పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో మరో పాన్ ఇండియా మూవీ

'ఆర్ఎక్స్ 100' మూవీతో తెలుగు యూత్ గుండెల్లో బాణాలు దింపింది పాయల్ రాజ్‌పుత్. పంజాబి నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే ఇక్కడ రచ్చ రచ్చ చేసింది. అమ్మడు అందాల ఆరబోతతో స్క్రీన్ అంతా షేక్ అయిపోయింది. ఆ తర్వాత "మంగళవారం" మూవీ సూపర్ హిట్ తో పాయల్‌ కు ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజీ ఏర్పడింది. కుర్రాళ్లకు హాట్ ఫెవరెట్ గా మారిపోయింది. ఈ క్రమంలో మరో పాన్ ఇండియా మూవీతో వస్తోంది ఈ బ్యూటీ. ఈ సారి ఎవ్వరూ ఎక్సపెక్ట్ చేయలేనంత ఫర్ఫామేన్స్ తో.

పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో సినిమా టికెట్ ఎంటర్టైన్‌మెంట్స్ & అర్జున్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'ప్రొడక్షన్ నం. 1' చిత్రం సిద్ధం కాబోతుంది. డైరెక్టర్ ముని కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అందిస్తున్న ఈ మూవీ జనవరి 24న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉండబోతోంది. ఈ మూవీ ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు ప్రారంభం రోజు మూవీ మేకర్స్ ప్రకటిస్తారు.

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

"ది ఇండియన్ స్టోరి" రివ్యూ - మంచి సందేశం, వినోదం కలిపిన సినిమా

టోని కిక్, సునీత మారస్యార్ హీరో హీరోయిన్లుగా A3 లేబుల్స్ బ్యానర్‌పై బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో లాంఛనంగా ప్రారంభమైన చిత్రం