"కె ర్యాంప్" మూవీలోని ఫన్, ఎనర్జీ, వైబ్ ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తారు - 'క్యూ అండ్ ఎ' ప్రెస్ మీట్ లో హీరో కిరణ్ అబ్బవరం
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. "K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు హైదరాబాద్ లో మూవీ క్యూ అండ్ ఎ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - "కె ర్యాంప్" సినిమా హెవీ ఎంటర్ టైనర్ అని చెబుతూ వస్తున్నాం. మేము చెప్పినట్లే థియేటర్స్ లో దీపావళి పండుగను మా చిత్రంతో ఆడియెన్స్ సెలబ్రేట్ చేసుకుంటారనే నమ్మకం ఉంది. నవ్వించే సినిమా ఎప్పుడూ నిరాశపరచదు. ఈ రోజు కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. మాకు 17 డేట్ సెంటిమెంట్ ప్రకారం సరికాదని 18కు వస్తున్నాం. అయితే శుక్రవారం రిలీజ్ కు వచ్చి ఉండే నాలుగు రోజుల హాలీడేస్ లో మరో రోజు దొరికి ఉండేది అనేది ఒక్కటే ఉంది కానీ శనివారం రిలీజ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. థియేటర్స్ లో మీరంతా సినిమా బాగుంది, మంచి ఎంటర్ టైనర్ అని చెబితే ఫ్యామిలీ ఆడియెన్స్ రావడం మొదలుపెడతారు. నేను చాలా ఏరియాల్లో మా మూవీ ప్రచారం చేశాను. అక్కడ గ్రౌండ్ లెవెల్లో మా మూవీ గురించి ఉన్న క్రేజ్ చూశాక సినిమా మీద మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ సినిమాలో నేను చెప్పిన డైలాగ్స్ బాగా రీచ్ అయ్యాయి. వాటిని ఆడియెన్స్ నా ముందే చెబుతుంటే హ్యాపీగా ఉంది. "కె ర్యాంప్" సినిమా అంతా ఎనర్జీతో గోలగోలగా ఒక వైబ్ తో ఉంటుంది. ఇలాంటి సినిమా వచ్చి చాలా రోజులైంది. కుమార్ అనే హీరో క్యారెక్టర్ మీద సినిమా వెళ్తుంది. క్యారెక్టర్ బేస్డ్ ఫిలింస్ ను మనం బాగా ఎంజాయ్ చేస్తాం. సినిమా ఫస్టాఫ్ యూత్ ఫుల్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటే, సెకండాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంగేజ్ చేస్తాయి. నేను సక్సెస్, ఫెయిల్యూర్స్ చూశాను. వాటి విషయంలో మెచ్యూర్డ్ గా మారిపోయాను. మనం ఎంత చేసినా కొన్నిసార్లు సక్సెస్ రాకపోవచ్చు. విజయం వచ్చిన ప్రతిసారీ చాలా పాజిటివ్ గా ఉంటుంది. కిరణ్ అబ్బవరం సినిమా వస్తే తప్పకుండా బాగుంటుంది అనే ఇమేజ్ తెచ్చుకోవాలనేది ప్రస్తుతం నా ప్రయత్నం. ఫలితం ఎలా ఉన్నా పని చేసుకుంటూ వెళ్తున్నా. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన నేను ఈ సినిమాలో రిచ్ కిడ్ గా నటించా. ఆ పాత్రలోకి వెళ్లడం కష్టమే. అయితే నా ఫ్రెండ్ ఒకరిని రిఫరెన్స్ తీసుకున్నా. అతను రిచ్ కిడ్. అతను ఎలా బిహేవ్ చేసేవాడో కొన్ని ఫాలో అయ్యాను. నాలుగు సినిమాలు పండక్కి రిలీజ్ అవుతుంటే కాంపిటేషన్, నెగిటివ్ ఎలిమెంట్స్ కూడా వస్తుంటాయి. అయితే ప్రేక్షకులు సినిమా చూసి ఇచ్చే పాజిటివ్ మౌత్ టాక్ సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేస్తుంది. ఈ చిత్రంలో నేను చేసిన కుమార్ అబ్బవరం అనే క్యారెక్టర్ ఇప్పుడున్న యూత్ కు చాలా రిలేట్ అయ్యేలా ఉంటుంది. వాళ్లు ఏం మిస్ అవుతున్నారు అనేది కూడా ఆలోచింపజేస్తుంది. అన్నారు.
నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ - నా కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాక సామజవరగమన మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు "కె ర్యాంప్"లో కూడా కీ రోల్ చేశాను. కిరణ్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. "కె ర్యాంప్" పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మా మూవీ తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. అయితే ఏ రేంజ్ సక్సెస్ అనేది ఈ మూడు రోజుల్లో తెలుస్తుంది. మూడు తరాల ఆడియెన్స్ కలిసి చూసి ఎంజాయ్ చేసే చిత్రమిది. డైరెక్టర్ నాని గురించి చెప్పాలంటే అతను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి కాంబినేషన్ గా అనిపిస్తాడు. ఈ రోజు సమాజంలో ఉన్న పరిస్థితులనే సినిమా రిఫ్లెక్ట్ చేస్తుంది. హీరో కుమార్ అనే క్యారెక్టర్ లో కొంచె అల్లరి చిల్లరగా ఉంటాడు. ఆ క్యారెక్టర్ కు తగినట్లే ఒకట్రెండు డైలాగ్స్ ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ కాదు మీరు సినిమా అంతా చూసి "కె ర్యాంప్" ఎలా ఉందో చెప్పండి. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుంది. నేను చేయగలనా అని అనిపించింది, డెసిషన్ తీసుకుని ఓకే నటిస్తాను అని డైరెక్టర్ కు ధైర్యంగా చెప్పాను. ఈ సినిమా సెకండాఫ్ ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. అన్నారు.
హీరోయిన్ యుక్తి తరేజా మాట్లాడుతూ - ఈ చిత్రంలో కిరణ్, నా క్యారెక్టర్స్ పోటా పోటీగా ఉంటాయి. మేమిద్దరం కలిసి ఆ సీన్ ను ఎంత బాగా పర్ ఫార్మ్ చేయాలి అనేదాని గురించే ఆలోచించాం. మా ఇద్దరిలో ఒకరి క్యారెక్టర్ మరొకరిని డామినేట్ చేస్తుందా లేదా అనేది ఆలోచించలేదు. "కె ర్యాంప్" లో నేనొక డిఫరెంట్ రోల్ చేశాను. నా క్యారెక్టర్ పిచ్చిగా బిహేవ్ చేస్తుంటుంది. ఇదొక మంచి రొమాంటిక్ కామెడీ మూవీ. మూవీలో మా లవ్ స్టోరీ చాలా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాకు నటించిన ఎక్సిపీరియన్స్ మర్చిపోలేను. అన్నారు.
డైరెక్టర్ జైన్స్ నాని మాట్లాడుతూ - "కె ర్యాంప్" మూవీ కంప్లీట్ ఎంటర్ టైనర్ అనేది మేము ప్రచారంలో చెబుతూ వస్తున్నాం. థియేటర్స్ లో సినిమా చూసిన ఆడియెన్స్ నుంచి కూడా ఇదే ఫీడ్ బ్యాక్ వస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఒక ఫ్లోలో ఉండేలా స్క్రిప్ట్ చేశాను. అందుకే మా నరేష్ గారు అనిల్ రావిపూడితో నన్ను పోల్చుతున్నారు. అన్నారు.
Comments
Post a Comment