'దిల్ రాజు చేతులమీదుగా ఎర్ర చీర యాక్షన్ ట్రైలర్ రిలీజ్.'
శ్రీ పద్మలయ ఎంటర్టైన్మెంట్ తో కలిసి శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎర్ర చీర. ఎంతో కాలంగా ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్న ఎర్రచీర యాక్షన్ ట్రైలర్ ను మంగళవారం నాడు దిల్ రాజు గారు ఫిల్మ్ ఛాంబర్ నందు విడుదల చేసి చిత్ర బృందాన్ని అభినందించారు. ఎన్. వి.వి. సుబ్బారెడ్డి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా సుమన్ బాబు దర్శకత్వంతో తెరకెక్కింది. ఇక ఈ సినిమా శివరాత్రి సందర్భంగా మార్చి 8 న విడుదల కాబోతోంది. సినిమాలో ఎంతో అధ్బుతమైన 45 ని|| గ్రాఫిక్స్ హైలైట్ అని సినిమా టీం చెబుతోంది. రాజేంద్ర ప్రసాద్ గారి ముద్దుల మనవరాలు బేబి సాయి తేజస్విని అద్భుతంగా నటించింది, కారుణ్య చౌదరి తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుందని మేకర్స్ వెల్లడించారు. శ్రీరామ్, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ , కమల్ కామరాజు సాయి తేజస్విని, రఘుబాబు, ఆలీ, అన్నపూర్ణమ్మ, గీత సింగ్, సత్య కృష్ణ, మహేష్, భద్రం, జీవ తదితర టాలెంటెడ్ ఆర్టిస్టులతో నిర్మించిన ఈ సినిమాకి ఎస్ చిన్న అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా, ప్రమోద్ పులిగార్ల తనదైన శైలిలో మ్యూజిక్, ప్రదీప్ - సౌండ్ ఎఫెక్ట్స్ అందించారు.
డైరెక్టర్ - సుమన్ బాబు
నిర్మాత - ఎన్. వి.వి. సుబ్బారెడ్డి
సినిమాటోగ్రఫీ - చందు
లైన్ ప్రొడ్యూసర్ - అబ్దుల్ రెహమాన్,
ఆర్ట్ - నాని, సుభాష్,
పిఆర్ఓ - సురేష్ కొండేటి,
స్టంట్స్ - నందు,
డైలాగ్స్ - గోపి విమల పుత్ర,
ఎడిటర్ - వెంకట ప్రభు,
చీఫ్ కో డైరెక్టర్ - నవీన్ రామ నల్లం రెడ్డి,
రాజ మోహన్.
Comments
Post a Comment