Posts

అశ్విన్ బాబు హీరో గా, మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం లో, టి. గణపతి రెడ్డి, అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద నిర్మిస్తున్న చిత్రం 'వచ్చిన వాడు గౌతమ్' ఈ చిత్రం నుండి పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

Image
డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు నుండి వస్తున్న మరో ఎక్సయిటింగ్ మూవీ 'వచ్చినవాడు గౌతమ్'. మెడికల్ యాక్షన్ మిస్టరీ  గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి లావిష్ గా నిర్మిస్తున్నారు.   గోల్డ్ లైన్ క్రియేషన్స్, ప్రవల్లిక యోగి కో - ప్రొడ్యూసర్. బ్లెడ్ అండ్ స్టెత్ తో ఉన్న అశ్విన్ బాబు లుక్ సినిమాపై  క్యురియాసిటీని పెంచింది. ఈ చిత్రంలో సాయి రోణక్ కేమియో పాత్ర లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో అశ్విన్ బాబు తో పాటు, రియా సుమన్, అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్,   ఖేడేకర్, అభినయ,  అజయ్, VTV గణేష్, యెష్నా చౌదరి, సుదర్శన్, శకలక శంకర్, రాఘవ, అమర దీప్, అభిత్ భూషణ్, నాగి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. గౌర హరి మ్యూజిక్ అందిస్తుండగా, ఎం. ఎన్ బాల్ రెడ్డి డీవోపీ, M R వర్మా ఎడిటర్. సురేష్ భీమగని ఆర్ట్ డైరెక్టర్  గా పని చేస్తున్...

శ్యామ్ సింగ రాయ్ రచయితగా నాకు గుర్తింపుతో పాటు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.

Image
టాలెంటెడ్ రైటర్ సత్యదేవ్ జంగా నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాకు కథను అందించారు. ఏప్రిల్ 6న తన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ... ఈ సందర్భంగా రైటర్ సత్యదేవ్ జంగా మాట్లాడుతూ... నేను ఏ ఫిలిం బై అరవింద్ సినిమా కథ రచయితగా పరిచయం అయ్యాను, ఆ సినిమా తరువాత ఆదిత్య మ్యూజిక్ కంపెనీలో సీనియర్ మేనేజర్ గా 20 ఏళ్ళు వర్క్ చేశాను. టాప్ సింగర్స్ తో 200 ప్రవేట్ ఆల్బమ్స్ చేశాను.  సంగీత దర్శకుడు చక్రిని బాచి సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం చేశాను, పూరి జగన్నాద్ తో నాకు ఉన్న పరిచయం తో చక్రిని ఎంకరేజ్ చెయ్యడం జరిగింది. అలా సినిమా ఇండస్ట్రీ తో పరిచయాలు బలపరుచుకొని, సాహిత్యం మీద మక్కువతో 2020లో ఆదిత్య మ్యూజిక్ నుండి బయటికి వచ్చి పూర్తిగా రచన వ్యాసంగం పై ఫోకస్ చేస్తూ... పునర్జర్మ బాక్డ్రాఫ్ లో పిరియడిక్ లవ్ స్టోరీతో ఒక కథను సిద్ధం చేసుకున్నాను.  ఈ కథను దర్శకుడు రాహుల్ సాంకృతియన్ కు చెప్పడం జరిగింది తనకు ఈ కథ నచ్చి హీరో నానికి, సాయి పల్లవికి వినిపించడం జరిగింది. వారిద్దరికి ఈ కథ విపరీతంగా నచ్చడంతో శ్యామ్ సింగ రాయ్ చిత్రంగా రోపొంది ఘన విజయం సాధించింది. ఈ సినిమా రచయితగా నాకు...

