రచిత్ శివ పతాకంపై పాలిక్ శ్రీను దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.3 చిత్రం ప్రారంభం

 ఐ.ఐ.టి.కృష్ణమూర్తి ఫేం యువ హీరో పృథ్వీ  హీరోగా రూపాలి, అంబిక హీరోయిన్లుగా...రచిత్ శివ, ఆర్.ఆర్.క్రియేషన్స్  అండ్ పాలిక్ స్టుడియోస్ పతాకాలపై తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెం.3 చిత్రం బుధవారం లాంచనంగా పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని దుర్గం రాజేష్, రావుల రమేష్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం పాలిక్ శ్రీను. సంగీతం జాన్ భూషన్ అందించగా సురేష్ గంగుల పాటల రచయిత. వెంకట్, నిశాంత్ నిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిషాంత్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హీరో, హీరోయిన్లపై క్లాప్ కొట్టి... టీమ్ ను అభినందించారు.
ఈ సందర్భంగా సీనియర్ నటి ఆమని మాట్లాడుతూ... ఈ చిత్రంలో నేను ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నా. లవ్ అండ్ సెంటిమెంట్ ఎమోషనల్ కామెడీ మూవీ. ఇది గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న చిత్రం. ఇందులో అజయ్ ఘోష్ సరసన నేను నటిస్తున్నా. నిర్మాతలు ఈ చిత్రాన్ని ఎంతో ప్యాషన్ తో తీస్తున్నారు. దర్శకుడు పాలిక్ చెప్పిన కథ నాకు బాగా నచ్చి ఈ చిత్రం చేస్తున్నా అన్నారు.

హీరోయిన్ అంబిక, రూపాలి మాట్లాడుతూ... ఈ చిత్రంలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇది మాకు తొలి తెలుగు సినిమా. దర్శకుడు, నిర్మాతలు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి... ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. స్క్రిప్ట్ నచ్చి ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నారు. ఇంతకు ముందు హిందీ, మరాఠి చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది. ఇది లవ్, రొమాంటిక్, సెంటిమెంట్, కామెడీతో ప్రధానంగా తెరకెక్కుతోంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాతలు, దర్శకునికి ధన్యవాదాలు అన్నారు.

హీరో పృథ్వీ మాట్లాడుతూ... మా డైరెక్టర్ పాలిక్ ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇలాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాని తీయడానికి ముందుకు వచ్చిన నిర్మాతలకి ధన్యవాదాలు. త్వరలోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు వస్తాం అన్నారు.

నిర్మాత దుర్గం రాజేష్ మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున్న నిర్మించడానికి రావుల రమేష్, టి.ఎస్.రాజులతో కలిసి ముందుకు వచ్చాం. దర్శకుడు పాలిక్ తో కలిసి ప్రొడక్షన్ నెం.3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రేక్షకులు అలరించేలా ఈ చిత్రాన్ని యువ నటీనటులతో తెరకెక్కిస్తున్నాం. హీరో పృథ్వీని తెలంగాణ నుంచి, హీరోయిన్లను బాలీవుడ్ నుంచి, మళయాలం నుంచి అనిరుధ్ ని విలన్ గా... ఇలా అన్ని ప్రాంతాల నుంచి అందరి ఆర్టిస్టులను తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం అన్నారు. నిర్మాత, దర్శకుడు భరద్వాజ కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. ఆయనకు ధన్యవాదాలు అన్నారు.

నిర్మాత రావుల రమేష్ మాట్లాడుతూ... ఇటీవలే కాలకేయ ప్రభాకర్ తో కలిసి రౌద్రరూపాయ నమ: చిత్రాన్ని విడుదల చేశాం. ఆ చిత్రానికి మంచి పేరు వచ్చింది. థియేటర్లు సరిగా దొరకలేదు. కేవలం 70 థియేటర్లలో మాత్రమే విడుదల చేయగలిగాం. ఈ చిత్రానికైనా ఎక్కువ థియేటర్లు లభిస్తాయని ఆశిస్తున్నా అన్నారు.

సంగీత దర్శకుడు మాట్లాడుతూ... ఇందులో ఐదు పాటలు కంప్లీట్ అయ్యాయి. దర్శకుడు పాలిక్ ఎంతో ఎంకరేజ్ చేశారు. ఈ చిత్రానికి సంగీతం అందించడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. 

దర్శకుడు పాలిక్ మాట్లాడుతూ... ఇది నాకు ఇది మూడో చిత్రం. నాకు కొరియోగ్రాఫర్ గా మంచి పేరుంది. ఇటీవల రిలీజ్ అయిన రౌద్రరూపాయ నమ: చిత్రానికి మంచి పేరు వచ్చింది. మంచి రేటింగ్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు. నాకు ఎప్పటి నుంచో స్వాతిముత్యం లాంటి ఓ మంచి కుటుంబకథా చిత్రం తీయాలని ఉంది. నా మిత్రుడు ఎస్.ఆర్.పి. ఇచ్చిన కథ నచ్చి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వివిధ పాత్రలకోసం నటీనటులను తీసుకున్నాం. తెలుగులోని ప్రధాన తారాగణం అంతా కూడా ఇందులో నటిస్తున్నారు. పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇందులో ఆమని, ఝాన్సీ లు చాలా వెయిటేజ్ ఉన్న పాత్రలు చేస్తున్నారు. వచ్చే నెల 25 నుంచి చ సెట్స్ మీదకు వెళుతుంది. మంచిర్యాలలో ఓ పాటను తీస్తున్నాం. ఐదు షెడ్యూల్స్ లో సినిమాని పూర్తి చేసి... దిపావళికి సినిమాని విడుదల చేస్తున్నాం అన్నారు.

నటీనటులు: పృథ్వీ, రూపాలి, అంబిక, ఆమని, ఝాన్సీ, అజయ్ ఘోష్, జీవా, షకలక శంకర్, సుమన్, ఆర్.ఎస్.నంద, సుమన్ శెట్టి, సూర్య, చిత్రం శీను, అనిరుధ్, రఘు, సింగ్ సిద్ధూ తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు: 

నిర్మాతలు: దుర్గం రాజేష్, రావుల రమేష్, టి.ఎస్.రాజు
కథ-డైలాగ్స్-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పాలిక్ శ్రీను
సంభాషణలు: తోటపల్లి సాయినాథ్
సంగీతం: జాన్ భూషన్
పాటలు: సురేష్ గంగుల
సినిమాటోగ్రఫీ: వెంకట్, నిశాంత్
కొరియోగ్రఫీ: పాలిక్, మహి
ఎటిటర్: నిశాంత్
కో-డైరెక్టర్: రంగనాయకులు
ప్రొడక్షన్ మేనేజర్: సూర్య
పి.ఆర్.ఓ.: చందు రమేష్

Comments

Popular posts from this blog

Surya Purimetla's character first look from 'Ari' was released on the occasion of the inauguration of Ayodhya Ram Mandir

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

త్రిగుణ, మేఘా చౌదరి, మల్లి యేలూరి, Dr Y. జగన్ మోహన్, యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ 'జిగేల్' ఫస్ట్ లుక్ రిలీజ్