:: అత్యంత వైభవముగా 'జై జై దుర్గమ్మ' ట్రైలర్ లాంచ్ ::
చిన్న, మధు ప్రియ హీరో హీరోయిన్లుగా ANI క్రియేషన్స్ పతాకంపై సుభాని దర్శకత్వంలో ఎం.అనిత నిర్మిస్తున్న చిత్రం 'జై జై దుర్గమ్మ'.
ఈ చిత్రంలోని ట్రైలర్ ని ప్రముఖ నిర్మాత సాయి వెంకట్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్ర లోగోను ప్రముఖ దర్శకులు వి. సముద్ర చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ... "ఈమధ్య కాలంలో నేను ఇంత మంచి భారీ గ్రాఫిక్స్ ట్రైలర్ చూడలేదు దేవి, అరుంధతి చిత్రాలు గుర్తుకు వస్తున్నాయి. మంచి విజయం సాధిస్తుంది'' అన్నారు.
నిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ.. "ఫ్యామిలీతో కలిసి చూసే మంచి చిత్రం ఇది. భారీ గ్రాఫిక్స్ తో మీ ముందుకు వస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుంది" అని అన్నారు.
దర్శకులు వి. సముద్ర మాట్లాడుతూ.. నాడు రోజా గారు చేసిన దుర్గమ్మ చిత్రం గుర్తుకువస్తుంది. అందరూ చూసి ఆనందించవలసిన చిత్రం ఇది ట్రైలర్ చాలా బాగుంది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. మంచి విజయం సాధించాలి" అని అన్నారు
నిర్మాత చిన్ని మాట్లాడుతూ .. ఈ సినిమాకు చాలా మంచి కథ అందించారు. ఈ చిత్రాన్ని ఎక్కడ రాజీ పడకుండా నిర్మించాము. ఫ్యామిలీతో కలిసి ఆనందించవలసిన చిత్రం " అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత బి. రాజేశ్వరి మాట్లాడుతూ.. ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంటుంది. జయసూర్య చాలా బాగా సంగీతాన్ని అందించారు. టీమ్ అందరికీ మంచి పేరు తీసుకొస్తుంది" అని అన్నారు.
ఈ చిత్రానికి PRO : బాబు నాయక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : బి.రాజేశ్వరి, కెమెరామెన్ :నందన్ కృష్ణ, సంగీతం : జయసూర్య, ఎడిటర్ : శ్రీను బాబు, ఫైట్స్ : కృష్ణంరాజు, ఆర్ట్ : వెంకట్, నిర్మాత : ఎం.అనిత, కథ, స్క్రీన్ ప్లే, ఎమ్. చిన్న, దర్శకత్వం : సుభాని.
Comments
Post a Comment