భారీ సెట్‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోన్న చియాన్ విక్ర‌మ్ ‘వీర ధీర శూరన్’

* హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం
* ఎస్‌.యు.అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం.. రియా శిబు నిర్మాత‌


విల‌క్ష‌ణ న‌టుడు చియాన్ విక్ర‌మ్ హీరోగా హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.యు.అరుణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రియా శిబు నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘వీర ధీర శూరన్’. విక్ర‌మ్ 62వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. రీసెంట్‌గా విడుద‌లైన టైటిల్ టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. తెన్ కాశీలో భారీ సెట్ వేసి సినిమాను పూర్తి చేస్తున్నారు మేక‌ర్స్‌. 

ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ రోల్‌లో విక్ర‌మ్ అల‌రించ‌బోతున్నారు.  ఆయ‌న లుక్ మాస్‌, ర‌గ్డ్‌గా ఉంది. సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అంచ‌నాలు పెరుగుతున్నాయి. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా!. అని అభిమానులు, ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో విక్ర‌మ్ కాళి పాత్ర‌లో అంద‌రినీ మెప్పించ‌డానికి రెడీ అవుతున్నారు. 

విక్ర‌మ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో  సిద్ధికీతో పాటు  ఎస్‌.జె.సూర్య‌, దుస‌రా విజ‌య‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.  జి.వి.ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తేని ఈశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 


న‌టీన‌టులు:

చియాన్ విక్ర‌మ్‌, ఎస్‌.జె.సూర్య‌, దుస‌రా విజ‌య‌న్, సిద్ధికీ త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:


బ్యాన‌ర్ :  హెచ్‌.ఆర్‌.పిక్చ‌ర్స్‌, నిర్మాత‌:  రియా శిబు, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.యు.అరుణ్‌కుమార్‌, అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌:  రోని జ‌కారియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  అన్‌లిన్ లాల్‌, మ్యూజిక్‌:  జి.వి.ప్ర‌కాష్ కుమార్‌, సినిమాటోగ్ర‌ఫీ:  తేని ఈశ్వ‌ర్‌, ఆర్ట్‌:  సి.ఎస్‌.బాల‌చంద‌ర్‌, కాస్ట్యూమ్స్‌:  క‌విత‌.జె, పి.ఆర్‌.ఒ (తెలుగు):  సురేంద్ర నాయుడు- ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా).

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

"ది ఇండియన్ స్టోరి" రివ్యూ - మంచి సందేశం, వినోదం కలిపిన సినిమా