Posts

DIFFERENT English movie Trailer Released, All set for April 18th Theatrical release !!!

Image
Under the banner of Wonder Brothers International Films Pvt. Ltd., the film Different stars G.N. Nash, Azeez Cheemaruv, Pretty Jo, Sana, and Robert in lead roles. Produced by N.S.V.D. Shankara Rao and directed by Dragon (Uday Bhaskar), the cinematography is handled by Leon R. Bhaskar, and music is composed by Nihal. This film boasts a team of talented technicians and is considered a top-quality production. The makers have now released the trailer of the film. The trailer looks very impressive — a suspense thriller, Different is all set to release in theaters on April 18. With international standards and superb visuals, the trailer hints at a gripping movie experience. Different is a Hollywood film made by Telugu producer N.S.V.D. Shankara Rao. The project was initiated with the intention of delivering quality cinema. The team believes that if the story and content are strong, audiences will always support such films — and Different aims to be just that. The film, releasing ...

మైనే ప్యార్ కియా అధికారిక ఫస్ట్ లుక్ విడుదల: ఈ జూలైలో తెరపైకి రానున్న రొమాంటిక్ కామెడీ-థ్రిల్లర్

Image
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మలయాళ చిత్రం మైనే ప్యార్ కియా తన ఫస్ట్ లుక్‌ను అధికారికంగా ఆవిష్కరించింది, ఇది రొమాన్స్, కామెడీ మరియు సస్పెన్స్‌లను మిళితం చేసే థ్రిల్లింగ్ మరియు నవ్వులతో నిండిన సినిమా ప్రయాణాన్ని చూపిస్తుంది. నూతన దర్శకుడు మరియు రచయిత ఫైజల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్పైర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంజు ఉన్నితన్ నిర్మించారు, ఇది ఇండస్ట్రీ హిట్ మందాకిని తర్వాత కంపెనీ యొక్క నాల్గవ ప్రధాన వెంచర్‌గా గుర్తించబడింది. కంటెంట్-రిచ్ కమర్షియల్ సినిమాను విజేతగా నిలిపినందుకు పేరుగాంచిన స్పైర్, ఈ శైలిని వంచించే ఎంటర్‌టైనర్‌తో తన వారసత్వాన్ని కొనసాగిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ అద్భుతమైనది మరియు కథన సూచనలతో నిండి ఉంది. హృదు హరూన్ మరియు ప్రీతి ముకుందన్ రక్తంతో తడిసిన మరియు గొప్పగా రూపొందించిన ఎరుపు పూల నేపథ్యంలో స్టైలిష్‌గా కనిపిస్తారు.  చిరిగిన ముండు, ఉత్సాహభరితమైన చొక్కాలో బరువైన హృదు, మనుగడకు గుర్తుగా గాయాలను కలిగి ఉండగా, తెల్లటి గౌనులో కప్పబడిన ప్రీతి, చలినిచ్చే ప్రశాంతతతో రక్తంతో తడిసిన కత్తిని పట్టుకుంది. ఈ పోస్టర్ దీనికి విరుద్ధంగా ఒక మాస్టర్ క్లాస్, అమాయకత్వాన్...

హిలేరియస్ ఫన్ రైడ్ మూవీ "ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్" నుంచి 'ఏదో ఏదో..' లిరికల్ సాంగ్ రిలీజ్

Image
రాహుల్ విజయ్, నేహా పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నసినిమా "ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్". ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. "ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్" సినిమాను హిలేరియస్ ఫన్ రైడ్ గా నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ మూవీ నుంచి 'ఏదో ఏదో..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. 'ఏదో ఏదో..' రిలికల్ సాంగ్ కు పూర్ణాచారి క్యాచీ లిరిక్స్ అందించగా, సురేష్ బొబ్బిలి బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. కార్తీక్, హరిణి మంచి ఫీల్ తో పాడారు. 'ఏదో ఏదో..' సాంగ్ ఎలా ఉందో చూస్తే...'ఏదో ఏదో ఏదో జరిగెనే యెద లోపలా, ఏవో ఏవో కలలు విరిసెనే, నిన్నా మొన్నా లేదే అరే ఏంటిలా, ఉన్నట్టుండి ముంచేశావిలా, మనసే ముసుగులు తీసే, అడుగులు వేసే బయటకు నీతోనే, కలిసే నిమిషం వణికే, పెదవులు పలికే తకధిమి తందానే...' అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట. *నటీనటులు* - రాహుల్ విజయ్, నేహా పాండే, అజయ్ ఘోష్, మురళీధర్ గౌడ్, గెటప్ శ్రీను, రచ్...

