అన్ని సినిమాల్లో శంబాలా సినిమా చాలా డిఫరెంట్.. సక్సెస్ కొట్టబోతున్నాం: శంబాలా నిర్మాతలు
వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘శంబాల’. డిఫరెంట్ హారర్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీకి యగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. ఇప్పటికే శంబాలా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచేసి హైప్ క్రియేట్ చేశాయి. డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోచేయబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి మీడియాతో ముచ్చటించి చిత్ర విశేషాలు చెప్పారు.
*ఈ సినిమా స్క్రిప్ట్ వినగానే మీకు నచ్చింది ఏంటి?*
స్క్రిప్ట్ కన్నా ముందు స్టోరీ. కథ బాగా నచ్చడంతో డివోషనల్, హారర్ ఎలిమెంట్స్ కనెక్ట్ కావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రంగంలోకి దిగాము. ముందుగా ఆది సాయి కుమార్ తో వేరే కథ అనుకున్నాం కానీ, ఇంతలో ఈ స్టోరీ రావడంతో ఆది సాయి కుమార్ తో ఈ సినిమా కంప్లీట్ చేశాము.
*బడ్జెట్ పరంగా ఎలా ముందుకెళ్లారు?*
ఈ రేంజ్ గా జనాల్లోకి పోతుందని అనుకోలేదు. మొదట కొంచెం బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ ఆ తర్వాత బడ్జెట్ పెంచి హై క్వాలిటీతో ఈ సినిమా ఫినిష్ చేశాము. ఈ స్టోరీ బాగా వర్కవుట్ అవుతుందని నమ్మి, ఈ కథపై ఇన్వెస్ట్ చేశాము.
*ఇప్పటివరకు ఎంతవరకు సేఫ్ జోన్ లోకి వచ్చారు?*
ఇప్పటికే జరిగిన బిజినెస్ తో సేఫ్ జోన్ లోకి వచ్చాము. శాటిలైట్, ఓటీటీ రైట్స్ ద్వారా 80 శాతం రికవరీ వచ్చేసింది. ఇంకో 20 శాతం రికవరీ బ్యాలెన్స్ అంతే. థియేట్రికల్ రన్ తో లాభాల్లోకి వస్తామని నమ్ముతున్నాం.
*ఆది మార్కెట్ తెలుగులోనే కాకుండా హిందీలో కూడా మంచి డిమాండ్ ఉంటుంది, శంబాలాకు ఎలా ఉంది?*
ఎస్, శంబాలాకు కూడా మంచి ఆఫర్స్ వచ్చాయి. హిందీ థియేట్రికల్ రిలీజ్ కూడా చేయడానికి ప్లాన్ చేశాము. తెలుగులో రిలీజ్ అయిన వారం రోజుల్లో శంబాలా హిందీ రిలీజ్ ఉంటుంది.
*ఇండస్ట్రీలో మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?*
మాకు అంతకుముందే ఇండస్ట్రీతో అనుబంధం ఉంది. పెద్ద సినిమాల వీడియో డీవీడీస్ హక్కులు మా వద్ద ఉండేవి. అలాగే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ గా పని చేశాము.
*దర్శకుడిపై మీ అభిప్రాయం ఏంటి?*
ఆయన షార్ట్ మేకింగ్, స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంటుంది. ఇప్పటికే ఈ సినిమా థియేటర్ లో ఎలా ఉంటుందో చూశాము. చాలా బాగా వచ్చింది. మొదటి, రెండో షెడ్యూల్ తర్వాత చిత్ర బృందానికి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అన్ని ఎలిమెంట్స్ తో చాలా బాగా అవుట్ పుట్ ఇచ్చారు.
*కంటెంట్ పరంగా ఎలా ఉంది?*
స్టోరీ పరంగా చూస్తే టోటల్ డిఫరెంట్ ఈ సినిమా. ఏ సినిమాతో దీనికి పోలిక లేదు. సినిమాకు బలం కంటెంటే.
*శ్రీ చరణ్ పాకాల సంగీతం గురించి ఏమంటారు?*
శ్రీ చరణ్ పాకాల సంగీతం మా సినిమాకు పెద్ద అసెట్. విజువల్ తో పాటు మ్యూజిక్ బాగా వచ్చింది. ఈ జోనర్ కి బాగా సెట్ అయ్యారు.
*శంబాలా టైటిల్ పెట్టడానికి రీజన్?*
కల్కిలో వచ్చిన తరువాత శంబాలా అనేది అందరికీ తెలిసింది. శంబాలాకి ఓ మీనింగ్ ఉంది. శంబాలా ప్లేస్ ఏంటి? దాని మీనింగ్ ఏంటి? అనేది ఈ సినిమాలో కనిపిస్తుంది.
*అన్ని సినిమాల్లో శంబాలా సినిమా ఎందుకు ప్రత్యేకం?*
మా సినిమాలో హారర్ తో పాటు సస్పెన్స్, ఎమోషన్స్ కలిపి ఉంటాయి. మైత్రి వాళ్ళు మా సినిమాను రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా పాజిటివ్. హీరో, హీరోయిన్స్ తో పాటు సినిమాలో అన్ని క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది.
*శంబాలా సినిమాకు సీక్వల్ ఉంటుందా?*
ఫస్ట్ పార్ట్ అయితే ప్రాపర్ గా ఎండ్ చేశాము. సెకండ్ పార్ట్ కోసం స్మాల్ లీడ్ ఇచ్చాము. కొంచెం క్యూరియాసిటీ ఉండేలా క్లోజ్ చేశాము. దాని గురించి మళ్లీ ఆలోచిస్తాము.
*OTT బిజినెస్ ఎలా ఉంది?*
OTT, శాటిలైట్ రైట్స్ సినిమా రిలీజ్ కి ముందే క్లోజ్ అయ్యాయి. మా సినిమాకు మంచి డిమాండ్ వచ్చింది. మా సినిమా చూసి నచ్చి ఆహా వాళ్ళు శంబాలా ఓటీటీ రైట్స్ తీసుకున్నారు. థియేట్రికల్ రిలీజ్ కొంచెం చాలెంజింగ్ అనిపించింది. మైత్రి వాళ్ళు నైజాం రైట్స్ తీసుకున్నారు. ఏపీ, సీడెడ్ ఉషా పిక్చర్స్ వాళ్ళు తీసుకున్నారు.
*మీ తర్వాతి సినిమాలు ఏంటి?*
ప్రస్తుతం సెలెక్టెడ్ సినిమాలతో ముందుకెళ్తున్నాం. సినిమా డిస్ట్రిబ్యూషన్స్ కూడా కంటిన్యూ చేస్తున్నాం.
Comments
Post a Comment