ఇపియాన్ కో ఫౌండర్ ,పెయిన్ స్పెషలిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ మినల్ చంద్రకు
-*దక్షిణ భారత మహిళా అచీవర్స్ అవార్డ్స్-2024 *
వైద్య రంగంలో అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఇపియాన్ కో ఫౌండర్ ,పెయిన్ స్పెషలిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ మినల్ చంద్రకు *దక్షిణ భారత మహిళా అచీవర్స్ అవార్డ్స్-2024 * (ఎస్ఐ డబ్ల్యు ఎ ఎ -SIWAA) లభించింది. వివిధ రకాల సంక్లిష్ట నొప్పులకు ఆధునీక సాంకేతికతను జోడిస్తూ అద్భుతమైన చికిత్స ను అందిస్తూ, అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నందుకు గాను డాక్టర్ మినల్ చంద్రకు *దక్షిణ భారత మహిళా అచీవర్స్ అవార్డ్*కు ఎంపిక చేశారు. అలాగే హిందుస్థాన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గా నిలిచిన ప్రపంచ రికార్డ్ లో డాక్టర్ మినల్ స్థానాన్ని దక్కించుకోవడం పట్ల పలువురు ఆమెను అభినంధించారు. భూజాలు, మొకాలు,నడుము ఇలా పలు రకాల నొప్పులకు డాక్టర్ మినల్ చంద్ర అందిస్తున్న చికిత్సతో చాలా మంది నొప్పులతో విముక్తి పొందారని, సర్జరీలు చేయకుండా రక్తం పోకుండా ఆధునీకర పద్ధతిలో చికిత్సను అందిస్తున్నట్టు ఇపియాన్ వైద్య బృందం తెలిపింది. దేశ వ్యాప్తంగా దూర ప్రాంతాల నుంచి తమ వద్దకు చికిత్స నిమిత్తం వస్తారని, వారి సమస్యకు తమ వద్ద పరిష్కారాన్ని చూపుతున్నామని, అందుకే తమ చికిత్స పట్ల రోజు రోజుకూ ఆధరణ లభిస్తుందని డాక్టర్ మినల్ చంద్ర వెల్లడించారు. కొన్ని నొప్పులకు అనేక చికిత్సలు చేయించుకున్నప్పటికీ వారికి తగ్గడం లేదని, అటువంటి వారికి కూడా తాము చికిత్స అందించి, నొప్పిని నివారించిన సందర్భాలు అనేకం ఉన్నాయని తెలిపారు.
కాగా దక్షిణ భారతదేశంలో వివిధ వ్యాపార రంగాల్లో రాణిస్తున్న మహిళలను గుర్తించి, వారికి తోడ్పాటును అందించడంతో పాటు వారు తమ తమ రంగాలల్లో మరింత ఎదిగి వ్యాపార దిగ్గజంగా ఎదగాలనే ఉద్దేశంతో ట్వెల్ మీడి యా ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో గత కొంత కాలంగా దక్షిణ భారతదేశంలో వివిధ రంగాల్లో రాణిస్తూ, సత్పలితాలను సాధిస్తున్న మహిళలను గుర్తించి, వారికి దక్షిణ భారత మహిళా అచీవర్స్ అవార్డ్స్ను అందజేస్తున్నారు.
Comments
Post a Comment