Posts

‘కింగ్‌డమ్’ చిత్రం.. ఇది ప్రేక్షకుల విజయం : సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం

Image
ఆ వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం సాధ్యమైంది : కథానాయకుడు విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ వసూళ్లు అద్భుతంగా ఉన్నాయి : నిర్మాత సూర్యదేవర నాగ వంశీ  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూసిన ‘కింగ్‌డమ్’ చిత్రం నేడు థియేటర్లలో అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ నేడు(జూలై 31) విడుదలైన ‘కింగ్‌డమ్’ చిత్రం.. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ‘కింగ్‌డమ్’ సినిమా వెండితెరపై ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోందని, విజువల్ గా అద్భుతంగా ఉందని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకులను మెప్పు పొందుతూ.. షో షోకి వసూళ్లను పెంచు...

కింగ్డమ్ మూవీ రివ్యూ & రేటింగ్ !!!

Image
    విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సే జంటగా గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కింగ్డమ్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదల అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి. కథ: అంకాపూర్ పోలీస్ స్టేషన్‌లో సూరి (విజయ్ దేవరకొండ) కానిస్టేబుల్. అన్యాయాన్ని చూస్తే ఆవేశానికి గురై చిక్కుల్లో పడుతుంటాడు. చిన్నతనంలో పారిపోయిన తన అన్న శివ (సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. ఓ సమస్యలో ఇరుక్కుపోయిన సూరి సస్పెన్షన్‌‌ వేటు పడే సమయంలో తన ఉన్నతాధికారి ఓ సీక్రెట్ మిషన్‌‌ను అప్పగిస్తాడు. ఆ ఆపరేషన్‌ చేయడానికి ఇష్టం లేకపోయినా.. శ్రీలంకలో ఉన్న తన అన్న శివను కలిసే అవకాశం రావడంతో ఒప్పుకొంటాడు. దాంతో స్పెషల్ ఆపరేషన్ కోసం శ్రీలంకలో అడుగుపెడుతాడు. చిన్నతనంలో తన అన్న శివ ఇంటి నుంచి ఎందుకు పారిపోతాడు? తన తండ్రి మరణానికి శివ ఎందుకు కారణమయ్యాడు? శ్రీలంకలో ఓ జాతికి శివ ఎలా నాయకుడయ్యాడు? శ్రీలంకలో అడుగుపెట్టిన సూరికి ఎదురైన సమస్యలు ఏమిటి? శివను సూరి ఇండియాకు తీసుకు రావాలన్న ప్రయత్నాలు ఎలా కొనసాగాయి? ...

సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్ “నెట్‌వర్క్” నేటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్

Image
తెలుగు ప్రేక్షకులకు క్యాలిటీ కంటెంట్ అందించడంలో ముందున్న ఆహా ఓటీటీలో ఇప్పుడు మరో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్‌ "నెట్‌వర్క్"తో ముందుకొస్తోంది. శ్రీకాంత్ శ్రీరామ్, కామ్నా జెఠ్మలానీ, ప్రియా వడ్లమాని, శ్రీనివాస్ సాయి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే, అత్యద్భుత విజువల్స్‌తో మొదటి సన్నివేశం నుంచి చివరిదాకా కట్టిపడేసే ఈ సిరీస్‌కు సతీష్ చంద్ర నాదెళ్ళ దర్శకత్వం వహించారు. రమ్య సినిమా బ్యానర్‌పై లావణ్య యన్ఎస్, ఎంజి జంగం నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సిరీస్‌పై భారీ అంచనాలను పెంచింది. ఆన్లైన్ డిపెండెంట్, ఆన్లైన్ గ్యాంబ్లర్, ఆన్లైన్ డేటింగ్, ఆన్లైన్ ఇన్ఫ్లూయన్సర్… ఇలా నాలుగు పాత్రలు నెట్‌వర్క్ బ్యాక్‌డ్రాప్‌తో ముందుకు సాగడం, ఆ తర్వాత కథలో వచ్చే మలుపులు చాలా ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేశాయి. ''మనం డైరెక్షన్స్ ఇస్తే పని చేయాల్సిన వస్తువు… మన లైఫ్‌ని డైరెక్ట్ చేయకూడదు'' అనే డైలాగ్ నెట్‌వర్క్ కథ డెప్త్‌ను ప్రజెంట్ చేస్తోంది. తాగుబోతు రమేష్, సమ్మెట గాంధీ, జోష్ రవి, మీనా కుమారి, ఛత్రపతి శేఖర్, శివ (హిట్ 2), పద్మంజలి, కల్పలత (పుష్ప తల్లి)...

