మహేంద్రగిరి వారాహి నిర్మాత కాలిపు మధు స్పెషల్ ఇంటర్వ్యూ !!!

 
'రాజా శ్యామల ఎంటర్టైన్మెంట్స్'  బ్యానర్ లో నిర్మాత  మధు కలిపు కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ చిత్రాన్ని నిర్మించారు. విమర్శకుల ప్రశంశలు పొందిన ఆ సినిమా తరువాత నిర్మాత కాలిపు మధు సుమంత్ హీరోగా సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా ''మహేంద్రగిరి వారాహి" సినిమా చేస్తున్నారు.  

ఈ సందర్భంగా నిర్మాత కాలిపు మధు మాట్లాడుతూ... "తమ బ్యానర్ నుంచి వచ్చిన 'రంగమార్తాండా'  సినిమా ఎంత గొప్ప గుర్తింపును సంపాదించుకుందో 'మహేంద్రగిరి వారాహి' అంతకంటే మంచి గుర్తింపును సంపాదించుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందనే నమ్మకాన్ని అయితే వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూట్ ఆల్మోస్ట్ పూర్తవ్వగా రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను స్టార్ట్ చేశారు... ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఒక గ్లింమ్స్ రిలీజ్ చేశాము, ఫస్ట్ లుక్ అలాగే గ్లింమ్స్ కు మంచి ఆదరణ లభించింది, తొందర్లోనే టీజర్ ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నాము. తెలుగు సినిమా గర్వించే సినిమాగా మహేంద్రగిరి వారాహి సినిమాను రూపొందిస్తున్నాము, ఈ సినిమాలో మరో స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ నటించబోతున్నారు, వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాము" అన్నారు. 

 వారాహి అమ్మవారి గొప్పతనాన్ని తెలియజేసే విధంగా ఉండబోతున్న ఈ సినిమాని చూడడానికి ఇప్పటికి ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను చాలా డిఫరెంట్ గా ఉన్నత స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. హీరో సుమంత్ అనగనగా సినిమాలో ఎలాగైతే తన యాక్టింగ్ తో ప్రేక్షకులను కట్టి పడేసాడో 'మహేంద్రగిరి వారాహి' సినిమాతో నెక్స్ట్ లెవల్ పర్ఫామెన్స్ ని ఇవ్వబోతున్నారు...అలాగే ఆయన 25 సంవత్సరాల సినీ కెరియర్ లో ఈ సినిమా ఒక గొప్ప మూవీగా నిలువబోతుందనే కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!!

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

లేత గులాబీ టైటిల్ లాంచ్