అశ్లీలతకు తావు లేకుండా నిజాయితీగా ఓ మంచి సినిమాను చేశాం.. ‘శశివదనే’ ప్రెస్ మీట్‌లో హీరో రక్షిత్ అట్లూరి
*‘శశివదనే’ క్లైమాక్స్ అందరినీ సర్ ప్రైజ్ చేసేలా చాలా కొత్తగా ఉంటుంది.. ప్రెస్ మీట్‌లో హీరోయిన్ కోమలి ప్రసాద్
*‘శశివదనే’ ఏ ఒక్కరిని కూడా నిరాశ పర్చదు.. ప్రెస్ మీట్‌లో నిర్మాత అహితేజ బెల్లంకొండ
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సినిమాను నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ శనివారం నాడు మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో
*హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ* .. ‘నాకు మూడేళ్ల క్రితం తేజ గారు ఈ కథ గురించి చెప్పారు. సాయి చెప్పిన కథ మొదట్లో నాకు నచ్చలేదు. ఆయనేం చెబుతున్నాడో కూడా అర్థం కాలేదు. కథగా అయితే అర్థం కాలేదు కానీ ఆయన చెప్పిన సీన్లు నచ్చాయి. ఆయన తీసిన షార్ట్ ఫిల్మ్స్ కూడా చూశాను. ఇందులో ఆయన రాసుకున్నట్టుగా ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ ఇంత వరకు తెలుగులో రాలేదు. శ్రీమాన్ గారు చేసిన పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. గోదావరి జిల్లాల్ని అద్భుతంగా చూపించిన సాయి కుమార్ పనితనం గురించి అందరూ చెప్పుకుంటారు. గౌరీ గారి క్యాస్టూమ్స్, శర్వా మ్యూజిక్, అనుదీప్ ఆర్ఆర్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. కోమలి గారు అద్భుతమైన నటి. తేజ గారికి, అభిలాష్ గారికి మంచి సక్సెస్ రావాలి. సాయికి డైరెక్టర్‌గా మంచి పేరు రావాలి. కెమెరామెన్ సాయి గారికి ఆల్రెడీ ప్రశంసలు వస్తున్నాయి. అశ్లీలతకు తావు లేకుండా నిజాయితీగా ఓ మంచి సినిమాను చేశాం. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆనందంతో బయటకు వస్తారు. ఏ ఒక్కరినీ నిరాశ పర్చదు అని మాత్రం చెప్పగలను. అక్టోబర్ 10న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
*డైరెక్టర్ సాయి మోహన్ మాట్లాడుతూ* .. ‘నేను ఇండస్ట్రీలోకి రావాలన్నది మా నాన్న కల, కోరిక. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన తేజ గారికి, గౌరీ గారికి థాంక్స్. రక్షిత్ గారు ఓ పది రోజుల షూటింగ్ తరువాత నన్ను చాలా గట్టిగా నమ్మారు. ‘శశివదనే’ సినిమాను మీడియా ముందుకు తీసుకు వెళ్తోంది. సాయి కుమార్ నాకు మంచి విజువల్స్ ఇచ్చారు. నేను రాసుకున్న కథను అందమైన పెయింటింగ్‌లా మార్చాడు. శర్వా, అనుదీప్ నాకు మంచి మ్యూజిక్, ఆర్ఆర్ ఇచ్చారు. నేను ఎంత అందంగా రాసుకున్నానో.. అంతకు మించి అనేలా కోమలి గారు నటించారు. కథ చెప్పిన వెంటనే శ్రీమాన్ గారు ఓకే చేశారు. ఆయన చేసిన సింగిల్ షాట్ సీన్ గురించి అందరూ చెప్పుకుంటారు. గ్యారీ గారి ఎడిటింగ్ అందరికీ నచ్చుతుంది. అక్టోబర్ 10న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*నిర్మాత అహితేజ మాట్లాడుతూ* .. ‘‘శశి వదనే’ కోసం మేం ఎంత కష్టపడ్డా కూడా ఆడియెన్స్‌కి మంచి అనుభూతిని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మాకు ముందు నుంచీ కూడా మీడియా ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఈ మూవీ ఏ ఒక్కరినీ కూడా నిరాశపర్చదు. నాకు అంతగా అనుభవం లేకపోవడంతోనే రిలీజ్‌లో జాప్యం కలిగింది. కంటెంట్ మీద మా అందరికీ నమ్మకం ఉంది. సినిమా పూర్తి కాకముందే అన్ని రైట్స్ అమ్ముడుపోయాయి. నన్ను నమ్మిన డిస్ట్రిబ్యూటర్లందరికీ ధన్యవాదాలు. మా మూవీ ట్రైలర్ అందరికీ నచ్చింది. ‘శశివదనే’ లాంటి క్లైమాక్స్‌ను నాకు తెలిసినంత వరకు అయితే తెలుగులో ఇంత వరకు చూడలేదు. నాకు ఈ ప్రయాణంలో సపోర్ట్‌గా నిలిచిన ఎస్‌కేఎన్ గారికి, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ అనీష్, డైరెక్టర్ యోగి అన్నకి, అండగా ఉన్న మీడియాకి, మా పీఆర్ టీంకి థాంక్స్’ అని అన్నారు.
