ధృవ సర్జా భారీ బడ్జెట్ మూవీ ‘మార్టిన్’ నుంచి ‘అదంతేలే..’ సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటోన్న లవ్ మెలోడీ
ధృవ సర్జా టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘మార్టిన్’. ఎ.పి.అర్జున్ దర్శకత్వంలో వాసవీ ఎంటర్‌ప్రైజెస్, ఉదయ్ కె.మెహతా ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ఉదయ్ కె.మెహతా, సూరజ్ ఉదయ్ మెహతా ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన మూవీ ట్రైలర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ధృవ సర్జా నటన, భారీ యాక్షన్ సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
ఈ నేపథ్యంలో సోమవారం ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ లవ్ మెలోడీ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ‘అదంతేలే..’ అంటూ సాగే సదరు పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. మణిశర్మ పాటలకు స్వరాలందిస్తున్నారు. శ్రీకృష్ణ, శ్రుతికా సముద్రాల పాటను పాడారు. ఇమ్రాన్ సర్దారియా కొరియోగ్రఫీ అందించారు.
ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన యాక్షన్ కింగ్ అర్జున్ ఈ చిత్రానికి కథను అందించటం విశేషం. మెలోడీ బ్రహ్మ మణిశర్మ పాటలకు సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ రవి బస్రూర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు.
Comments
Post a Comment