సోషల్ మీడియాలో వైరల్ గా మారిన బ్రహ్మానందం మెమరబుల్ అవాడ్స్ ఫొటోస్ !!!
బ్రహ్మానందం అంటే తెలియని వాళ్లుండరు. జాతీయ స్థాయిలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నటుడు బ్రహ్మానందం. దాదాపు 56 సంవత్సరాల క్రితం 1968 లో బ్రహ్మానందం కు కాలేజ్ లో ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో బహుమతి అందుకున్న సందర్భం. అలాగే 1969 లో దొంగ వీరడు అనే నటికలో ఉత్తమ సపోటింగ్ నటుడిగా బ్రహ్మానందం కు అవార్డ్ అందింది, వాల్తేర్ లో కాలేజీ లో చదువుకున్న రోజుల్లో బ్రహ్మానందం ఈ అవార్డ్ ను అందుకున్నారు.
బ్రహ్మానందం చదువుకుంటున్న రోజుల్లో అందుకున్న అవార్డ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పటి నుండి ఇటీవల తాను నటించిన రంగమార్తాండ సినిమా వరుకు అనేక అవార్డ్స్ అందుకున్నారు. ఎన్నో ఎన్నెన్నో పాత్రలతో ప్రేక్షకులను అలరించడం అంటే మాములు విషయం కాదు. బ్రహ్మానందం దాదాపు 56 ఏళ్ల నట సినీ ప్రస్థానం చూసి ఆశ్చర్యపోవాలిందే...
బ్రహ్మానందం హాస్యభరితమైన హావా భావాలు తెలుగు ప్రేక్షకుల రోజువారి కార్యక్రమాల్లో భాగం అయిపోయాయి. మీమ్స్ రూపంలో బ్రహ్మానందం రోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటారు. అంతా ఆయన హాస్యం ప్రజల్లోకి వెళ్ళింది. బ్రహ్మానందం టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోలతో సన్నిహితంగా ఉంటారు.
Comments
Post a Comment