Posts

‘ప్రణయ గోదారి’ నుంచి మాస్ బీట్ ‘గు గు గ్గు..’ని రిలీజ్ చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్

Image
ప్రస్తుతం ఫీల్ గుడ్ స్టోరీస్, చిన్న చిత్రాలు, కొత్త టీం చేస్తున్న ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతున్నాయి. ఆ కోవలోనే న్యూ కంటెంట్‌తో రిఫ్రెషింగ్‌ ఫీల్‌తో రూపొందుతున్న చిత్రం 'ప్రణయగోదారి'. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. డిఫెరెంట్ కంటెంట్‌తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్‌. ఈ చిత్రంలో సదన్ హీరోగా, యాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. ప్రణయ గోదావరి గ్లింప్స్, పోస్టర్లు, పాటలు ఆడియెన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా మరో పాటను మేకర్లు విడుదల చేశారు. గు గు గ్గు.. అంటూ సాగే ఈ హుషారైన పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ రిలీజ్ చేశారు. ఈ పాటకు మార్కండేయ బాణీ, సాహిత్యం స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. భార్గవి పిల్లై గాత్రం కుర్రకారుని కట్టి పడేసేలా ఉంది. పాటను రిలీజ్ చేసిన అనంతరం గణేష్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘ప్రణయ గోదారి సినిమాలోని గు గు గ్గు... అనే ప్రత్యేక గీతాన్ని విడుదల చేశాను. పాట చా

వి స‌ముద్ర ద‌ర్శ‌కత్వంలో 'కుంభ' చిత్రం ప్రారంభం

Image
▪️ 5 భాషల్లో పాన్ ఇండియా సినిమాగా 'కుంభ'   ▪️ ఒకేసారి 5 ప్రాజెక్టులు ప్ర‌క‌టించిన వి స‌ముద్ర‌ ▪️ వి. స‌ముద్ర ద‌ర్శ‌క నిర్మాణంలో 5 సినిమాలు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి స‌ముద్ర స్వీయ‌నిర్మాణంలో ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న మూవీ 'కుంభ'.  వి సముద్ర ఫిలిం బ్యానర్‌పై తెర‌కెక్కే ఈ చిత్ర ప్రారంభోత్స‌వం హైద‌రాబాద్ ఫిలింనగర్, దైవ సన్నిధానంలో ఘ‌నంగా జ‌రిగింది. హీరో విజ‌య్ రామ్‌పై ముహూర్త‌పు షాట్‌కు డీఎస్ రావు క్లాప్ కొట్ట‌గా, సముద్ర సతీమణి విజయలక్ష్మి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి స‌న్నివేశానికి చంద్రమహేష్, దేవి ప్రసాద్ గౌర‌వ ద‌ర్శ‌త్వం వ‌హించారు.   ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర‌ ద‌ర్శ‌క‌నిర్మాత‌ వి సముద్ర మాట్లాడుతూ... ''బ‌ల‌మైన‌ కథ‌ల‌ను న‌మ్ముకుని కొత్త వాళ్ల‌తో 5 సినిమాలు చేస్తున్నాను. అందులో 'కుంభ' చిత్రం ఒక‌టి. నా సినిమాల‌కు ప‌ని చేసే టీమ్‌తోనే 'కుంభ' ప్రాజెక్టు చేస్తున్నాను. ఆరు భార‌తీయ భాష‌ల్లో ఈ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాను.  'కుంభ' సినిమాతో పాటు 'వరద రాజు గోవిందం', 'రామ జన్మభూమి', 'ఇండియా సీఈఓ', 'ప్రొడక్షన్ నెం 5

డిసెంబర్ 20న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "విడుదల 2"

