''బాలుగాడి లవ్ స్టోరీ'' ఆగస్ట్ 8న థియేటర్స్ లో విడుదల !!!
ఆకుల అఖిల్, దర్శక మీనన్, చిత్రం శ్రీను, గడ్డం నవీన్, చిట్టిబాబు, రేవతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'బాలుగాడి లవ్ స్టోరీ'. శ్రీ ఆకుల భాస్కర్ సమర్పణలో భామ క్రియేషన్స్ పతాకంపై ఆకుల మంజుల నిర్మిస్తున్న చిత్రానికి యల్. శ్రీనివాస్ తేజ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బాలుగాడి లవ్ స్టోరీ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ 8న విడుదల కాబోతోంది. ఈ సినిమాను 'సిల్వర్ స్క్రీన్' గణేష్ భారీ రిలీజ్ చేయబోతున్నారు, బాలుగాడి లవ్ స్టోరీ సినిమా ఆద్యాంతం నేటి యూత్ కు నచ్చేలా రొమాన్స్, యాక్షన్, సస్పెన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. ఈ సినిమా పట్ల చిత్ర యూనిట్ కు మంచి విశ్వాసం ఉంది.
ఆకుల అఖిల్, దర్శక మీనన్, చిత్రం శ్రీను, జబర్దస్త్ గడ్డం నవీన్, జబర్దస్త్ చిట్టిబాబు, రేవతి, లక్ష్మి, రాఘవరావు, మహేష్, సూరజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ శ్రీ ఆకుల భాస్కర్, బ్యానర్ భామ క్రియేషన్స్, రైటర్, డైరెక్టర్ యల్. శ్రీనివాస్ తేజ్, నిర్మాత ఆకుల మంజుల, డి.ఓ.పి రవి కుమార్ నీర్ల, మ్యూజిక్ డైరెక్టర్ ఘనశ్యామ్, ఎడిటర్ యాదగిరి కంజారాల లుగా వ్యవహరిస్తున్నారు.
Comments
Post a Comment