సిలికాన్‌లోని పెర్ప్లెక్సిటీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడతో పాటుగా సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

Image
ప్రఖ్యాత నటుడు, నిర్మాత, దర్శకుడు కమల్ హాసన్ ప్రస్తుతం సిలికాన్‌లోని AI-ఆధారిత రీసెర్చ్ సెంటర్ అయిన పెర్ప్లెక్సిటీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిశారు. భారతీయ సినిమా పరిశ్రమలో గత కొన్ని దశాబ్దాలుగా విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ, సినీ పరిశ్రమ ఎదుగుదలకు కృషి చేస్తున్న కమల్ హాసన్ ఇలా భవిష్యత్తుని శాసించబోతోన్న ఏఐ రీసెర్చ్ సెంటర్‌ను సందర్శించడంతో మరిన్ని విప్లవాత్మక మార్పుల్ని తీసుకు రాబోతోన్నారు. ఈ సందర్శన తర్వాత కమల్ హాసన్ సోషల్ మీడియాలో.. ‘సినిమా నుండి సిలికాన్ వరకు ప్రతీ ఒక్కటీ నిత్యం అభివృద్ది చెందుతూనే ఉంటాయి. ఎంత కనిపెట్టినా, ఏం చేసినా కూడా ఇంకా ఏదో చేయాలని, కనిపెట్టాలనే ఆ కూతుహలం, ఆ దాహం ఇంకా మనలో ఉంటూనే ఉంటుంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని పెర్ప్లెక్సిటీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడంతో నాలో ఇంకా కొత్త ఆలోచనలకు ప్రేరణ లభించినట్టు అనిపిస్తుంది. అరవింద్ శ్రీనివాస్‌, అతని బృందం కలిసి భవిష్యత్తును నిర్మించడంలో మన భారతీయ చాతుర్యం ప్రకాశిస్తుంది’ అని అన్నారు. ఈ భేటీపై అరవింద్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘పర్ప్లెక్సిటీ కార్యాలయంల...

వృషభ మూవీ రివ్యూ & రేటింగ్ !!!

Image
వి.కె.మూవీస్‌ పతాకంపై యుజిఓస్‌ ఎంటర్టైన్మెంట్స్‌ సగర్వ సమర్పణలో అశ్విన్‌ కామరాజ్‌ కొప్పల దర్శకత్వంలో ఉమాశంకర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం వృషభ. నిర్మాత ఉమాశంకర్‌రెడ్డి కథను అందించిన ఈ చిత్రంలో జీవన్‌, అలేఖ్య హీరో, హీరోయిన్‌లు.. కృష్ణా అండ్ శ్రీలేఖ ముఖ్యపాత్రలో చేశారు..ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం. కథ: 1960 సంవత్సరంలో, ఒక మర్మమైన వ్యాధి పశువులను సోకింది, ఇది వాటి వేగవంతమైన మరణానికి దారితీసింది మరియు భారతదేశంలో తీవ్రమైన పోషకాహార లోపానికి భయపడి శాస్త్రీయ సమాజానికి పెద్ద సవాలుగా మారింది. శాస్త్రవేత్తలు వారి వారి ప్రయోగశాలలలో పరిశోధన ప్రయత్నాలను ప్రారంభించారు, కానీ ఫలించలేదు. శాస్త్రవేత్త సుశ్రుతానందన్ వంటి ప్రముఖుడు కూడా పరిష్కారం లేకుండా అనేక మార్గాల తర్వాత విఫలమయ్యాడు. అతను హిమాలయాలలో గౌరవనీయమైన రుద్రాక్ష దిగంబర స్వామిని కనుగొనడానికి ఒక ప్రయాణాన్ని ప్రారంభించాడు, ఈ మర్మమైన వ్యాధికి క్లోమం వలె ప్రకృతి శక్తిని నమ్మాడు. పరీక్షలు మరియు కష్టాలను భరించిన తర్వాత సుశ్రుతానందన్ మరియు అతని సహాయకుడు అడగకుండానే ధ్యానంలో మునిగిపోయిన అఘోర రుద్రకేశ దిగంబర స్వామిని చేరుకున్నారు. స్వా...