Image
దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన "విడుదల 1" థియేట్రికల్ గా ఘన విజయం సాధించినప్పటి నుంచి సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. "విడుదల 2" సినిమా రిలీజ్ కోసం సినీ ప్రియులు, ట్రేడ్ వర్గాలు చూస్తున్నాయి. ఆర్ఎస్ ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్ పై ఎల్రెడ్ కుమార్ నిర్మాణంలో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన "విడుదల 2" రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ 20న ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ఈ రోజు ప్రకటించారు. "విడుదల" సినిమాతో చూస్తే మరింతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా "విడుదల 2" సినిమాను తీర్చిదిద్దారు దర్శకుడు వెట్రిమారన్. మహారాజ మూవీ తర్వాత విజయ్ సేతుపతి నటించిన సినిమాగా "విడుదల 2"పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. స్వరజ్ఞాని ఇళయరాజా సంగీతం "విడుదల 2" మూవీకి మరో ఆకర్షణ కానుంది. భవానీ శ్రీ, రాజీవ్ మీనన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, చేతన్, మంజు వారియర్, అనురాగ్ కశ్యప్ లాంటి ప్రతిభావంతమైన నటీనటులు "విడుదల 2"లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతున్నారు. నటీనటులు - విజయ్ సేతుపతి

రామ్ కార్తీక్ హీరోగా ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్ రూపొందుతోన్న చిత్రం ‘వీక్ష‌ణం’ నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘ఎన్నెన్నో..’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్

Image
యువ క‌థానాయ‌కుడు రామ్ కార్తీక్, క‌శ్వి జంట‌గా రూపొందుతోన్న చిత్రం ‘వీక్ష‌ణం’. ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై మ‌నోజ్ ప‌ల్లేటి ద‌ర్శ‌క‌త్వంలో పి.ప‌ద్మ‌నాభ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లై ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ‘ఎన్నెన్నో...’ అనే లిరికల్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ప్రేయ‌సి ప్రేమ‌లో మునిగిన ప్రేమికుడి మ‌న‌సు ఎలా ఉంటుంద‌నే విష‌యాన్ని చెప్పేలా ఈ సాంగ్ ఉంది. స‌మ‌ర్థ్ గొల్ల‌పూడి సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాట‌ను రెహ్మాన్ రాయ‌గా.. ప్ర‌ముఖ సింగ‌ర్ సిద్ శ్రీరామ్ ఆల‌పించారు. యూత్‌కు క‌నెక్ట్ అయ్యేలా సాంగ్ క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంది. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఫస్ట్ కాపీ కూడా సిద్ధమైంది. సాయిరామ్ ఉద‌య్ సినిమాటోగ్ర‌ఫీ  అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అందిస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. న‌టీన‌టులు: రామ్ కార్తీక్, కశ్వి త‌దిత‌రులు సాంకేతిక వ‌ర్గం: బ్యానర్ : పద్మనాభ సినీ ఆర్ట్స్, నిర్మాత : P. పద్మనాభ రెడ్డి, దర్శకుడు : మనోజ్ పల్లేటి, సినిమాటోగ్రఫీ

ఏదైనా సాధించాలనుకునే ప్రతి ఒక్కరికీ "దీక్ష" సినిమా కనెక్ట్ అవుతుంది - ప్రెస్ మీట్ లో దర్శక నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్‌

Image
ఆర్‌.కె. ఫిలింస్‌, స్నిగ్ధ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై ప్రముఖ దర్శక, నిర్మాత, తెలంగాణ ఫిలిమ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దీక్ష’. పినిశెట్టి అశోక్‌ కుమార్‌, మదాడి కృష్ణారెడ్డి నిర్మాతలు. కిరణ్‌కుమార్‌, అలేఖ్యరెడ్డి  జంటగా నటిస్తున్నారు. తాజాగా జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర ప్రోగ్రెస్ ను తెలిపారు దర్శక నిర్మాత ఆర్ కే గౌడ్. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌.కె.గౌడ్‌ మాట్లాడుతూ - మా ‘దీక్ష’సినిమా షూటింగ్ పూర్తయింది. గ్రాఫిక్ వర్క్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. "దీక్ష" ఉంటే ఏదైనా సాధించగలం అనే పాయింట్ తో మూవీని తెరకెక్కించాం. ఈ పాయింట్ ప్రతి ఒక్క ప్రేక్షకుడికీ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన లైఫ్ లో కూడా ఏదో ఒకటి సాధించాలనే తపనతోనే ఉంటాయి. ఈ మూవీలో హీరో కిరణ్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. భీముడి గెటప్ లో ఆయన చెప్పిన నాన్ స్టాప్ డైలాగ్ హైలైట్ అవుతుంది. ఆయనకు హీరోగా మంచి పేరు తెచ్చే చిత్రమిది. మంచి మ్యూజిక్, పాటలతో మా మూవీ ఆకట్టుకుంటుంది. మా ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారు వెనకుం

