పైరసీని అరికట్టిన డీసీపీ కవిత బృందాన్ని అభినందించిన ప్రేమిస్తున్నా చిత్ర యూనిట్ !!!


ఎప్పటినుండో సినీ పరిశ్రమను భూతంలో పట్టి పీడిస్తున్నది పైరసీ. ఈ పైరసీని అరికట్టే ప్రయత్నంలో డీసీపీ కవిత అండ్ టీమ్ అనేక సినిమాల పైరసీకి పాల్పడిన నేరస్తుడిని పట్టుకొని సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేసారు. 

ఈ సందర్భంగా ఐబిఎమ్ ప్రొడక్షన్స్ ప్రేమిస్తున్నా చిత్ర బృందం ప్రేత్యేకంగా కలిసి అభినందించారు. భవిషత్తులో కూడా ఇలాంటి పైరసీ సైబర్ నేరస్తుల నుండి సినిమా పరిశ్రమని రక్షించమని కోరడం జరిగింది.
 
ఈ కార్యక్రమంలో ప్రేమిస్తున్నా చిత్ర నిర్మాత పప్పుల కనకదుర్గారావు దర్శకుడు భాను నిర్వాహకులు మర్రి రవికుమార్, హీరో సాత్విక్ వర్మ, హీరోయిన్ ప్రీతి నేహా, ఎడిటర్ శిరీష్ ప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ... "పైరసీ మహమ్మారి వలన చిత్ర నిర్మాతలు ఎంతో నష్టపోతున్నారని, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి, చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న నిర్మాత సినిమాను విడుదల చేసిన రోజు నుండే పైరసీ మహమ్మరితో ఎంతో నష్టపోతున్నారు, సైబర్ నేరగాళ్లను అరికట్టి చిత్ర పరిశ్రమను రక్షించాలని కోరారు. 

ఈ సందర్భంగా డిసిపి కవిత మాట్లాడుతూ...
పైరసీ పట్ల ఎప్పటికి అప్పడు చిత్ర నిర్మాతలు అప్రమత్తమై సైబర్ క్రైమ్ అధికారులకు పిర్యాదు చెయ్యాలని కోరారు.

Comments

Popular posts from this blog

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!!

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

త్రిగుణ, మేఘా చౌదరి, మల్లి యేలూరి, Dr Y. జగన్ మోహన్, యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ 'జిగేల్' ఫస్ట్ లుక్ రిలీజ్