సాంస్కృతిక వారత్వాన్ని కొనసాగిస్తాం : కె .ఎస్ .రామారావు హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో సంక్రాంతి సంబరాలు

సాంస్కృతిక వారత్వాన్ని కొనసాగిస్తాం : కె .ఎస్ .రామారావు  
హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో సంక్రాంతి సంబరాలు వైభవంగా గరిగాయి . గంగిరెద్దుల విన్యాసాలు , హరిదాసు కీర్తనలు , సంప్రదాయ సన్నాయి మేళం , గాలిపటాల రెపరెపలాతో  పండుగను ఘనంగా జరుపుకున్నారు. 
ఈ సందర్భంగా అధ్యక్షలు కె .ఎస్. రామారావు మాట్లాడుతూ .. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ మొదటి నుంచి తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు , పండుగలకు  ప్రాధాన్యత ఇస్తుందని, గత మూడు దశాబ్దాలుగా ఆ వారసత్వాన్ని తాము కొనసాగిస్తున్నామని చెప్పారు . 
సంక్రాంతి పండుగను తెలుగువారందరూ గ్రామాలలో కుటుంబ సభ్యులందరితో ఘనంగా జరుపుకుంటారని , పట్టణాల్లో, నగరాల్లో వున్నవారు కూడా పండుగను ఆనందోత్సాహాలతో వేడుగగా జరుపుకుంటారని చెప్పడానికి అదే నిదర్శనమని రామారావు తెలిపారు . 
కార్యదర్శి తుమ్మల రంగారావు మాట్లాడుతూ . .. ఫిలింనగర్ కల్చరల్ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తుందని , ప్రతి పండుగను సభ్యుల సమక్షంలో ఆనందంగా జరుపుతామని, సంప్రదాయ వంటలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు . మన కళలు , మన సంస్కృతి కి ఈ కల్చరల్ సెంటర్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని రంగారావు తెలిపారు . 
రెండు గంటల పాటు గంగిరెద్దుల విన్యాసాలు , హరిదాసు ఆలపించే కీర్తనలతో  గాలిపటాలను ఎగురవేస్తూ సభ్యులు ఆనందంగా పండుగను కుటుంబాలతో జరుపుకున్నారు. 
ఈ వేడుకల్లో కల్చరల్ సెంటర్ మాజీ అధ్యక్షులు ఘట్టమనేని ఆదిశేష గిరిరావు , ఉపాధ్యక్షులు ఎస్ .ఎన్ .రెడ్డి , సంయుక్త కార్యదర్శి శివారెడ్డి , కార్యవర్గ సభ్యులు కోగంటి భవాని , భాస్కర నాయుడు , ఏడిద శ్రీరామ్ , కల్చరల్ కమిటీ చైర్మన్ గోపాల రావు , మీడియా కమిటీ చైర్మన్ భగీరథ పాల్గొన్నారు .

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

"ది ఇండియన్ స్టోరి" రివ్యూ - మంచి సందేశం, వినోదం కలిపిన సినిమా

టోని కిక్, సునీత మారస్యార్ హీరో హీరోయిన్లుగా A3 లేబుల్స్ బ్యానర్‌పై బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకత్వంలో లాంఛనంగా ప్రారంభమైన చిత్రం