'అహో! విక్రమార్క' అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.. దర్శకుడు పేట త్రికోటి

Image
బ్లాక్‌బస్టర్ 'మగధీర'తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు, ఆకర్షణీయమైన నటనతో ఆకట్టుకున్న దేవ్ గిల్ ప్రస్తుతం 'అహో! విక్రమార్క' అంటూ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నారు. రాజమౌళి వద్ద కో డైరెక్టర్‌గా పని చేసిన పేట త్రికోటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దేవ్ గిల్ ప్రొడక్షన్స్ మీద నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రదర్శకుడు త్రికోటి మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే.. * నేను మగధీరకు కో డైరెక్టర్‌గా పని చేశాను. ఆ టైంలోనే దేవ్ గిల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ టైంలో నేనే అతనికి డైలాగ్స్ ప్రాక్టీస్ చేయించేవాడ్ని. అప్పటి నుంచి మా మధ్య మంచి బంధం ఉంది. హీరోగా ఓ సినిమా చేయాలని దేవ్ గిల్ ఎప్పుడూ అంటూ ఉండేవాడు. కానీ నేను అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఆర్ఆర్ఆర్ కోసం పని చేస్తున్న టైంలో దేవ్ గిల్ సినిమా ప్రపోజల్ తీసుకొచ్చాడు. పూణెలో ఓ ఆఫీస్ కూడా ఓపెన్ చేసేశాడు. * దేవ్ గిల్‌కు విలన్ ఇమేజ్ ఉంది. అలాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తిని హీరోగా తెరపైకి తీసుకు రావాలంటే ఎలాంటి జానర్ చేయాలని చాలా అనుకున్నాం. ఫ్యామిలీ, ఎమోషన్ ఇలా ఏద

త్రిగుణ, మేఘా చౌదరి, మల్లి యేలూరి, Dr Y. జగన్ మోహన్, యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ 'జిగేల్' ఫస్ట్ లుక్ రిలీజ్

Image
త్రిగుణ, మేఘా చౌదరి లీడ్ రోల్స్ లో రూపొందుతున్న  యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ జిగేల్. మల్లి యేలూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని Dr Y. జగన్ మోహన్, నాగార్జున అల్లం టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు.    తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. త్రిగుణ కీ సెట్ ని పట్టుకొని ఇంటెన్స్ గా చూస్తున్న ఫస్ట్ లుక్ చాలా క్యురియాసిటీని పెంచింది.  ఈ చిత్రంలో సాయాజీ షిండే, పోసాని, రఘు బాబు, పృథ్వి ప్రముఖ పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు.  కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ కాగా ఆనంద్ మంత్ర మ్యూజిక్ అందిస్తున్నారు. వాసు డీవోపీగా పని చేస్తున్నారు.     ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. సెప్టెంబర్‌లో సినిమాని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు.   నటీనటులు: త్రిగున్, మేఘ చౌదరి,  షియజి షిండే, పోసాని కృష్ణమురళి,  రఘు బాబు, పృథ్వీ రాజ్,  మధు నందన్,  ముక్కు అవినాశ్, మేక రామకృష్ణ, నళిని,  జయ వాణి,  అశోక్, గడ్డం నవీన్,  చందన టెక్నికల్ టీం:  ప్రొడ్యూసర్స్:  Dr Y. జగన్ మోహన్ , నాగార్జున అల్లం  డైరెక్టర్:  మల్లి యేలూరి