మనోహర్ చిమ్మని దర్శకత్వంలో లాంఛనంగా ప్రారంభమైన యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ "YO! 10 ప్రేమకథలు" సినిమా


యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్స్ కు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. అలాంటి కథా కథనాలతో "YO! 10 ప్రేమకథలు" సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని పి సి క్రియేషన్స్ సమర్పణలో, మనూటైమ్ మూవీ మిషన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో పది మంది పాపులర్ హీరో హీరోయిన్స్ నటించబోతున్నారు. "YO! 10 ప్రేమకథలు" చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు, రచయిత, నంది అవార్డ్ గ్రహీత మనోహర్ చిమ్మని రూపొందించనున్నారు. మనోహర్ చిమ్మని మంచి దర్శకుడు, ప్రతిభగల రచయిత. ఆయన గతంలో "కల", "అలా", "వెల్కమ్" , "స్విమ్మింగ్ ఫూల్" వంటి చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.  సినిమా స్క్రిప్టు రచనాశిల్పం పుస్తకాన్ని రాసి 1998లో నంది పురస్కారం గెల్చుకున్నారు. తాజాగా "YO! 10 ప్రేమకథలు" సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకులు వీరశంకర్, చంద్రమహేశ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వీరశంకర్ మూవీ పోస్టర్ పై క్లాప్ కొట్టారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో

*డైరెక్టర్ వీరశంకర్ మాట్లాడుతూ* - మనోహర్ చిమ్మని దర్శకుడిగా, రచయితగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన రాసిన సినిమా స్క్రిప్టు రచనాశిల్పం పుస్తకానికి నంది పురస్కారం దక్కింది. దర్శకుడిగా "YO! 10 ప్రేమకథలు" సినిమాతో మరో మంచి ప్రయత్నం చేస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ స్టోరీ కాబట్టి మంచి పాటలు చేసుకునే వీలు ఉంటుంది. మనోహర్ గారితో పాటు మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

*డైరెక్టర్  చంద్రమహేశ్ మాట్లాడుతూ* - "YO! 10 ప్రేమకథలు" టైటిల్ చాలా బాగుంది. ఈ కథలో పది ప్రేమ కథల్ని చూపించబోతున్నారు దర్శకుడు మనోహర్ చిమ్మని. ఆ ప్రేమ కథలన్నీ జెన్యూన్ గా ఉంటాయని ఆశిస్తున్నా. ఈ సినిమా మనోహర్ గారికి దర్శకుడిగా మరింత మంచి పేరు తీసుకురావాలి. టీమ్ అందరికీ నా విశెస్ అందిస్తున్నా. అన్నారు.

*డైరెక్టర్ బాబ్జీ మాట్లాడుతూ* - తన కొత్త మూవీ ప్రారంభించుకుంటున్న  డైరెక్టర్ మనోహర్ కు నా శుభాకాంక్షలు. ఇండస్ట్రీలో కొత్త విషయాలు నేర్చుకుంటూ వాటిని గ్రంథస్తం చేసి ముందు తరాలకు అందించే ప్రయత్నం చేశారు మనోహర్. సినిమాలో ఒక ప్రేమ కథ ఉంటుంది. కానీ "YO! 10 ప్రేమకథలు" సినిమాలో పది ప్రేమ కథల్ని ఆయన తెరకెక్కించబోతుండటం ఆసక్తికరంగా ఉంది. సినిమా టీమ్ అందరికీ నా విశెస్ తెలియజేస్తున్నా. అన్నారు.

*దర్శకురాలు ప్రియదర్శిని మాట్లాడుతూ* - మనోహర్ గారు నాకు దర్శకుడిగా కంటే రచయితగా చాలా ఇష్టం. ఆయన రచనా శైలి ఆకట్టుకునేలా ఉంటుంది. "YO! 10 ప్రేమకథలు" సినిమాతో ఆయన దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. అన్నారు.

*చిత్ర దర్శకులు మనోహర్ చిమ్మని మాట్లాడుతూ* - యో... అనే మాట యువతకు ప్రతీక. ఈతరం యువతీయువకుల ఆలోచనలు, జీవనశైలి చుట్టూ అల్లిన 10 ప్రేమ కథల సమాహారం ఈ సినిమా. సుమారు 2 గంటల నిడివి ఉండే ఈ సినిమాలో 10 జంటలుంటాయి. 10 ప్రేమకథలుంటాయి. ఒక్కో ప్రేమకథ ఒక్కో జానర్లో ఉంటుంది. అయితే - ఈ ప్రేమకథలన్నింటికీ లక్ష్యం ఒక్కటే ఉంటుంది. ఆ లక్ష్యమే ఈ సినిమాను యువతరం ప్రేక్షకులకు కనెక్ట్ చేస్తుంది, యూత్‌ఫుల్‌గా ఆలోచించే అన్ని వయస్సులవారికీ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో పది మంది పాపులర్ హీరోహీరోయిన్లు నటిస్తున్నారు. సపోర్టింగ్ రోల్స్‌లో కొందరు పాపులర్ సహనటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ నటిస్తున్నారు. ఈ వివరాలన్నీ తర్వాత ప్రకటిస్తాము. సినిమా షూటింగ్ నవంబర్ చివరివారం నుంచి ప్రారంభిస్తున్నాము. వైజాగ్, గోవా, హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని అద్భుతమైన ఇండోర్ అండ్ అవుట్‌డోర్ లొకేషన్స్‌లో షూట్ చెయ్యబోతున్నాం. ఈ ప్రారంభ వేడుకలో మీరు చూసిన ఇంట్రో వీడియో, ఈ సినిమా పోస్టర్ డిజైనింగ్‌ను ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగించి చేశాం. ఈ సినిమాలోని ఇంక చాలా అంశాల్లో ఏ ఐ ని ఉపయోగిస్తున్నాం.  అన్నారు.


*టెక్నికల్ టీమ్*

డిఓపి: వీరేంద్ర లలిత్
సంగీతం: ప్రదీప్‌చంద్ర
ఎడిటింగ్: నాగిరెడ్డి
నిర్మాణం: మనూటైమ్ మూవీ మిషన్, పి సి క్రియేషన్స్
కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: మనోహర్ చిమ్మని

Comments

Popular posts from this blog

Surya Purimetla's character first look from 'Ari' was released on the occasion of the inauguration of Ayodhya Ram Mandir

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"