*హ్యాపీ జర్నీ పోస్టర్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్*
తెలుగు హిందీ భాషల్లో రిలీజ్ కానున్న హ్యాపీ జర్నీ
ఫ్యూచర్ బ్రైట్ ఫిలిమ్స్ పతాకంపై హరిప్రసాద్ కోనే, ఇషాని గోష్ హీరో హీరోయిన్లుగా చైతన్య కొండా దర్శకత్వంలో గంగాధర్ పెద్ద కొండ నిర్మించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ ' హ్యాపీ జర్నీ'. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ కోసం కార్యక్రమాలు జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రంలోని "వందేమాతరం" సాంగ్ ని చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత గంగాధర్ పెద్ద కొండ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని తెలుగు హిందీ భాషల్లో నిర్మిస్తున్నాము. దేశభక్తి నేపథ్యంలో సాగే వెరైటీ కథ ఇది. ఈ చిత్రంలోని వందేమాతరం పాటను ప్రేక్షకుల ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉంది. ఓ మంచి చిత్రoతో ప్రేక్షకులు ముందుకు రానున్నాం. తెలుగు ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము. అని అన్నారు. అలాగే డైరెక్టర్ చైతన్య కొండ మాట్లాడుతూ
ఇలాంటి సినిమాలు ఎప్పుడో ఒకసారి వస్తుంటాయి నా చిన్నప్పుడు మేజర్ చంద్రకాంత్ సినిమా చూశాను
నేను ఇండస్ట్రీకి వచ్చాక ఖడ్గం సినిమా చూశాను అంత బలమైన ఎమోషన్స్ తో ఈ సినిమా చేశాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు
హరి ప్రసాద్ కోనే, ఇషాని గోష్, దువ్వాసి మోహన్, వి6 సత్య, సంజయ్ రాయచూర, ఆనంద్ భారతి తదితరులు.
హ్యాపీ జర్నీ సినిమా అక్టోబర్ నెలాఖరున విడుదల కానుంది.
నిర్మాత: గంగాధర్ పెద్ద కొండ
డైరెక్టర్: చైతన్య కొండ
మ్యూజిక్ :చైతన్య రాజ్
డిఓపి: యు. అరుణ్ కుమార్ Gnanavel
ఎడిటర్: కొండవీటి రావి కుమార్
ఆర్ డైరెక్టర్: వాసు
డిజిటల్ మార్కెట్: కె. కె డిజిటల్
Comments
Post a Comment