'భూతద్ధం భాస్కర్ నారాయణ' ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్. ఇందులో చాలా బలమైన పాత్ర చేశాను. ఆడియన్స్ తప్పకుండా సినిమాని ఎంజాయ్ చేస్తారు: హీరోయిన్ రాశి సింగ్
శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్రంలో హీరోయిన్ గా నటించిన రాశి సింగ్ విలేకరుల సమావేశంలో భూతద్ధం భాస్కర్ నారాయణ పంచుకున్నారు.
మీకు సినిమాలపై ఆసక్తి ఎప్పడు ఏర్పడింది ?
మాది రాయ్ పూర్. ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకున్నాను. పరిశ్రమలోకి వచ్చే ముందు ఏడాది కాలం పాటు ఎయిర్ హోస్టెస్ గా ఉద్యగం కూడా చేశాను. అయితే చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి వుంది. చిన్నప్పుడే హీరోయిన్ అయిపోవాలని బలంగా కోరుకున్నాను(నవ్వుతూ). చాలా హార్డ్ వర్క్ చేసి సినిమాల్లోకి వచ్చాను. సంతోష్ శోభన్ తో నటించిన ప్రేమ్ కుమార్ గత ఏడాది విడుదలైయింది. ఆహ లో పాపం పసివాడు చేశాను. ఇప్పుడు శివ కందుకూరి గారితో భూతద్ధం భాస్కర్ నారాయణ లో నటించాను. మేము మొదట్లో ముంబైలో వుండేవాళ్ళం. ఇప్పుడు హైదరాబాడ్ కి షిఫ్ట్ అయిపోయాం. టాలీవుడ్ ఇండస్ట్రీ, హైదరాబాద్ నాకు చాలా నచ్చింది. తెలుగులో మాట్లాడటం కూడా నేర్చుకున్నాను.
భూతద్ధం భాస్కర్ నారాయణ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
ఈ సినిమా హీరోయిన్ కోసం చాలా కాలంగా అన్వేషిస్తున్నారు. తెలుగు రావడంతో పాటు ఓ కొత్త అమ్మాయి కోసం ప్రయత్నిస్తున్నారు. అలాంటి సమయంలో అనుకోకుండా ఈ సినిమా ఆడిషన్ కి వెళ్ళా. డైరెక్టర్ గారు అనుకున్న పాత్రలో నన్ను పర్ఫెక్ట్ ఛాయిస్ అనుకున్నారు.
ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
ఇందులో నా పాత్ర పేరు లక్ష్మీ, చాలా నేచురల్ గా వుంటుంది. ఈ కథ విన్నప్పుడు షాకింగా అనిపించింది. చాలా బలమైన పాత్ర నాది. ఇందులో సస్పెన్స్ థ్రిల్ రోమాన్స్ పాటలు అన్నీ వున్నాయి. ఇందులో రిపోర్టర్ గా కనిపిస్తాను. తర్వాత ఏం జరుగుతుందనే సస్పన్స్ ఇందులో ఆద్యంతం వుంటుంది. క్లైమాక్స్ ని చివరి వరకూ ఎవరూ గెస్ చేయలేరు. శ్రీచరణ్ పాకాల ఇచ్చిన మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించింది. ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ చేసినందుకు చాలా గర్వంగా వుంది.
హీరో శివ కందుకూరి గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
శివ చాలా గొప్ప వ్యక్తిత్వం వున్న హీరో. చాలా వినయంగా, ఓపికగా వుంటారు. వాళ్ళ నాన్న గారు పరిశ్రమలో ప్రముఖ నిర్మాత. అయినప్పటికీ ఏ రోజు ఆయనలో ఆ యాటిట్యూడ్ కనిపించదు. అందరినీ సమానంగా చూస్తారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తప్పకుండా ఈ సినిమా మాకు మంచి విజయాన్ని ఇస్తుందనే నమ్మకం వుంది.
దర్శకుడు పురుషోత్తం రాజ్ గురించి ?
పురుషోత్తం రాజ్ చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఆయన విజన్ చాలా క్లియర్ గా వుంటుంది. సినిమాని చాలా అద్భుతంగా తీశారు. నా పాత్ర చేయడానికి చాలా స్పేష్ అండ్ ఫ్రీడమ్ ఇచ్చారు.
నిర్మాతల గురించి ?
చాలా యంగ్ ప్రొడ్యూసర్స్. సినిమా అంటే పాషన్ వుంది. చాలా సపోర్ట్ ఇచ్చారు. రాజీపడకుండా ఖర్చు చేసి గ్రాండ్ గా నిర్మించారు.
ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు ?
వైవిధ్యమైన పాత్రలు చేయాలని వుంటుంది. ఇప్పటివరకూ నేను చేసిన పాత్ర భిన్నమైనదే. రాబోయే ప్రసన్న వదనం సినిమాలో కూడా చాలా డిఫరెంట్ గా వుంటుంది. అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించాలని వుంది. మంచి ఎమోషనల్ లవ్ స్టొరీ చేయాలని కూడా వుంది. కథ నచ్చితే గ్లామరస్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధమే.
టాలీవుడ్ లో మీ ఫేవరేట్ హీరో ?
అల్లు అర్జున్ గారు. ఆర్య 2 చూసి ఆయన ఫ్యాన్ అయిపోయాను. ఆయన ప్రతి సినిమాలో వైవిధ్యం చూపించడం సర్ ప్రైజ్ గా అనిపిస్తుంటుంది.
కొత్తగా రాబోతున్న చిత్రాలు ?
సుహాస్ గారితో చేసిన ప్రసన్న వదనం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చాలా డిఫరెంట్ మూవీ ఇది.
ఆల్ ది బెస్ట్
థాంక్స్
Comments
Post a Comment