హీరో సుమన్ చేతుల మీదుగా"ఝాన్సీ ఐపీఎస్" ట్రైలర్ లాంచ్
లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో తమిళ, కన్నడ భాషలలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన "ఝాన్సీ ఐపీఎస్" చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. ప్రముఖ హీరో సుమన్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేసారు. ఈ చిత్రం తెలుగు హక్కులు ఆర్ కె ఫిలిమ్స్ అధినేత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. సుమన్ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయడం ఆ ఆనందంగా ఉంది. సుమన్ గారికి కృతజ్ఞతలు. లక్మీ రాయ్ త్రిపాత్రాభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే యోధురాలు. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు కంపోజ్ చేసిన 8 ఫైట్స్ లక్మీ రాయ్ కెరీర్లో మైలు రాయిగా నిలిచిపోతాయి. ఈ చిత్రానికి కూడా ఫైట్స్ హైలెట్ గా నిలుస్తాయి. లక్మీ రాయ్ చేసిన మూడు క్యారెక్టర్స్ డిఫరెంట్ షేడ్స్ లో ఉంటాయి. విద్యార్థులను మాదక ద్రవ్యాలకు అలవాటు చేసి, యువత భవిష్యత్ ను పెడదారి పట్టించే, డ్రగ్స్ ముఠా ఆటకట్టించే ఐపిఎస్ ఆఫీసర్ గా, గ్రామాల్లో రౌడీల అగడాలకు అడ్డుకట్టవేసే ఉగ్రనారిగా, కుర్రకారును ఉ