పొయెటిక్ లవ్ స్టోరీ మూవీ "కాలమేగా కరిగింది" ట్రైలర్ రిలీజ్, ఈ నెల 21న విడుదలకు వస్తున్న సినిమా


వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. శింగర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. పొయెటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన "కాలమేగా కరిగింది" సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

"కాలమేగా కరిగింది" సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - ఫణి, బిందు విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచి ప్రేమికులు. అమాయకత్వం నిండిన స్వచ్ఛమైన ప్రేమ వారికి ఎంతో సంతోషాన్నిస్తుంది. తమ ప్రేమే లోకంగా జీవిస్తుంటారు ఇద్దరు. కలహాలే లేని ఈ ప్రేమ కథను కాలం విడదీస్తే ఆ జ్ఞాపకాలు వెతుక్కుంటూ కథానాయకుడు ఫణి ప్రయాణం సాగిస్తాడు. బిందుతో కలిసి చదువుకున్న స్కూల్, తామిద్దరు మాట్లాడుకున్న ప్లేస్ లు...అన్నింటిలో ప్రేమను గుర్తుల్ని పోగేసుకుంటాడు. ఈ ప్రేమికులు తిరిగి ఎలా కలిశారు అనేది ట్రైలర్ లో ఆసక్తిని కలిగించింది. ఈ ప్లెజంట్ లవ్ స్టోరీని పొయెటిక్ గా అందంగా రూపొందించారు దర్శకుడు శింగర మోహన్. గుడప్పన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ట్రైలర్ లో ఆకట్టుకుంది.


నటీనటులు - వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార , తదితరులు

టెక్నికల్ టీమ్
రచన దర్శకత్వం - సింగార మోహన్
ప్రొడ్యూసర్ - మరే శివశంకర్
బ్యానర్ - సింగార క్రియేటివ్ వర్క్స్
డీవోపీ - వినీత్ పబ్బతి
ఎడిటర్ - రా యోగేష్
మ్యూజిక్ డైరెక్టర్ - గుడప్పన్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి త్వరలో రాబోతున్న సత్యం రాజేష్, శ్రవణ్ , కాలకేయ ప్రభాకర్ !!!