మే 10న "బ్రహ్మచారి" మూవీ విడుదల


‘బ్రహ్మచారి’లో టైమింగ్ బాగుంది.. కచ్చితంగా సక్సెస్ అవుతుంది.. విడుదలకు ముందే నంది అవార్డుకు ఎంపికవడం గొప్ప విషయం : ‘బ్రహ్మచారి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అతిథులు

అద్వితీయ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై రాంభూపాల్ రెడ్డి నిర్మాతగా ఎన్నో చిన్న చిత్రాలకు  పని చేసిన నర్సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బ్రహ్మచారి’. ఏఎన్నార్, కమల్ హాసన్ లాంటి మహామహులు నటించిన ‘బ్రహ్మచారి’ టైటిల్‌తో వచ్చిన సినిమాలు బాగా సక్సెస్ ఐనట్లే తెలంగాణ యాసలో వస్తున్న పర్‌ఫెక్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేసే మల్లేశం హీరోగా నటించిన ఈ చిత్రం మే 10న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. సోమవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర్ శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర యూనిట్‌కు విషెస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, సీనియర్ డైరెక్టర్ చంద్ర మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక అతిథి దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర్ శంకర్ మాట్లాడుతూ..‘‘‘బ్రహ్మచారి’ ట్రైలర్‌లో మంచి టైమింగ్ ఉంది. హ్యూమర్ బాగా పండిందనిపిస్తోంది. జంధ్యాల గారు, రేలంగి గారు, ఈవీవీ గారిలా ఈ చిత్ర దర్శకుడు నర్సింగ్ కూడా గొప్ప దర్శకుడు అవ్వాలని కోరుకుంటున్నా. మల్లేష్ యూట్యూబ్‌లో స్టార్.. ఇప్పుడు హీరోగా ఈ సినిమాలో చేశారు. అందరూ కొత్తవాళ్లే అయినా చాలా బాగా చేశారు. దర్శక నిర్మాతలకు, చిత్ర యూనిట్ సభ్యులందరికీ అభినందనలు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి.’’ అని తెలిపారు.

మరో అతిథి,  నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ..‘‘హీరో ఆరు అడుగులుండాలి. సినిమాలో ఆరు ఫైట్లు, ఆరు పాటలు ఉండాలనేది ఫార్ములా. కానీ ఆ ఫార్ములాను  ఛేంజ్ చేసి ఎవరైనా హీరో అవ్వొచ్చని నిరూపించారు ఈ సినిమా డైరెక్టర్ నర్సింగ్. సంపూర్ణేష్ బాబు వచ్చిన కొత్తలో ఈ అబ్బాయి ఎవరా అని అనుకున్నాం. ఒక సినిమా హిట్ తర్వాత పది సినిమాలు చేశాడు. అలాగే ఈ సినిమా హీరో మల్లేష్‌కు కూడా మంచి భవిష్యత్తు ఉంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన కామెడీ సినిమా ఇది. ఈ సినిమా బాగా ఆడాలి. ట్రైలర్ చూస్తుంటేనే ఈ సినిమా చాలా బాగుందనిపిస్తోంది. తెలంగాణలోనే 50కి పైగా థియేటర్లలో రిలీజ్ చేసి సక్సెస్ చేయాలని కోరుతున్నా. చిత్ర యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని చెప్పారు.

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ..‘‘ఈ సినిమాను నేను ముందే చూశాను. నంది అవార్డు కమిటీ జ్యూరీ సభ్యులు కూడా ఈ సినిమాను చూశారు. ఎన్నికల తర్వాత దుబాయ్‌లో అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తాము. ఈ సినిమాకు నంది అవార్డు కచ్చితంగా వస్తుంది. జ్యూరీ కమిటీకి ఈ సినిమా బాగా నచ్చింది. అందరూ కొత్త వాళ్లతో తీసిన ఈ సినిమాకు కచ్చితంగా నంది అవార్డు వస్తుంది. హీరో మల్లేష్ యాక్టింగ్ చాలా బాగుంది. కొత్త నిర్మాతలు, దర్శకులు ఇండస్ట్రీకి వచ్చి మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. సినిమా చూసి బాగా నవ్వుకుంటారు. బ్రహ్మచారి టైటిల్ కూడా బాగుంది. మే 10న సినిమాలు కూడా తక్కువగా ఉన్నాయి. అది ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. మంచి అభిరుచి ఉన్న ఇలాంటి నిర్మాతలను ఇండస్ట్రీ కూడా ప్రోత్సహించాలి. నా వంతు సహాయం ఎప్పుడూ ఉంటుంది.’’ అని తెలిపారు.

సీనియర్ డైరెక్టర్ చంద్ర మహేశ్ మాట్లాడుతూ..‘‘బ్రహ్మచారి టైటిల్ అక్కినేని నాగేశ్వరరావు గారికన్నా, కమల్ హాసన్ కన్నా మల్లేష్‌కు పర్‌ఫెక్ట్ టైటిల్. చాలా కథలు ప్రేమ కోసం, డబ్బుకోసం విదేశాలకు వెళ్లి వచ్చేవే ఉంటాయి. అలాంటి కథలు ఎప్పుడూ సూపర్ హిట్ అవుతాయి. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ నర్సింగ్ గారు కామెడీ కింగ్ అవుతారు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. అందరూ కొత్తవాళ్లు చేసిన ఈ సినిమా నాలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవడం గొప్ప విషయం. పాటలు, సంగీతం చాలా బాగున్నాయి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని చెప్పారు.

