యు/ఏ సర్టిఫికెట్ తో మార్చి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న రాక్షస
కన్నడ డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం *రాక్షస*. ఈ చిత్రం మార్చి 7న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఒరిజినల్ వెర్షన్ కన్నడతో పాటు తెలుగులోనూ అదేరోజు విడుదలవుతోంది. కంచి కామాక్షి కోల్ కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. వేణు ఉన్ని సంగీతం అందించగా, "కాంతారా", "విరూపాక్ష" లాంటి థ్రిల్లర్స్ కు సూపర్ హిట్ సంగీతం అందించిన అజనీష్ లోక్ నాథ్ ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్స్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ మూవీ టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సినిమా కాన్సెప్ట్ ను తెలియజేసేలా సాగిన ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటుంది. వేణు ఉన్ని కంపోజ్ చేసిన పాటకు, అజనీష్ లోక్ నాథ్ అందించిన సౌండ్ ట్రాక్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తున్నాయి. "మాయలో మాయకి చిక్కినాక.. దారిలో కానరాక చొచ్చుకెళ్లాక.. రూపమే అదృశ్యం అయ్యాక.. నా నీడే వెచ్చగా తగిలాక.. వెళ్లే దారిలో..తిరిగే సుడిగుండంలా మొత్తం అంతా మాయే.. కలయో నిజమో అసలేమీ తెలియదే.. భయంతో గట్టిగా పిలిచే నువ్వెవరే..రా రా రాక్షస" అంటూ సాగిన పాటకు ప్రేమ్ బి ఎస్ అర్థవంతమైన లిరిక్స్ ను అందించగా, సాయి చరణ్ వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా నిర్మాత ఎంవిఆర్ కృష్ణ మాట్లాడుతూ.." ప్రజ్వల్ దేవరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు, ట్రైలర్ కు మంచి ఆదరణ దక్కింది. విడుదల చేసిన పాట కూడా ప్రతి ఒక్కరూ బాగుందని చెబుతాన్నారు. ముఖ్యంగా "కాంతారా" ఫేం అజనీష్ లోక్ నాథ్ సౌండ్ ట్రాక్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది. ఈ పాట తరహాలోనే సినిమా కూడా అందరూ ఇష్టపడేలా ఉంటుంది.రాక్షస చిత్రానికి సెన్సార్ వాళ్లు *U/A సర్టిఫికేట్* జారీ చేశారు. ఇక ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 13 నిమిషాలు ఉంది. మేము అనుకున్న దానికంటే ఎంతో అద్భుతంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రానికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతుందని నమ్మకం ఉంది" రాక్షస సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి అని చెప్పారు.
ఈ చిత్రంలో అరుణ్ రాథోడ్, శ్రీధర్, గౌతమ్, సోమశేఖర్, విహాన్ కృష్ణ తదితరులు నటిస్తున్నారు.
సమర్పణ : మందపాటి సంస్కృతి , అక్షర
బ్యానర్ : కంచి కామాక్షి కోల్ కతా కాళి క్రియేషన్స్
నిర్మాత : ఎం వి ఆర్ కృష్ణ
సినిమాటోగ్రఫీ : జైబిన్ పి జాకబ్
సంగీత దర్శకుడు : వేణు ఉన్ని,
సౌండ్ ట్రాక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: బి. ఆజనీష్ లోక్ నాథ్,
దర్శకుడు : లోహిత్ హెచ్
పీఆర్వో: హర్ష
Comments
Post a Comment