థియేటర్, టీవీ, ఓటీటీ ఎక్కడ రిలీజైనా "28°C" మూవీ ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది - హీరో నవీన్ చంద్ర

Image
తెలుగుతో పాటు తమిళంలో పలు హిట్ మూవీస్, వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నవీన్ చంద్ర. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా "28°C". ఈ చిత్రాన్ని ఎమోషనల్ థ్రిల్లర్ లవ్ స్టోరీతో రూపొందించారు "పొలిమేర" ఫేమ్ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్.  "28°C" చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ సాయి అభిషేక్  నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర సరసన షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెల 4వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.  ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో "28°C" మూవీలో నటించిన ఎక్సిపీరియన్స్ తెలిపారు హీరో నవీన్ చంద్ర. - ఆరేళ్ల కిందట ఈ మూవీ జర్నీ బిగిన్ అయ్యింది. ఒకరోజు రెస్టారెంట్ లో ఉండగా డా. అనిల్ విశ్వనాథ్ కలిసి తన దగ్గర స్టోరీ ఉందని చెప్పారు. రెండ్రోజుల తర్వాత కథ విన్నాను. చాలా యూనిక్ గా అనిపించింది. 28 డిగ్రీల టెంపరేచర్ లో తన జీవిత భాగస్వామిని కాపాడుకునే వ్యక్తి కథ ఇది. ఈ క్రమంలో ఆ జంట చేసిన ఎమోషనల్ జర్నీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగుతుంది. వినగానే ఈ కథ కొత్తగా ఉం...

షూటింగ్ పూర్తి చేసుకున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బ్లడ్ రోజస్ !!!

Image
టీబీఆర్ సినీ క్రియేషన్స్ లో కె,నాగన్న మరియు కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కె నిర్మాతగా ఎల్లప్ప కో ప్రొడ్యూసర్ గా ఎంజిఆర్ రచయిత మరియు దర్శకత్వంలో వస్తోన్న చిత్రం బ్లడ్ రోజస్. ఈ చిత్ర ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. డైరెక్టర్  ఎంజిఆర్ మాట్లాడుతూ... బ్లడ్ రోజస్ సినిమా లో రంజిత్ రామ్, అప్సర రాణి చక్కగా నటించారు, శ్రీలు, క్రాంతి కిల్లి ఇపాటెన్స్ రోల్స్ లో కలిపించబోతున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్ ద్వారా ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది, కో ప్రొడ్యూసర్ ఎల్లప్ప సహకారం మరువలేనిది, నిర్మాత హరీష్ కె అభిరుచిగల ప్రొడ్యూసర్, సినిమాను రిచ్ గా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ లో నిర్మించారు. నన్ను నమ్మి నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు హరీష్ కె గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. నిర్మాత హరీష్ కె మాట్లాడుతూ... మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్ ద్వారా డైరెక్టర్ ఎంజిఆర్ పరిచయం అయ్యారు, బ్లడ్ రోజస్ సినిమా బాగా వచ్చింది. మాకు మీ అందరి సపోర్ట్ కావాలని అన్నారు.  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మణికుమార్ మాట్లాడుతూ... నిర్మాత హరీష్ క...

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు చేతుల మీదుగా డైరెక్టర్ డాక్టర్ వీఎన్ ఆదిత్య, ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్ గ్లోబల్ మూవీ "ఫణి" మోషన్ పోస్టర్ లాంఛ్

Image
టాలెంటెడ్ డైరెక్టర్ డాక్టర్ వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్న గ్లోబల్ మూవీ "ఫణి". ఈ థ్రిల్లర్ సినిమాను ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై, ఏయు & ఐ స్టూడియో సమర్పణలో డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఫణి సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరీన్ ట్రెసా లీడ్ రోల్ లో నటిస్తున్నారు. మహేశ్ శ్రీరామ్ కీ రోల్ చేస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఇతర ప్రపంచ భాషల్లో ఫణి సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగిన ఈవెంట్ లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు చేతుల మీదుగా "ఫణి" సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ఆదిత్య అంటే సూర్యుడు. సూర్యుడు అన్ని దేశాల్లో ఉదయిస్తాడు. అలా "ఫణి" సినిమాను గ్లోబల్ మూవీగా రూపొందిస్తున్నారు వీఎన్ ఆదిత్య. ఆదిత్య నా దగ్గర పనిచేయలేదు. కానీ నాకు ఇష్టమైన వాడు. అతను కొత్త వాళ్లతో సినిమా చేయగలడు, స్టార్స్ తోనూ రూపొందించగలడు. వారి సోదరి మీనాక్షి నిర్మాణంలో "ఫణి" సినిమా చేస్తున్నాడు. కేథరీన్ అంటే సరైనోడులో ఎమ్మెల్యే గుర్తొస్తుంద...