*హీరోయిన్ కోమలి ప్రసాద్ మాట్లాడుతూ* .. ‘‘శశివదనే’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. నేను ఇందులో పోషించిన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఈ టీంలోని చాలా మంది కొత్త వారే. అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. అక్టోబర్ 10న మా చిత్రం రాబోతోంది. క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది. థియేటర్లో అందరినీ మా సినిమా కచ్చితంగా సర్ ప్రైజ్ చేస్తుంది’ అని అన్నారు.
*కెమెరామెన్ సాయి కుమార్ మాట్లాడుతూ* .. ‘గత నెలలో నా ‘బ్యూటీ’ చిత్రం వచ్చింది. కానీ నాకు టెక్నికల్‌గా ఇదే మొదటి చిత్రం. ఈ మూవీలో రాసినట్టుగా ఈ చిత్రం కోసం మేమంతా ఓ యుద్ధం చేశాం. నన్ను మా అహితేజ గారు చాలా నమ్మారు. రక్షిత్ గారు మా అందరికీ ఎంతో సపోర్ట్ ఇచ్చారు. రక్షిత్‌కి గాయాలైనా కూడా షూటింగ్ కంటిన్యూ చేయడం గ్రేట్. కోమలి గారు అద్భుతంగా నటించారు. గౌరీ గారి క్యాస్టూమ్స్, కలర్ ప్యాలెట్ గురించి అందరూ గొప్పగా చెబుతున్నారు. సాయి మోహన్ ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. ‘శశి వదనే’ విజువల్స్ చూసిన తరువాతే నాకు అందరూ అవకాశాన్ని ఇచ్చారు’ అని అన్నారు.
*ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీపాల్ మాట్లాడుతూ* .. ‘‘శశివదనే’ టీం చాలా కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించింది. గౌరీ గారు, అహితేజ గారు ఎంతో ప్యాషనేట్‌గా ఈ మూవీని నిర్మించారు. ట్రైలర్ అందరికీ రీచ్ అయింది. దర్శకుడు, రక్షిత్, కోమలి, టీం ఇలా అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకు రావాలి’ అని అన్నారు.
*నటి అంబికా మాట్లాడుతూ* .. ‘‘శశి వదనే’ కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం అక్టోబర్ 10న వస్తుందని ఆశిస్తున్నాను. మా అందరికీ ఆడియెన్స్ నుంచి సపోర్ట్ లభించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నటీనటులు :
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్, శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్ : ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్, సమర్పణ :గౌరీ నాయుడు, నిర్మాతలు :అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల, దర్శకుడు :సాయి మోహన్ ఉబ్బన, సంగీత దర్శకుడు : శరవణ వాసుదేవన్, నేపథ్య సంగీతం :అనుదీప్ దేవ్, కెమెరామెన్ :శ్రీ సాయి కుమార్ దారా, ఎడిటర్ : గ్యారీ బీహెచ్, కాస్ట్యూమ్ డిజైనర్ :గౌరీ నాయుడు, పీఆర్వో : నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), మార్కెటింగ్ : విష్ణు తేజ పుట్టా (క్రాస్ క్లిక్ మార్కెటింగ్)
Comments
Post a Comment