రోటి కపడా రొమాన్స్ అందరికీ నచ్చుతుంది

ప్రముఖ నిర్మాత బెక్కం వేణు గోపాల్ పుట్టినరోజు వేడుకను ‘రోటి కపడా రొమాన్స్’ చిత్ర బృదం ఘనంగా నిర్వహించారు. బెక్కం వేణు గోపాల్ ప్రారంభించిన లక్కీ మీడియా 18 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం కూడా విశేషం.   

నిర్మాత సృజన కుమార్ బోజ్జం మాట్లాడుతూ: ఈ సినిమాతో నిర్మాతగా నా జర్నీ మొదలుపెట్టాను. బెక్కం వేణు గోపాల్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడూ ఇలానే సపోర్ట్ చెయ్యాలను కోరుకుంటున్నాను

హీరో హర్ష నర్రా మాట్లాడుతూ: మనం పుట్టినప్పుడు మన జీవితం మొదలవుతుంది కాని పది మందికి ఉపయోగపడినప్పుడే అసలైన జీవితం మొదలవుతుంది. లక్కీ మీడియా ద్వారా గత 18 సంవత్సరాలుగా ఎంతో మందికి ఉపయోగపడిన బెక్కం గారికి 18వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈయన జీవితం మాకు చాలా స్పోర్తి దాయకం. మా సినిమా రోటి కాపాడ రొమాన్స్ అందరికీ నచ్చే యూత్ ఫుల్ సినిమా అండి. అందరూ చూడండి. 

హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ: బెక్కం సర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా సినిమా డేట్ కూడా త్వరలోనే చెప్తాము.

హీరో తరుణ్ పొనుగోటి మాట్లాడుతూ: ఒక హీరో ఎంత మందితో వర్క్ చేసినా కూడా తనకి ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ని మర్చిపోలేము. బెక్కంగారు నాకు చాలా స్పెషల్, నా ఫస్ట్ సినిమా ఆయనతోనే చేస్తున్నాను. 

హీరో సుప్రజ్ రంగా మాట్లాడుతూ: బెక్కం సర్ పుట్టినరోజు సందర్భంగా మా సినిమాకు సంబంధించి ఏమైనా అప్డేట్ ఇవ్వండి సర్. 

హర్ష ఖడియాలా మాట్లాడుతూ: నేను ఖూర్మ నాయకీ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాను, గత పదిహేనేళ్ళుగా నేను బెక్కం వేణు గోపాల్ గారి లక్కీ మీడియాలోనే పెరిగాను. ఆయనని చూసి , అయన దగ్గర పని నేర్చుకుని ఇప్పుడు నేను సొంతంగా చేసుకుంటున్నాను. ఈరోజు ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం చాలా ఆనందంగా ఉంది.

డైరెక్టర్ విక్రం రెడ్డి మాట్లాడుతూ: యంగ్ టాలెంట్ కి ముందు గుర్తొచ్చేది లక్కీ మీడియా, కొత్తగా డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ అవ్వాలి అంటే లక్కీ మీడియానే కేర్ అఫ్ అడ్రస్, నేను అలానే ఇక్కడి వరుకు వచ్చాను. మా సినిమాతో సర్ కి డబ్బులు బాగా రావాలని కోరుకుంటున్నాను

బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ: అందరికీ థాంక్స్. నేను నా సంస్థని 18 ఏళ్ళ ముందు మొదలుపెట్టినప్పటి నుండి నాతో ఉండి నాకు సపోర్ట్ చేసిన మీడియాకి చాలా థాంక్స్. ఒక్కొక్క సినిమా తీసుకుంటూ, ఎప్పుడు 18 ఏళ్ళు గడిచాయో కూడా తెలియలేదు. నేను ఈరోజు ఇక్కడ ఇలా ఉండడానికి ముఖ్య కారణం నా ఫ్యామిలీ, అలాగే నా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ లేకపోతే నేను ఈ పోసిషన్ లో నేను. నేను తీసిన ప్రతి సినిమాని నా ఫ్రెండ్స్ ఏ కొన్నారు. ఇప్పుడు వచ్చే రోటి కాపడా రొమాన్స్ కూడా మంచి హిట్ అవుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాని కొనుక్కుంటుంది, వాళ్ళే త్వరలో అనౌన్స్ చేస్తారు. చాలా మంచి సినిమా తీసాం అని మంచి సాటిస్ఫ్యాక్షన్  ఉంది. 


*టీం.*
నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం
దర్శకుడు: విక్రమ్ రెడ్డి
డీఓపి: సంతోష్ రెడ్డి
హీరోలు : హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్ పొనుగోటి, సుప్రజ్ రంగా
హీరోయిన్స్ : సోనూ ఠాకూర్, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి, నువేక్ష

Comments

Popular posts from this blog

Surya Purimetla's character first look from 'Ari' was released on the occasion of the inauguration of Ayodhya Ram Mandir

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"