రచయిత దోర వేటి చెన్నయ్య మాట్లాడుతూ.. ‘‘నేను ఈ చిత్రానికి మాటలు, పాటలు మాత్రమే రాశాను. కథ నర్సింగ్‌దే. మా సినిమా మాకు బాగానే ఉంటుంది. కానీ ఈ సినిమా చూసిన పెద్దలు చెప్పిన మాటలు మాకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చాయి. సినిమా విడుదలకు ముందే నంది అవార్డుకు ఎంపికవడం మామూలు విషయం కాదు. ఇది మా సినిమాకు ఎంతో ప్లస్ అవుతుంది.’’ అని అన్నారు.

ఆర్టిస్ట్ గడ్డం నవీన్ మాట్లాడుతూ..‘‘కామెడీ సినిమాల్లో హీరో ఎవరనేది ఎవరూ చూడరు. అందులో కామెడీ ఉందా లేదా అనేదే చూస్తారు. ఇందులో హీరో మల్లేష్ నిజంగానే బ్రహ్మచారిలా ఉన్నాడు. జాతిరత్నాలు, డీజే టిల్లు లాంటి మంచి కామెడీ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా.’’ అని అన్నారు.

చిత్ర హీరో గుంట మల్లేశం మాట్లాడుతూ .. ‘‘నేను ఒగ్గుకథ కళాకారుణ్ణి. అలాంటి నన్ను నర్సింగ్ అన్న ఆర్టిస్ట్‌ను చేశాడు. ఇలాంటి మంచి కామెడీ సినిమాలో నటించే అవకాశం  ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదములు. మే 10న విడుదలయ్యే ఈ సినిమా ఎలా ఉంటుందో చెప్పేందుకు ఇదొక శాంపిల్ మాత్రమే. మా సినిమా టీమ్‌ను ఆశీర్వదించాల్సిందిగా ప్రేక్షకులందరికీ పాదభివందనాలు చేసి అడుగుతున్నా.’’ అని విన్నవించారు.

నిర్మాత రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘‘ఈ సినిమా తీయడానికి కథ చెప్పేటప్పుడు చాలా నేచురల్‌గా అనిపించింది. ఊళ్లో రచ్చబండ వద్ద మాట్లాడుకునేలా ఉంది. సినిమా తీశాక చాలా అద్భుతంగా వచ్చింది. సినిమాను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీడియాదే. మీ మీద నమ్మకంతోనే ఈ చిత్రాన్ని నాలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం. ఈ సినిమా మంచి హిట్ అయితే మరిన్ని సినిమాలు తీసే ప్రోత్సాహం లభిస్తుంది. కాబట్టి ప్రేక్షకులంతా ఈ సినిమాను హిట్ చేయాలని కోరుతున్నా’’ అని అన్నారు.

డైరెక్టర్ నర్సింగ్ మాట్లాడుతూ..‘‘ప్రాపర్‌గా మొత్తం నేర్చుకున్న తర్వాతే ఈ సినిమా తీశాం. టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి చేశారు. ఈ సినిమా నేను తీయడానికి మా గురువు దొరవేటి గారు ఎంతో సపోర్ట్ చేశారు. హీరో మల్లేశం ఒక ఆర్టిస్ట్‌గానే కాకుండా టీ బాయ్‌లాగా కూడా పని చేశాడు. మా టీమ్‌లోని ప్రతి టెక్నీషియన్ అన్ని రకాల పనులు చేశారు. ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం. అందరూ ఆదరించి మా సినిమాను సక్సెస్ చేయాలని కోరుతున్నా’’ అని చెప్పారు.



నటీ నటులు 
మల్లేశం, స్వప్న (కీస్ పిట్ట ), సిరి,రోషిని రజాక్, జూనియర్ రజాక్, రామ స్వామి, లక్ష్మి, స్రవంతి,జబర్దస్త్  ఇటుక నవీన్, శ్రీ కుమారి, మహేందర్ శీలం , ఉదయ్, సైదయ్య, అభిషేక్, శిరీష రావుల, విజయ లక్ష్మి తదితరులు


సాంకేతిక నిపుణులు 
బ్యానర్ : అద్వితీయ ఎంటర్‌టైనర్స్
నిర్మాతలు : రాంభూపాల్ రెడ్డి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : నర్సింగ్ 
సినిమాటోగ్రఫీ : కర్ణ ప్రియాసన్
( అసిస్టెంట్ : శ్రీనివాస్ )
డైలాగ్స్ అండ్ లిరిక్స్ : దోర వేటి 
మ్యూజిక్ : పాండురంగ, 
బి. జి. యం : ఎల్. ఎం. ప్రేమ్ 
కొరియోగ్రఫీ :  రజాక్ 
కో ప్రొడ్యూసర్స్ : చిట్టిబాబు, హస్సాన్ , జావిద్ 
ఆర్ట్ డైరెక్టర్ : నరేందర్ 
ఎడిటర్ : సాయి ఆకుల విజయ్ 
స్టంట్స్ : ఖురేషీ 
ప్రొడక్షన్ మేనేజర్ : భాస్కర్
పీఆర్వో: గోపీ

Comments

Popular posts from this blog

Surya Purimetla's character first look from 'Ari' was released on the occasion of the inauguration of Ayodhya Ram Mandir

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

త్రిగుణ, మేఘా చౌదరి, మల్లి యేలూరి, Dr Y. జగన్ మోహన్, యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ 'జిగేల్' ఫస్ట్ లుక్ రిలీజ్