ప్రేమికులంతా చూడాల్సిన సినిమా "ట్రూ లవర్" - టీజర్ లాంఛ్ లో మూవీ తెలుగు ప్రెజెంటర్స్ స్టార్ డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "ట్రూ లవర్". ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాకు తెలుగులో మాస్ మూవీ మేకర్స్, మారుతి టీమ్ ప్రొడక్షన్ పై స్టార్ డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ ప్రెజెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 9న "ట్రూ లవర్" సినిమా థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఇవాళ ఈ సినిమా టీజర్ ను లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా

డైలాగ్స్, లిరిక్ రైటర్ రాకేందు మౌళి మాట్లాడుతూ - కొన్ని సినిమాలు వర్క్ చేస్తున్నప్పుడే బోర్ కొడతాయి. కానీ "ట్రూ లవర్" సినిమాకు వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఇది నా ఫ్రెండ్ మణికందన్ సినిమా. మేము కాలేజ్ డేస్ నుంచి మంచి ఫ్రెండ్స్. నేను అతనికి తెలుగు నేర్పించా. అతను నాకు తమిళ్ నేర్పించాడు. నా ఫ్రెండ్ మూవీకి నేను వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ వాలెంటైన్స్ డేకు మంచి మ్యూజికల్, సినిమా ఎక్సీపిరియన్స్ కావాలంటే "ట్రూ లవర్" సినిమా చూడండి. థియేటర్స్ లో అన్ని వర్గాల ఆడియెన్స్ చూడాల్సిన సినిమా. శ్రీ గౌరి ప్రియ తెలుగు అమ్మాయి. తమిళంలో ఆమె చేస్తున్న రెండో సినిమా ఇది. మణికందన్ తెలుగులో డబ్బింగ్ చెప్పాడు. దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ సూపర్బ్ గా మూవీ రూపొందించాడు. మీరు ఈ సినిమా చూసి థియేటర్స్ నుంచి ఒక మంచి ఫీల్ తో బయటకు వస్తారు. అన్నారు

దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ మాట్లాడుతూ - లవర్స్ మధ్య ఉంటున్న మోడరన్ డే రిలేషన్స్ నేపథ్యంలో "ట్రూ లవర్" సినిమాను రూపొందించాను. వాలెంటైన్ డే వీక్ లో చూసేందుకు మా మూవీ ఒక మంచి ఆప్షన్ గా చెబుతాను. "ట్రూ లవర్" సినిమాను మారుతి గారు, ఎస్ కేఎన్ గారి ద్వారా తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకురావడం హ్యాపీగా ఉంది. మాకు సపోర్ట్ చేస్తున్నందుకు వారికి థ్యాంక్స్ చెబుతున్నా. నేను నా లైఫ్ లో చూసిన అనేక ఇన్సిడెంట్స్ ఈ కథకు స్ఫూర్తినిచ్చాయి. సంఘర్షణ లేనిదే ప్రేమ రాదు. లవ్ అండ్ రిలేషన్ షిప్ లో ఇద్దరి మధ్య పవర్ డైనమిక్స్ మారుతుంటాయి. ఒకరికి ఒకటి కావాలి, మరొకరికి ఇంకొకటి కావాలి. అక్కడే కాన్ ఫ్లిక్ట్ మొదలవుతుంది. మంచి ఎమోషనల్ డ్రైవ్ గా సినిమా ఉంటుంది. థియేటర్స్ లో "ట్రూ లవర్" సినిమాను చూడండి. అన్నారు. 

హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ - తెలుగులో మ్యాడ్, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో పాటు మెయిల్ అనే వెబ్ సిరీస్ లో నటించాను. అయితే ఫస్ట్ టైమ్ మన తెలుగు మీడియా ముందుకు రావడం హ్యాపీగా ఉంది. మా సినిమాను తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకురావడానికి ఎస్ కేఎన్, మారుతి గార్ల కంటే బెటర్ పర్సన్స్ దొరకరేమో. వారిద్దరికి థ్యాంక్స్ చెబుతున్నా. మణి గారు, మా డైరెక్టర్ వ్యాస్ గారు, మిగతా టీమ్ అందరికీ థ్యాంక్స్.  "ట్రూ లవర్" ఒక హానెస్ట్ అండ్ ట్రూ ఫిల్మ్. మోడరన్ డే రిలేషన్స్ ఎలా ఉంటున్నాయి. వాటిలోని లోస్ అండ్ హైస్ గురించి బ్యూటిఫుల్ గా చెప్పిన సినిమా ఇది. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు ఇదొక ఔట్ ఆఫ్ ది వరల్డ్ కథ అనిపించలేదు. మనకో, మనకు తెలిసిన వాళ్లకో జరిగే కథ అనిపించింది. అంత రియలిస్టిక్ అప్రోచ్ తో మూవీ ఉంటుంది. నాకు తమిళంలో ఇది పెద్ద అవకాశం అనుకోవాలి. సినిమా బాగుంటే ఏ భాషలోది అయినా, నటించిన వారు ఎవరైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాగే మా సినిమాను కూడా హిట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో మణికందన్ మాట్లాడుతూ - మేము కొత్త వాళ్లం అయినా మా విజన్ ను నమ్మి తెలుగులో "ట్రూ లవర్" సినిమాను రిలీజ్ చేస్తున్న మారుతి, ఎస్ కేఎన్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. మా సినిమా స్కేల్ చిన్నదే గానీ డ్రీమ్ పెద్దది. ఈ కాన్సెప్ట్ తో ఒప్పించేందుకు ముగ్గురు నలుగురు ప్రొడ్యూసర్స్ దగ్గరకు తిరిగాం. చివరకు మా ఫ్రెండ్స్ మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకుని ఎంజాయ్ చేసేలా "ట్రూ లవర్"  సినిమా ఉంటుంది. తెలుగు తమిళ్  భాష ఏదైనా మనుషులుగా మన ఎమోషన్స్ ఒకటే.  మా మూవీలోని ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయని ఆశిస్తున్నాం. అన్నారు.

ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ - ఈ మధ్య కష్టకాలంలో నాకు సపోర్ట్ గా నిలిచిన మిత్రులు, మీడియా ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందిరికీ థ్యాంక్స్. సినిమాను చూపించేది కెమెరా కన్నుతో కాబట్టి మా మీడియా కెమెరామెన్, వీడియో గ్రాఫర్స్ ఫ్రెండ్స్ ద్వారా ట్రూలవర్ సినిమా టీజర్ రిలీజ్ చేయించాం. నేను, మారుతి డబ్బింగ్ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేశాం. ప్రేమిస్తే, మహా అనే మూవీస్ రిలీజ్ చేశాం. ఇప్పుడు మారుతి పాన్ ఇండియా మూవీ చేసే డైరెక్టర్ సాబ్ గా ఎదిగాడు. మారుతి ఇప్పటికీ రిలీజ్ అయినవి, కానివీ ఇతర భాషల సినిమాలు చూస్తుంటాడు. అప్డేట్ గా ఉంటాడు. అలా "ట్రూ లవర్" సినిమా ఫస్ట్ కాపీ చూసి నన్ను రమ్మని పిలిచాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు మా బేబీ మూవీ చూస్తున్నంత ఎగ్జైట్మెంట్ కలిగింది. తెలుగులో మనమే రిలీజ్ చేద్దామని మారుతి అన్నారు. అలా ఈ ప్రాజెక్ట్ మా చేతిలోకి వచ్చింది. కొత్త దర్శకులు కాంట్రవర్షియల్ గా, కాంటెంపరరీగా రెండు రకాలుగా సినిమాలు చేయొచ్చు. దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ కాంటెంపరరీగా "ట్రూ లవర్" సినిమాను రూపొందించారు. ఫస్ట్ సినిమాకే ఫిలింమేకర్ గా తన ప్రతిభ చూపించాడు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు ,కన్నడ అన్ని భాషల్లో హిట్ అవుతుంది. హిందీ రీమేక్ రైట్స్ కూడా మీ దగ్గరే పెట్టుకోవాలని సూచిస్తున్నా. హీరో మణికందన్ రైటర్ గా మొదలై..యాక్టర్ గా మారారు. ఆయనకు సినిమా మీద మంచి అవగాహన ఉంది. తెలుగు అమ్మాయి శ్రీ గౌరి ప్రియ. నేను మారుతి దాదాపు ఆరేడుగురు తెలుగు అమ్మాయిలను పరిచయం చేశాం. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని చెప్పడం వేరు చేయడం వేరు. మేము ఆచరణలో చూపిస్తున్నాం. శ్రీ గౌరి ప్రియకు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి. రాకేందు మౌళి యానిమల్ లాంటి మూవీకి ఎంత ఎగ్జైటింగ్ గా పనిచేశాడో ఈ మూవీకి కూడా అంతే ఎగ్జైటింగ్ గా పనిచేశాడు.  ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఫిబ్రవరి 9న వస్తున్న పెద్ద సినిమాలతో మేము పోటీలో లేము. మాది చిన్న క్యూట్ సినిమా. ఎవరికీ అభ్యంతరం ఉండదని భావిస్తున్నాం. భాషలకు అతీతంగా ఇండియాలో యూత్ అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది. మనం లవ్ స్టోరీస్ అంటే హీరో హీరోయిన్స్ ఒకరిని ఒకరు ఒప్పించి ప్రేమించుకోవడం చూస్తుంటాం. కానీ ఇందులో రిలేషన్ షిప్ లో ఉన్న జంట మధ్య ఎలాంటి ఒడిదొడుకులు వచ్చాయి అనేది హార్ట్ టచింగ్ గా తెరకెక్కించారు. అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ - నా ఫ్రెండ్ ఉదయ్ "ట్రూ లవర్" సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తూ నాకు ఫోన్ చేసి ఈ సినిమా ట్రైలర్ బాగుంది చూడమని పంపాడు. అది నచ్చి మూవీ కూడా చూశాను. సినిమా చూస్తుంటే ఎంత రియలిస్టిక్ గా మూవీ చేశారనిపించింది. హీరోకు ప్రేమ కావాలి, అతని చుట్టూ ఉన్న పరిస్థితులకు సర్దుకుపోవడం కావాలి. ఈ రెండింటి మధ్య అతను పడే కాన్ ఫ్లిక్ట్ ఎంతో టచింగ్ గా ఉంటుంది. హీరో మణికందన్ క్యారెక్టర్ ను చూస్తుంటే మన ఎదురుగా ఒక వ్యక్తిని చూస్తున్న ఫీల్ కలిగింది. డైరెక్టర్ ప్రభురామ్  వ్యాస్ ఆరేళ్లు కష్టపడి ఈ స్క్రిప్ట్ రాసుకున్నానని చెప్పాడు. ఇది అతని జీవితంలోని కథా, లేక అతని ఫ్రెండ్ లైఫ్ కథా అనేది తెలియదు. తను చూసిన లైఫ్ నే తెరకెక్కించాడు అనిపించింది. డబ్బింగ్ మూవీతో నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. ప్రేమిస్తే సినిమాను రిలీజ్ చేశాం. అది కూడా ఇలాగే సినిమా చూసి బాగుందనిపించి రిలీజ్ చేశాం. ఇన్నాళ్లకు మళ్లీ ఈ ట్రూ లవర్ చూస్తుంటే అలాంటి జెన్యూన్ ఫీల్ కలిగింది. ఈ రోజుల్లో, బస్టాప్ తర్వాత ఆ జానర్ లో మూవీ చేయలేదు. ఈ మధ్య ఎస్ కేఎన్ తో కలిసి బేబి మూవీ చేశాం. ట్రూ లవర్ సినిమాను ప్రేమలో ఉన్నవాళ్లు, ప్రేమలో పడాలనుకుంటున్న వాళ్లు, లవ్ లో లేని వాళ్లు అందరూ చూడొచ్చు. ఎక్కడా అసభ్యత లేకుండా చక్కగా మూవీని రూపొందించారు. మణికందన్ రైటర్, యాక్టర్ కూడా. అతని పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. అలాగే హీరోయిన్ శ్రీ గౌరి తెలుగు అమ్మాయి. ఆమె తమిళ్ డైలాగ్స్ చెప్పడం చూసి..ఎవరు ఈ అమ్మాయి అనుకున్నా. తెలుగు అమ్మాయి అని తెలుసి సర్ ప్రైజ్ అయ్యా. ఆమె బాగా పర్ ఫార్మ్ చేసింది. ఈ సినిమా గురించి తెలిసి దుల్కర్ సల్మాన్ మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ టీమ్ గతంలో గుడ్ నైట్ అనే సినిమాను చేశారు. అది ఒక వ్యక్తి గురక నేపథ్యంతో ఉంటుంది. ఓటీటీలో గుడ్ నైట్ చూసినప్పుడు నాకు ఆ పాయింట్ తట్టితే బాగుండు అనుకున్నా. ఇప్పుడు వీళ్ల సినిమానే రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. తమిళంలో రిలీజ్ అవుతున్న ఫిబ్రవరి 9నే ట్రూ లవర్ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. అన్నారు.

