వెంకటలక్ష్మితో యాడాది కిందట’ టైటిల్ పోస్టర్ లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్
కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు : శ్రీకాంత్
టింట్ స్ప్రీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆలేటి రాజేష్ నిర్మాతగా రామమూర్తి కొట్టాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్వచ్ఛమైన ప్రేమ కథ చిత్రం ‘వెంకటలక్ష్మితో’. ‘యాడాది కిందట’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ చిత్రంలో రఘు గద్వాల్ హీరోగా, ప్రియాంక శ్రీ, శివ ప్రసన్న హీరోయిన్స్‌గా నటించారు. తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను హీరో శ్రీకాంత్ లాంచ్ చేసి సినిమా విజయం సాధించాలని కోరారు.
ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘టైటిల్ చాలా బాగుంది. క్యాచీగా ఉంది. యంగ్ టీమ్ చేసిన సినిమా ఇది. షార్ట్ ఫిలింస్ తో ఫేమస్ అయిన హీరో రఘు ఈ సినిమా ద్వారా అందర్నీ ఆకట్టుకుంటాడని నమ్ముతున్నా. కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. ఇది కూడా ఓ కొత్త కంటెంట్‌తో రాబోతోందని అర్ధమవుతోంది. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు.
చిత్ర హీరో రఘు గద్వాల మాట్లాడుతూ.. ‘నూతన నటీనటులతో ఏడాది కిందట ఈ చిత్రాన్ని మొదలుపెట్టాం. ప్రమోషన్స్‌లో భాగంగా హీరో శ్రీకాంత్ గారు మాకు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. శ్రీకాంత్ గారికి మా టీమ్ తరపున స్పెషల్ థాంక్స్’ అని చెప్పారు.
చిత్ర దర్శకుడు రామమూర్తి కొట్టాల మాట్లాడుతూ.. ‘మా మూవీ టైటిల్ పోస్టర్‌ను శ్రీకాంత్ గారు లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. ఇదొక స్వచ్ఛమైన ప్రేమ కథా చిత్రం. థ్రిల్లర్, సస్పెన్స్‌తో పాటు అన్ని ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. అంతా కొత్త వారితో తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు చాలా ఫ్రెష్ ఫీల్‌ని ఇస్తుంది. నిర్మాత రాజేష్ గారు బాగా సపోర్ట్ చేశారు. కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు.
నిర్మాత ఆలేటి రాజేష్ మాట్లాడుతూ.. ‘సంవత్సరం కిందట ఈ సినిమాను స్టార్ట్ చేసి షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేశాం. దర్శకుడితో సహా అంతా కొత్త వారితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మా టైటిల్ పోస్టర్ లాంచ్ చేసిన శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు’అని చెప్పారు.
చిత్రం : వెంకటలక్ష్మితో .. యాడాది కిందట
బ్యానర్ : టింట్ స్ప్రీ స్టూడియోస్
నిర్మాత: ఆలేటి రాజేష్
దర్శకత్వం : రామమూర్తి కొట్టాల BFA
హీరో: రఘు గద్వాల్
హీరోయిన్స్: ప్రియాంక శ్రీ, శివ ప్రసన్న
సినిమాటోగ్రాఫర్ : రిషి, టి మహిధర్
మ్యూజిక్: సీఎన్ ఆదిత్య
ఎడిటర్: ప్రదీప్ కుమార్ రెడ్డి
కొరియోగ్రాఫర్ : వినయ్ మాస్టర్
పీఆర్‌ఓ : జీకే మీడియా
Comments
Post a Comment