఇస్తారు. కానీ కృష్ణ ప్రసాద్ నాలుగు సినిమాల్లో చేసే అవకాశం ఇచ్చారు. వారి నమ్మకానికి ధ‌న్యవాదాలు. ''సన్నాఫ్ సునామి '' కథ చాలా బాగా నచ్చింది. ఈ సినిమా ద్వారా నాకే కాదు, నా తోటి నటీనటులకు మంచి పేరు వస్తుందని చెప్పుకొచ్చారు. 

హీరోయిన్స్  అరవింద అగర్వాల్, షణ్ణు మాట్లాడుతూ.. సన్నామి సునామి చిత్రంలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన కృష్ణ ప్రసాద్‌కి ధ‌న్యవాదాలు తెలిపారు.

నిర్మాత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. మా బ్యానర్‌లో''సన్నాఫ్ సునామి'', ''బాల తేజం'' చిత్రాలు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మరో రెండు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. మంచి కాన్సెప్ట్ తో సినిమా లు రూపోందిస్తున్నాము. అన్ని వర్గాలకు నచ్చే విధంగా సినిమాలు తెరకెక్కిస్తున్నాము. మా సినిమాలో నటించే నటీనటులు , పని చేసే టెక్నిషియన్స్ సహాకారంతో రెండు సినిమాలు కంప్లీట్ చేశాము..ప్రస్తుతం మరో రెండు సినిమాలు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు..

పాటల రచయిత గడ్డ సీతా రామ చౌదరి మాట్లాడుతూ.. కృష్ణ ప్రసాద్ చేస్తున్న నాలుగు సినిమాకు పాటలకు రాసే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక దన్యవాదాలు తెలియచేస్తున్నాను. సంగీతం లక్ష్మణ్ సాయి  చేసిన సంగీతం అందరికి నచ్చుతుంది. మా చిత్రయూనిట్ కు మంచి పేరు వస్తుందని అన్నారు..

సంగీత దర్శకుడు లక్ష్మణ్ సాయి మాట్లాడుతూ... నా మీద నమ్మకంతో ఆయన చేసే ప్రతి సినిమాకు సంగీతం సమకూర్చే అవకాశం కల్పిస్తున్న కృష్ణ ప్రసాద్‌కి ప్రత్యేక ధ‌న్యవాదాలు. ఈ సినిమాలో నటిస్తున్న ఆర్టిస్టులకు, టెక్నిషియన్స్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో  తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ జెవిఆర్, విజయ చిత్ర ఎడిటర్ గుర్రపు విజయ్ కుమార్ , కెవిఎల్ నరసింహారావు ప్రముఖులతో పాటు , చిత్రయూనిట్ సభ్యులు పాల్గోన్నారు.

నటీనటులు : ఇరిగే రమేష్,షన్ను,అరవిందా, స్వర్ణలత,దుర్గా,మంజుల, కవిత, విజయ్ గుర్రపు, కెవిఎల్ నరసింహారావు , జబర్దస్త్ అప్పారావు, రామకృష్ణ ,సైదులు ,చెన్నకేశవ నాయుడు       
                                       
బ్యానర్  : కృష్ణ ప్రసాద్ ప్రొడక్షన్స్ 
దర్శకత్వం : చిత్తజల్లు ప్రసాద్ 
నిర్మాత: కృష్ణ ప్రసాద్ 
సహ నిర్మాత: చెన్నై బ్రహ్మ
కో డైరెక్టర్: మురళీ కృష్ణ దేవకి (మార్కాపురం)
D.O.P: నితీష్ (UP)
సంగీతం: కె .లక్ష్మణ్ సాయి 
సాహిత్యం: గడ్డ సీతా రామ చౌదరి 
ప్రొడక్షన్ కంట్రోలర్: శివ బోగలు
ఆర్ట్ డైరెక్టర్: K.V సురేష్ 
విన్యాసాలు: హుస్సేన్ భాయ్ 
ఔట్ డోర్ యూనిట్ : రాజు బాలాజీ

Comments

Popular posts from this blog

Surya Purimetla's character first look from 'Ari' was released on the occasion of the inauguration of Ayodhya Ram Mandir

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"