ఘనంగా ఆర్జీవీ 'శారీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 4వ తేదీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

Image
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేస్తున్న కొత్త సినిమా 'శారీ'. ఈ చిత్రంలో సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు గిరి కృష్ణ కమల్ రూపొందించారు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. 'శారీ' సినిమా ఈ నెల 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ రోజు హైదరాబాద్ లో 'శారీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గిరికృష్ణ కమల్ మాట్లాడుతూ - 'శారీ' సినిమాకు టాలెంటెడ్ న్యూ టీమ్ వర్క్ చేసింది. మా అందరితో మూవీకి కావాల్సినట్లు వర్క్ చేయించుకున్నారు రామ్ గోపాల్ వర్మ. సినిమాకు కావాల్సిన కంటెంట్ మా ద్వారా తీసుకున్నారు. ఈ సినిమా మేకింగ్ టైమ్ లో సినిమా ఎలా చేయాలి అనేది ఆయన నాకు ఎప్పుడూ చెప్పలేదు. రెండు పాత్రలతోనే ప్రధానంగా సాగే ఇంటెన్స్ డ్రామా ఇది. ఆ రెండు క్యారెక్టర్స్ లో సత్య యాదు, ఆరాధ్య దేవి బాగా నటించారు. సత్య క్యారెక్టర్ రెగ్యులర్ హీరోలా ఉండదు, అలాగే ఆరాధ్య అంత అందంగా క...

భగీరథకు కళారత్న అవార్డు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు సీనియర్ జర్నలిస్ట్ , రచయిత భగీరథకు కళారత్న అవార్డును ప్రదానం చేసారు.

Image
మార్చి 30న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది అవార్డుల కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న చంద్రబాబు నాయుడు గారు భగీరథకు కళారత్న అవార్డును బహుకరించి అభినందించారు.  జర్నలిజంలో 45 సంవత్సరాల అనుభవం వున్న భగీరథ 1997, 2001లో రెండు పర్యాయాలు అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో నంది అవార్డులు , 2011లో ఎన్ .టి .ఆర్ . కమిటీ ఉత్తమ జర్నలిస్టు అవార్డు , 2020లో తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం , ఢిల్లీ తెలుగు అకాడమీ , వంశీ , కిన్నెర, యువకళా వాహిని, శృతిలయ , కమలాకర కళా భారతి , బళ్లారి తెలుగు సంస్కృతీ లాటి సంస్థల నుంచి 20 అవార్డులను భగీరథ స్వీకరించాడు .  నంది అవార్డుల కమిటీ , జాతీయ సినిమా అవార్డుల కమిటీ , ఆస్కార్ అవార్డుల కమిటీ సభ్యులుగా భగీరథ పనిచేశాడు .  ఎన్ .టి .ఆర్. శత జయంతి సందర్భంగా ఏర్పాటైన కమిటీ "శకపురుషుడు", "తారకరామం" రెండు గ్రంథాలు భగీరథ సంపాదకత్వంలో వెలువరించారు . నాగలాదేవి , మానవత, భారతమెరిక , దసరాబుల్లోడు , జమునాతీరం , నిత్య నూతన కథానాయకుడు , మెట్టింటి గడప , సావేరి , భగీరథ పథం , అక్షరాంజలి , తెలుగు సినిమా ప్రగతి ,మహార్జాతకుడు మొదలైన గ్రంథాలన...