మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు

విల‌క్ష‌ణ డైలాగ్ డెలివ‌రీతో న‌టుడిగా త‌న‌కంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న అభిన‌వ్ గోమ‌ఠం హీరోగా, వైశాలిరాజ్ హీరోయిన్‌గా రూపొందిన చిత్రం మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్  కాసుల క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాక‌పంపై తిరుప‌తి రావు ఇండ్ల ద‌ర్శ‌క‌త్వంలో భ‌వాని కాసుల‌, ఆరెమ్ రెడ్డి, ప్ర‌శాంత్‌.వి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 23న ఈ చిత్రం ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌లైంది. క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో విజ‌యంవంత‌గా ప్ర‌దర్శింప‌బ‌డుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం థ్యాంక్స్  మీట్‌ను ఏర్పాటు చేసింది. చిన్న సినిమా విడుద‌ల కావాలంటే నేడు ఎంతో క‌ష్టమ‌ని,  ఈ సినిమా గురించి ఎన్నో అటుపోటులు ఎదుర్కొన్నాన‌ని, నేడు సినిమా విడుద‌లై ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణంతో విజ‌యవంతంగా ప్ర‌దర్శింప‌బ‌డుతోంద‌ని,  ఇందుకు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి నా ధ‌న్య‌వాదాలు అంటూ క‌న్నీటి ప‌ర్యంత‌మయ్యారు నిర్మాత భ‌వాని కాసుల‌. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ మా చిన్న సినిమాకు మీడియా అందిస్తున్న స‌హ‌కారం మ‌రువ‌లేనిది. వాళ్లు భుజాల‌పై మా సినిమాను మోస్తున్నారు. రోజు రోజుకు సినిమా ప‌ట్ల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పెరుగుతుంది. త‌ప్ప‌కుండా మా సినిమాను అంద‌రూ చూసి  ఎంక‌రైజ్ చేయాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. న‌టుడు అభిన‌వ్ గోమ‌ఠం మాట్లాడుతూ  సినిమా విడుద‌ల వ‌ర‌కు ఎంతో ఒత్తిడి వుండేది. ఫైన‌ల్‌గా  సినిమా ప‌ట్ల ప్రేక్ష‌కుల స్పంద‌న చూసి రిలాక్స్ అయ్యాను. నిర్మాత భ‌వాని గారు ఈసినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. అంద‌రి శ్ర‌మ‌కు త‌గిన ప్ర‌తిఫ‌లం ల‌భించింద‌ని అన్నారు. ఈ స‌మావేశంలో హీరోయిన్ వైశాలి, ర‌చ‌యిత రాధాక్రిష్ణ‌, న‌టులు రోహ‌న్‌రాయ్‌, మెయిన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

Surya Purimetla's character first look from 'Ari' was released on the occasion of the inauguration of Ayodhya Ram Mandir

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

త్రిగుణ, మేఘా చౌదరి, మల్లి యేలూరి, Dr Y. జగన్ మోహన్, యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ 'జిగేల్' ఫస్ట్ లుక్ రిలీజ్