ఈ నెల 11వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న రామ్ గోపాల్ వర్మ సినిమా 'శారీ'

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కథను అందించి నిర్మించిన సినిమా 'శారీ' ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా ఈ నెల 11వ తేదీ నుంచి ఆహాలో ప్రీమియర్ కానుంది. ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ గా దర్శకుడు గిరి కృష్ణ కమల్ రూపొందించిన ఈ చిత్రంలో సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై రవిశంకర్ వర్మ నిర్మించారు. 

'శారీ' సినిమా ఏప్రిల్ 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పుడు ఆహాలో మరింతగా ప్రేక్షకులకు రీచ్ కానుందీ మూవీ. యదార్థ ఘటనల స్ఫూర్తితో 'శారీ' సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో సాహిల్ సంభవ్, అప్పాజీ అంబరీష్, కల్పలత, తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Comments

Popular posts from this blog

ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ నూతన చిత్రానికి "ప్రేమిస్తున్నా'' టైటిల్ ఖరారు !!!

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

త్రిగుణ, మేఘా చౌదరి, మల్లి యేలూరి, Dr Y. జగన్ మోహన్, యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ 'జిగేల్' ఫస్ట్ లుక్ రిలీజ్