హలో బేబీ సాంగ్ లాంచ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కోటి !!!
ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ నిర్మాణంలో రాబోతున్న చిత్రం *హలో బేబీ* ఈ చిత్రంలో ఒక పాటను *మ్యూజిక్ డైరెక్టర్ కోటి * లాంచ్ చేశారు. *హలో బేబీ* అంటూ ఈ పాటను *సాదిక్ ఇమ్రాన్* రచన మరియు గాత్రం కూడా అందించడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి చిత్రంలో నేను ఎందుకు మ్యూజిక్ ఇవ్వలేదా అని బాధపడుతున్నాను. ఇలాంటి ఒక చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది. కథ వినగానే నేనే ఆశ్చర్యపోయాను. ప్రేక్షకులకి నచ్చే చిత్రం తీసినందుకు నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ కు మరియు యూనిట్ కి ఆల్ ద బెస్ట్ అన్నారు. హలో బేబీ చిత్రం దర్శకత్వం వహించిన రాంగోపాల్ రత్నం, కెమెరామెన్ రమణ కే నాయుడు, ఎడిటర్ సాయిరాం తాటిపల్లి మ్యూజిక్ సుకుమార్ పమ్మి, పనితనం అద్భుతంగా ఉంది. భారతదేశంలోనే మొట్టమొదటి హాకింగ్ సోలో క్యారెక్టర్ చిత్రమైన ఈ హలో బేబీ లో కావ్య కీర్తి ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది అన్నారు నిర్మాత ఆదినారాయణ కాండ్రేగుల.