ఫాదర్స్ డే స్పెషల్: చైతన్య రావ్ 'డియర్ నాన్న' జూన్ 14 నుంచి ఆహాలో స్ట్రీమింగ్

యంగ్ ట్యాలెంటెడ్ చైతన్య రావ్, యష్ణ చౌదరి లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం 'డియర్ నాన్న'.  సూర్య కుమార్ భగవాన్ దాస్, సంధ్య జనక్, శశాంక్, మధునందన్ కీలక పాత్రలు పోషించారు. 

ఈ చిత్రానికి రాకేష్ మహంకాళి,అంజి సలాది కథనం, మాటలు అందించగా, రాకేష్ మహంకాళి  కథతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు.

అంజి సలాది దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫాదర్ డే స్పెషల్ గా జూన్ 14న నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే విడుదలైన డియర్ నాన్న ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.  కరోనా బ్యాక్ డ్రాప్, ఫాదర్ ఎమోషన్, చైతన్య రావ్, సూర్య కుమార్ భగవాన్ దాస్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా క్యురియాసిటీని పెంచాయి. 

ప్రొడక్షన్ వాల్యూస్, కంటెంట్ యూనిక్ గా వున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్, ముఖ్యంగా ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే సీన్స్ మనసుని హత్తుకున్నాయి. ఫాదర్స్ డే కి డియర్ నాన్న పర్ఫెక్ట్ ట్రీట్. 

ఈ చిత్రంలో సివిఎల్ నరసింహ, ఆదిత్య వరుణ్, వినీల్, సుప్రజ్ ఇతరకీలక పాత్రలు పోహిస్తున్నారు. అనిత్ కుమార్ డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి గిఫ్టన్ ఎలియాస్ మ్యూజిక్ డైరెక్టర్. శ్రవణ్ కటికనేని ఎడిటర్.

Comments

Popular posts from this blog

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!!

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!