వి సముద్ర దర్శకత్వంలో 'కుంభ' చిత్రం ప్రారంభం
▪️ 5 భాషల్లో పాన్ ఇండియా సినిమాగా 'కుంభ'
▪️ ఒకేసారి 5 ప్రాజెక్టులు ప్రకటించిన వి సముద్ర
▪️ వి. సముద్ర దర్శక నిర్మాణంలో 5 సినిమాలు
ప్రముఖ దర్శకుడు వి సముద్ర స్వీయనిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్న మూవీ 'కుంభ'. వి సముద్ర ఫిలిం బ్యానర్‌పై తెరకెక్కే ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ ఫిలింనగర్, దైవ సన్నిధానంలో ఘనంగా జరిగింది. హీరో విజయ్ రామ్‌పై ముహూర్తపు షాట్‌కు డీఎస్ రావు క్లాప్ కొట్టగా, సముద్ర సతీమణి విజయలక్ష్మి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి చంద్రమహేష్, దేవి ప్రసాద్ గౌరవ దర్శత్వం వహించారు.
ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకనిర్మాత వి సముద్ర మాట్లాడుతూ... ''బలమైన కథలను నమ్ముకుని కొత్త వాళ్లతో 5 సినిమాలు చేస్తున్నాను. అందులో 'కుంభ' చిత్రం ఒకటి. నా సినిమాలకు పని చేసే టీమ్‌తోనే 'కుంభ' ప్రాజెక్టు చేస్తున్నాను. ఆరు భారతీయ భాషల్లో ఈ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాను. 'కుంభ' సినిమాతో పాటు 'వరద రాజు గోవిందం', 'రామ జన్మభూమి', 'ఇండియా సీఈఓ', 'ప్రొడక్షన్ నెం 5' వంటి సినిమాలు కూడా ఆరు భారతీయ భాషల్లో పాన్ ఇండియా సినిమాలుగా చేయబోతున్నాను. వి సముద్ర ఫిలిం బ్యానర్‌పై తెరకెక్కే ఈ ప్రాజెక్టులను ప్రకటించడం ఆనందంగా ఉంది. మా కొత్త సినిమాలకు మీ ఆశీర్వాదాలు ఉండాలి.'' అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ వరంగల్ శ్రీను మాట్లాడుతూ.. ''వి సముద్ర గారు చేసివి అన్ని హిట్ టైటిల్సే. ఆయన ప్రతి సినిమా.. ప్రతి ఊరిలో చెప్పుకుంటారు. ఆయన సినిమాలోని పాటలు సందర్భోచితంగా ఉంటాయి. సముద్ర గారి సినిమాకు పని చేయడం నా అదృష్టం జీవితమంతా ఈ అవకాశాన్ని గుర్తుంచుకుంటాను.'' అని అన్నారు.
ప్రముఖ దర్శకులు సముద్ర గారు తనకు అవకాశం ఇవ్వడం సంతోషంగా, గర్వంగా ఉందని హీరో విజయ్ రామ్ అన్నారు. ఆధ్యాత్మికవెత్త రాజు చిత్రయూనిట్‌కు దేవదేవతల ఆశీర్వాచనాలు అందజేశారు. ''సముద్ర గారు గొప్ప డైరెక్టర్. ఆయన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ సినిమా కూడా సూపర్ హిట్ కొడుతుంది'' అని కన్నా దేవరాజ్ భరోసా వ్యక్తం చేశారు.
ఈరోజు శ్రావణ గురువారం రోజున పురస్కరించుకొని మా పిల్లల సినిమా స్క్రిప్ట్ పూజ ఈ సందర్భంలో జరుపుకోవడం జరిగింది.... పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న మా పిల్లల సినిమాని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని v.సముద్ర గారు తెలిపారు
హీరో విజయరామ్ మాట్లాడుతూ గతంలో థియేటర్ ఆర్ట్స్ లో అనుభవం ఉన్న నాకు ఈ సినిమాలో కథానాయకుడిగా అవకాశం ఇచ్చిన డైనమిక్ డైరెక్టర్ v సముద్ర గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అంతేకాకుండా ప్రేక్షక దేవుళ్ళు నన్ను ఇంటిలో మనిషిలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.
ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాత్రతో పరిచయం కాబోతున్న సూరజ్ ఆదిత్య సింగ్ ఈ సినిమా తో సముద్ర గారు వంటి గొప్ప వ్యక్తి పరిచయం అవ్వడం నా పూర్వజన సుకృతం అని భావిస్తున్నాను...
నటీ నటులు :
విజయ రామ్ (హీరో), సూరజ్ ఆదిత్య సింగ్ (విలన్) తదితరులు. జ్యోతి యాదవ్, రవి జంగ్, వరలక్ష్మి శరత్, కుమార్, ఎస్తేర్, రాజీవ్ కనకాల, అజయ్ ఘోష్, బాహుబలి ప్రభాకర్, రవి కాలే, గోలీ సోడా మధు, కోట శ్రీనివాసరావు, దాసన్న, ఆదిత్య సింగ్, జినాల్ పాండే, బెసెంట్ రవి, ధర్మా రెడ్డి, కొమ్మాలపాటి గీత, సునీత. ప్రియదర్శిని. శాంతి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి సముద్ర
నిర్మాత:- వి సముద్ర రావు
సంగీత దర్శకుడు:- వరంగల్ శ్రీను
డీవోపీ:- శ్రీ వెంకట్
ఎడిటర్ :- నందమూరి హరి
రచయిత, సహ దర్శకుడు:- వెంకటేష్ చిక్కాల
ఆర్ట్ డైరెక్టర్:- విజయ్ కృష్ణ
డ్యాన్స్ కొరియోగ్రఫీ:- అజయ్ - senha
ఫైట్ మాస్టర్:- మల్లి
కాస్ట్యూమ్:- మెహబూబ్
మేకప్ :- భాషా
పీఆర్ఓ: కడలి రాంబాబు, అశోక్ దయ్యాల
Comments
Post a Comment