నటుడు రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా 'ఏరువాక ఆగే' పాట విడుదల, 'జగమెరిగిన సత్యం' ఏప్రిల్ 18న థియేటర్స్ లో సందడి !!!

Image
అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన చిత్రం జగమెరిగిన సత్యం. అచ్చ విజయ భాస్కర్ నిర్మించిన ఈ చిత్రానికి తిరుపతి పాలే దర్శకత్వం వహించారు. అవినాష్ వర్మ ఆద్య రెడ్డి, నీలిమ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్ర షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని ఏప్రిల్18న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ మూవీ నుండి ఏరువాక ఆగే అనే సాంగ్ ను ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ నేపద్యంలో 1994 లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తిరుపతి పాలే. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా నిర్మాత అచ్చ విజయ భాస్కర్ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. సురేష్ బొబ్బిలి అందించిన ఈ చిత్ర పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.... జగమెరిగిన సత్యం టైటిల్ బాగుంది. నేను విడుదల చేసిన ఏరువాక ఆగే సాంగ్ ఎమోషనల్ గా ఉంది. మంచి కథ కథనాలతో వస్తోన్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సినిమా సక్సెస్ అయ్యి చిత్ర యూనిట్ అందరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను అన్నార...

అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్, అఖిల్ అక్కినేని తదుపరి చిత్రం LENIN; పవర్‌ఫుల్ టైటిల్ గ్లింప్స్ విడుదల

Image
తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ప‌రిచ‌యం అక్క‌ర్లేని ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ‌లు అన్న‌పూర్ణ స్టూడియోస్‌, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్. యంగ్ అండ్ డైన‌మిక్ అఖిల్ అక్కినేని తాజా సినిమాను నిర్మిస్తున్నాయి. అఖిల్ 6ని అక్కినేని నాగార్జున‌, నాగ‌వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్కినేని అఖిల్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని అఖిల్ 6వ చిత్రానికి లెనిన్ అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ని ప్ర‌క‌టించారు. ముర‌ళీ కిశోర్ అబ్బూరు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు ముర‌ళీకిశోర్ అబ్బూరు. ఇంట‌న్స్, యాక్ష‌న్ ప్యాక్డ్ ఎక్స్ పీరియ‌న్స్ తో రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో రోమాలు నిక్క‌బొడుచుకునేలా సాగింది లెనిన్ గ్లింప్స్. టైటిల్ గ్లింప్స్ పవర్‌ఫుల్ విజువల్స్‌తో ప్రారంభమయింది.  ఆధ్యాత్మిక అంశాల‌ను చొప్పిస్తూ ఆద్యంతం ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు మేక‌ర్స్. అఖిల్ అక్కినేని... స్ట‌న్నింగ్ లెనిన్ కేర‌క్ట‌ర్‌కి అద్భుతంగా సూట్ అయ్యారు. ఆయ‌న ద‌ట్ట‌మైన మీసం, పొడ‌వాటి జుట్టు, మ్యాచో అవ‌తార్‌కి ప‌క్కాగా సూట్ అయ్యాయి.  స్ట్రైకింగ్ స్క్రీన్ ప్రెజెన...