నటీనటులు - మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి, శరవణన్, గీత కైలాసం, హరీశ్ కుమార్, నిఖిల శంకర్, రిని, పింటు పండు, అరుణాచలేశ్వరన్ తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ - రాజ్ కమల్
కాస్ట్యూమ్స్ - నవా రాజ్ కుమార్
ఎడిటింగ్ - భరత్ విక్రమన్
సినిమాటోగ్రఫీ - శ్రేయాస్ కృష్ణ
మ్యూజిక్ - సీన్ రోల్డన్
తెలుగు డైలాగ్స్ - మౌళి
క్రియేటివ్ ప్రొడ్యూసర్ - విజయ్ ఎంపీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - హరీశ్ దురైరాజ్
ప్రొడక్షన్ కంట్రోలర్ - బాల మురుగన్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్  - గుడ్ నైట్ ఆర్ నాగరాజన్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా
బ్యానర్స్ - మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్
ప్రొడ్యూసర్స్ - నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్
తెలుగు రిలీజ్ -  మాస్ మూవీ మేకర్స్, మారుతి టీమ్ ప్రొడక్షన్
ప్రెజెంటర్స్ - మారుతి, ఎస్ కేెన్
రచన దర్శకత్వం - ప్రభురామ్ వ్యాస్

Comments

Popular posts from this blog

Surya Purimetla's character first look from 'Ari' was released on the occasion of the inauguration of Ayodhya Ram Mandir

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

త్రిగుణ, మేఘా చౌదరి, మల్లి యేలూరి, Dr Y. జగన్ మోహన్, యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ 'జిగేల్' ఫస్ట్ లుక్ రిలీజ్