4.5 కోట్ల రూపాయల డే 1 గ్రాస్ వసూళ్లతో దీపావళి బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచిన కిరణ్ అబ్బవరం "K-ర్యాంప్" మూవీ

దీపావళి సక్సెస్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం "K-ర్యాంప్" తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. శనివారం థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ అందిస్తూ ఘన విజయాన్ని దక్కించుకుంది. "K-ర్యాంప్" మూవీ డే 1 మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి రోజునే 4.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో బ్లాక్ బస్టర్ జర్నీ బిగిన్ చేసింది. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ ఉన్న ఫస్టాఫ్, ఫ్యామిలీ, లవ్ ఎమోషన్స్ ఉన్న సెకండాఫ్ ను థియేటర్స్ లో ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. పండుగ హాలీడేస్ లో "K-ర్యాంప్" బాక్సాఫీస్ వద్ద మరిన్ని డీసెంట్ నెంబర్స్ క్రియేట్ చేయనుంది.

"K-ర్యాంప్" సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్  బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా  నిర్మించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా నటించగా, ఇతర కీలక పాత్రల్లో వీకే నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్ తమ నటనతో ఆకట్టుకున్నారు.

Comments

Popular posts from this blog

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!!

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

లేత గులాబీ టైటిల్ లాంచ్