జెట్టి హీరో మానినేని కృష్ణ ఆధ్వర్యంలో వైభవంగా పవన్ కళ్యాణ్ బర్తడే వేడుకలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని, జెట్టి హీరో కృష్ణ మానినేని నిన్న పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను తన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ" తన మంచితనంతో కోట్లాది ప్రజల ఆరాధ్యుడైనపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , తన రాజకీయ బాటలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు డిప్యూటీ సీఎం గా ప్రజల ముందున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్న బాట ఈరోజు నేషనల్ వైడ్ గా ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఎన్ని పదవులు తనని అలంకరించిన , ప్రతిరోజు నిత్య విద్యార్థులా ఆయన కష్టపడుతున్న తీరు ప్రశంసనీయం. ఎంతో లగ్జరీ లైఫ్ ని సైతం వదులుకొని ప్రజల బాగోగుల కోసం ఆయన తాపత్రయపడుతున్న తీరు గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అదే నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసింది. ఆయన బాటలో మేము నడవాలి అనుకుంటున్నాం. ఆయన జన్మ దినాన్ని ఒక రెస్పెక్ట్ గా భావించి నా అనే వాళ్ళ మధ్య జరుపుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమం ఆనందంగా జరుపుకుంటున్నాం . ఆయన ఆకాంక్షలకు మా వంతు సాయం అందించాలని ఆకాంక్ష మాలోను ఉంది. ఆయన బాటలో పదిమందికి సాయం చేయాలని ఉద్దేశంతో త్వరలో నా ఫ్యూచర్ కార్యక్రమాలు వెల్లడిస్తాను అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మేనేజర్ రవి, జెట్టి మూవీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, డైరెక్టర్ గోపికృష్ణ, డైరెక్టర్ వంశీ, మేనేజర్ భాష, సదానందం, కళ్యాణ్, చిక్కు, రాజేష్ ఖన్నా, లీల, బన్నీ, వీర, రాజశేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment