"వర్ణపతల" సినిమాలో నటనకు ప్రెస్టీజియస్ కర్ణాటక స్టేట్ అవార్డ్ గెల్చుకున్న హీరోయిన్ జ్యోతి పూర్వజ్, ప్రస్తుతం చిత్రీకరణలో ఆమె సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ “కిల్లర్”


సిల్వర్ స్క్రీన్ తో పాటు టీవీ ప్రేక్షకులకూ అభిమాన నటిగా పేరు తెచ్చుకుంది జ్యోతి పూర్వజ్. ఆమె ప్రస్తుతం తెలుగులో సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ “కిల్లర్” సినిమాలో నటిస్తోంది. జ్యోతి పూర్వజ్ "పర్ణపతల" సినిమాలో నటనకు ప్రెస్టీజియస్ కర్ణాటక స్టేట్ అవార్డ్ గెల్చుకుంది. ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న జ్యోతి పూర్వజ్ కు “కిల్లర్” మూవీ టీమ్ శుభాకాంక్షలు తెలియజేసింది.

“శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ “కిల్లర్” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పూర్వాజ్ హీరోగా నటిస్తుండగా, జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్ రాజ్, గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థింక్ సినిమా బ్యానర్ పై ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థలతో కలిసి పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. “కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. 


నటీనటులు - జ్యోతి పూర్వజ్,  పూర్వాజ్, విశాల్ రాజ్, చందూ, గౌతమ్, తదితరులు


టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ: జగదీశ్ బొమ్మిశెట్టి
మ్యూజిక్: అషీర్ ల్యూక్, సుమన్ జీవరత్నం
వీఎఫ్ఎక్స్ - వర్చువల్ ప్రొడక్షన్: మెర్జ్ ఎక్స్ ఆర్
పీఆర్ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
బ్యానర్స్ - థింక్ సినిమా, మెర్జ్ ఎక్స్ ఆర్, ఏయు అండ్ ఐ
నిర్మాతలు - పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి
రచన, దర్శకత్వం - పూర్వాజ్

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

"ది ఇండియన్ స్టోరి" రివ్యూ - మంచి సందేశం, వినోదం కలిపిన సినిమా