అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ‘బడే మియాన్ చోటే మియాన్’ టైటిల్ ట్రాక్ విడుదల !!!
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియాన్ చోటే మియాన్’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటకి వచ్చింది. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్న పోస్టర్ తో రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ లో బడే మియాన్ చోటే మియాన్ సినిమా రిలీజ్ కాబోతుంది.
ఈరోజు (ఫిబ్రవరి 19న) బడే మియాన్ చోటే మియాన్ సినిమా నుండి టైటిల్ ట్రాక్ విడుదల అయ్యింది. విశాల్ మిశ్రా తనదైన శైలిలో సాంగ్ ను అందించాడు. ఈ ట్రాక్ లో అక్షయ్, టైగర్ హుక్ స్టెప్ ఫ్యాన్స్ ను, మూవీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ గ్లిమ్స్ కు విశేష స్పందన లభించింది. ఈ సినిమాకు ఏక్ థా టైగర్, సుల్తాన్ సినిమాల ఫేమ్ అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తుండగా.. మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏప్రిల్ లో ఈ చిత్రం హిందీ తో పాటు తెలుగు లో విడుదల అవుతోంది.
Comments
Post a Comment