వార్ 2 లోని సూపర్ స్టార్ హృతిక్ రోషన్ మరియు కియారా అద్వానీ ప్రేమ పాట హిందీ భాషతో పాటు తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల కానుంది

Image
సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కియారా అద్వానీ నటించిన  వార్ 2 నుండి మొదటి పాట జూలై 31న తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ పాటను కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారు. హృతిక్ రోషన్ మరియు కియారా అద్వానీ నుండి వస్తోన్న ఈ రొమాంటిక్ ట్రాక్ ఒక ఫ్లాష్‌బ్యాక్ సాంగ్, ఇది హృతిక్ కబీర్ మరియు కియారా కావ్య గా ఎమోషన్ సాంగ్ గా తెరకెక్కింది, ఈ సాంగ్ కబీర్ గతాన్ని తిరిగి గుర్తుచేసే లవ్ సాంగ్ గా చెప్పవచ్చు. ఈ రొమాంటిక్ సాంగ్ హృతిక్ యొక్క రహస్యమైన గూఢచారి మరియు కియారా ఫ్రాంచైజీకి కొత్తగా జోడించబడిన వారి మధ్య నేపథ్య కథలోకి తీసుకొనివెళుతోంది.  వార్ 2 టీజర్ మరియు ట్రైలర్ కబీర్ యొక్క మోసపూరిత పంథాను మరియు అధిక-పనుల యాక్షన్‌ను టీజ్ చేయగా, ఫ్లాష్‌బ్యాక్ ట్రాక్ భావోద్వేగాలను జోడిస్తుంది, అభిమానులకు ఈ మిషన్ వెనుక ఉన్న వ్యక్తి గురించి తెలియజేస్తోంది. రోమ్ మరియు టస్కానీతో సహా ఉత్కంఠభరితమైన యూరోపియన్ ప్రదేశాలలో చిత్రీకరించబడిన ఈ పాట, సెట్ నుండి లీక్ అయిన విజువల్స్ వైరల్ అయినప్పుడు ఇప్పటికే భారీ సంచలనాన్ని సృష్టించింది. ఇప్పుడు, అభిమానులు ఆ విజువల్స్‌ను సజీవంగా ఉండ...

Pawan Kalyan’s powerhouse performance turns Hari Hara Veera Mallu into a historical blockbuster

Image
Blockbuster Hari Hara Veera Mallu’s historical run at the box office continues Power Star Pawan Kalyan’s latest film Hari Hara Veera Mallu turns out to be the biggest blockbuster in his career. The historical film has now got a Vfx upgrade — the reloaded version has elevated the profound impact on storytelling. It has elevated the film’s visual appeal and is creating an immersive experience for the audiences. The phenomenal run of Hari Hara Veera Mallu continues with families and friends flocking to the theaters in large numbers during the weekdays… setting the box office collections on fire. Also, the trimmed version is more compelling and amplifies the emotional impact making Hari Hara Veera Mallu one of the most significant historical films. “Pawan garu’s powerhouse performance as Veera Mallu is intense and authentic. His transformative journey and clinical approach to the character has been inspiring,” said Jyothi Krisna. The director further adds that the conviction wi...

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

Image
నా నుంచి అభిమానులు కోరుకుంటున్న విజయం ‘కింగ్‌డమ్’తో రాబోతుంది: ప్రీ రిలీజ్ వేడుకలో కథానాయకుడు విజయ్ దేవరకొండ  ‘కింగ్‌డమ్’ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలుస్తుంది: సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకువెళ్ళింది. సోమవారం(జూలై 26) సాయంత్రం హైదరాబాద్ లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌ లో ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక అంగర...

''బాలుగాడి లవ్ స్టోరీ'' ఆగస్ట్ 8న థియేటర్స్ లో విడుదల !!!

Image
ఆకుల అఖిల్, దర్శక మీనన్, చిత్రం శ్రీను, గడ్డం నవీన్, చిట్టిబాబు, రేవతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'బాలుగాడి లవ్ స్టోరీ'. శ్రీ ఆకుల భాస్కర్ సమర్పణలో భామ క్రియేషన్స్ పతాకంపై ఆకుల మంజుల నిర్మిస్తున్న చిత్రానికి యల్. శ్రీనివాస్ తేజ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బాలుగాడి లవ్ స్టోరీ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ 8న విడుదల కాబోతోంది. ఈ సినిమాను 'సిల్వర్ స్క్రీన్' గణేష్ భారీ రిలీజ్ చేయబోతున్నారు, బాలుగాడి లవ్ స్టోరీ సినిమా ఆద్యాంతం నేటి యూత్ కు నచ్చేలా రొమాన్స్, యాక్షన్, సస్పెన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. ఈ సినిమా పట్ల చిత్ర యూనిట్ కు మంచి విశ్వాసం ఉంది.  ఆకుల అఖిల్, దర్శక మీనన్, చిత్రం శ్రీను, జబర్దస్త్ గడ్డం నవీన్, జబర్దస్త్ చిట్టిబాబు, రేవతి, లక్ష్మి, రాఘవరావు, మహేష్, సూరజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ శ్రీ ఆకుల భాస్కర్, బ్యానర్ భామ క్రియేషన్స్, రైటర్, డైరెక్టర్ యల్. శ్రీనివాస్ తేజ్, నిర్మాత ఆకుల మంజుల, డి.ఓ.పి రవి కుమార్ నీర్ల, మ్యూజిక్ డైరెక్టర్ ఘనశ్యామ్, ఎడిటర్ యాదగిరి కంజారాల ల...