Posts

యువ హీరోలు పూరి ఆకాష్, రోషన్ కనకాల ముఖ్య అథితులుగా ప్రేమిస్తున్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!

Image
వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో మర్రి రవికుమార్ నిర్వాహణలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు.  ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులలతో పాటు యువ హీరోలు పూరి ఆకాష్, రోషన్ కనకాల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ... మీడియాకు మరియు ప్రేక్షకులకు నమస్కారం. ఒక సినిమా విడుదల తేది వరుకు వచ్చింది అంటే దాని వెనక ఉన్న కష్టాలు నాకు తెలుసు. ప్రేమిస్తున్నా అందరి ఆశీస్సులతో నవంబర్ 7న విడుదల కానుంది,  సాత్విక్ నటన చాలా బాగుంటుంది, డెబ్యూ హీరోలా కాకుండా బాగా చేసాడు. మూవీ యూనిట్ అందరికి బెస్ట్ విషెస్ తెలిపారు. పూరి ఆకాష్ మాట్లాడుతూ...  హీరో సాత్విక్ తనకు తమ్ముడిలాంటివాడని, చిన్నప్పటి నుండి సాత్విక్ చైల్డ్ యాక్టర్‌గా ఎదిగి, ఇప్పుడు హీరోగా తన మొదటి సినిమా చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని చెప్పారు...

మ్యూజికల్ లవ్ స్టొరీ ''ఆవారా" నవంబర్ 22న థియేటర్స్ లో రీ రిలీజ్ !!!

Image
ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరోలతో పాటు.. చిన్న హీరోల సినిమాలు కూడా థియేటర్స్‌లో రీరిలీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంటున్నాయి. అలాగే కొన్ని సినిమాలు రిలీజ్ సమయంలో కంటే.. రీరిలీజ్‌లో ఎక్కువ వసూళ్లు రాబట్టి అదరహో అనిపిస్తున్నాయి. ఇలా రీరిలీజ్ సినిమాలు ఎంజాయ్ చేస్తున్నా సిని లవర్స్‌కు ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అందింది. మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ‘ఆవారా’ చిత్రం రీరిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది.  కార్తీ, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి ఎన్. లింగుస్వామి దర్శకత్వం వహించారు. 2010లో వచ్చిన ఈ మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అయ్యింది, సాంగ్స్‌ యూత్‌ను కట్టిపడేసింది. ఇప్పటికీ ఈ సాంగ్స్ వినపడుతూనే ఉంటాయి.     బాక్సాఫీస్ వద్ద మ్యూజికల్ హిట్‌గా నిలిచింది ఆవారా. ఈ చిత్రం ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘ది ఎవర్ రిఫ్రెషింగ్ లవ్ స్టోరీ ఆవారా నవంబర్ 22న తిరిగి విడుదలవుతోంది.. మ్యూజికల్ హిట్‌ను మరోసారి ఎంజాయ్ చేయండి’ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కర్మణ్యే వాధికారస్తే మూవీ రివ్యూ & రేటింగ్ !!!

Image
కొన్ని చిత్రాలు పేరుతో సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతాయి. అలాగే  ‘కర్మణ్యే వాధికారస్తే’ టైటిల్ తోనే ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై జవ్వాజి సురేంద్ర కుమార్ సమర్పణలో డిఎస్ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా ఈ రోజే థియేటర్స్ లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..  కథ: విశాఖ పట్నంలో కొంత మంది వ్యక్తులతో అమ్మాయిలు అనుమానాస్పదంగా  చనిపోతుంటారు. అయితే ఈ వ్యక్తులకు సంబంధించిన అన్ని చిరునామాలు ఫేక్ అని తెలుస్తాయి.  మరోవైపు మన దేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన అధికారులను కొంత మందిని హనీ ట్రాప్ చేయడానికి కొంత మంది అమ్మాయిలను మన శత్రు దేశాలకు చెందిన ముఠా సభ్యులు ఎరగా వేస్తుంటారు. వారిని కౌంటర్ చేయడానికి ఎన్ఐఏ అధికారి జిష్ణు తన తోటి అధికారితో కలిసి ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు.  మరోవైపు అనుమానాస్పద వ్యక్తుల మరణాల వెనక పెద్ద నెట్ వర్క్ ఉంటుందనే విషయం ఏసీపీ (శత్రు)కు తెలుస్తుంది. మరో కేసుకు సంబం...

నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానున్న "ప్రేమిస్తున్నా" కు టాలెంటెడ్ డైరెక్టర్ "వెంకీ అట్లూరి" బెస్ట్ విషెస్ !!!

Image
వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు. పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకీ అట్లూరి మాట్లాడుతూ... ''ప్రేమిస్తున్నా ట్రైలర్ బాగుంది, నవంబర్ 7న విడుదల కాబోతున్న ఈ సినిమా సక్సెస్ అవ్వాలని సాత్విక్ వర్మ, ప్రీతీ నేహకు మంచి పేరు రావాలని, దర్శకుడు భను కు నిర్మాత కనకదుర్గారావు గారికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు. ప్రేమిస్తున్నా చిత్రం నుండి ఇటీవల సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా ను మేకర్స్ విడుదల చేశారు. 56 సెకెన్స్ నిడివి ఉన్న కంటెంట్ యువతను విపరీతంగా ఆకట్టుకొంటోంది. సినిమా ఎలా ఉండబోతోందో ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది, స్వచ్ఛమైన ప్రేమకథతో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా పోటీపడి నటించారు. దర్శకుడు భాను ప్రేమిస్తున్నా సినిమాను న్యూ ఏజెడ్ లవ్ స్టో...

కర్మణ్యే వాధికారస్తే చిత్రం రిలీజ్ ప్రోమో విడుదల. అక్టోబర్ 31న చిత్రం విడుదల

Image
ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై జవ్వాజి సురేంద్ర కుమార్ సమర్పణలో బ్రహ్మాజీ, శత్రు, 'మాస్టర్' మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కర్మణ్యే వాధికారస్తే. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, మరియు శ్రీ సుధా ముఖ్య పాత్రల్లో నటించారు. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల అవుతుంది. అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క రిలీజ్ ప్రోమో ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ "ఈరోజు మా చిత్రం 'కర్మణ్యే వాధికారస్తే' నుంచి రిలీజ్ ప్రోమో ను విడుదల చేసాం. రిలీజ్ ప్రోమో అదిరిపోయింది, చూసిన వాళ్లంతా ప్రోమో అద్భుతంగా ఉంది అని కొనియాడారు. మా చిత్రం అక్టోబర్ 31న విడుదల అవుతుంది. టైటిల్ కి అనుగుణంగా కథ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. కథ కి సరి సాటిగా బ్రహ్మాజీ, శత్రు మరియు  'మాస్టర్' మహేంద్రన్ వారి నటన తో చిత్రానికి మరింత ప్రాణం పోశారు.  ఇది ఒక సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్,  స్టూడెంట్ హత్యలు, మిస్సింగ్ కేసులు, కిడ్నాప్ ఇలా మనం ప్రతిరోజూ టీవిలో పే...

మంచి కంటెంట్‌తో నవంబర్ 7న రాబోతోన్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ అందరికీ నచ్చుతుంది.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో తిరువీర్

Image
*‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ వంద శాతం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో దర్శకుడు కరుణ కుమార్ *‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో దర్శకుడు ఆదిత్య హాసన్ *మంచి కంటెంట్‌తో రాబోతోన్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో దర్శకుడు యదు వంశీ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నటించిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. బై 7PM , పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 7న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్, టైటిల్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో మంగళవారం నాడు చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కి దర్శకులు కరుణ కుమార్, యదు వంశీ, ఆదిత్య హాసన్, రామ్ అబ్బరాజు, సన్నీ, దుశ్యంత్, ఉదయ్ గు...

నవంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న 1990's చిత్రం

Image
ఎమ్.ఎమ్.సి బ్యానర్ పై అరుణ్, రాణి వరద్ జంటగా నటిస్తూ తెరకెక్కుతున్న చిత్రం 1990's. కర్ణాటకలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం 1990's. అద్భుతమైన లొకేషన్స్ లో ఈ చిత్రంలోని పాటలు చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని నంబరు 1వ తేదీన వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.  నందకుమార్ సి.ఎమ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు నిర్మాత చంద్ర శేఖర్ BS. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది.  EC మహారాజ్ సంగీతం అందించిన ఈ సినిమాకు హాలేస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కృష్ణ ఎడిటింగ్ చేయగా సాధిక్ సర్దార్ సినిమాటోగ్రఫీ చేశారు.