‘కింగ్డమ్’ చిత్రం.. ఇది ప్రేక్షకుల విజయం : సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం
ఆ వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం సాధ్యమైంది : కథానాయకుడు విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ వసూళ్లు అద్భుతంగా ఉన్నాయి : నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూసిన ‘కింగ్డమ్’ చిత్రం నేడు థియేటర్లలో అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ నేడు(జూలై 31) విడుదలైన ‘కింగ్డమ్’ చిత్రం.. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ‘కింగ్డమ్’ సినిమా వెండితెరపై ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోందని, విజువల్ గా అద్భుతంగా ఉందని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకులను మెప్పు పొందుతూ.. షో షోకి వసూళ్లను పెంచు...