సాయి ధన్సిక "దక్షిణ'' అక్టోబర్ 4న థియేటర్స్ లో
మంత్ర , మంగళ సినిమా ల తో తెలుగు చలన చిత్ర రంగం లొ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఓషో తులసిరామ్ మళ్ళీ "దక్షిణ " మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు . కల్ట్ కాన్సెప్ట్స్ బ్యానర్ నిర్మాణం లొ అశోక్ షిండే నిర్మాత గా కబాలి ఫేమ్ సాయి ధన్షిక కథనాయాకి గా మహాభారత్ మర్డర్స్ ఫేమ్ రిషవ్ బసు మరొక ముఖ్య పాత్రలో నటించారు.
ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర గ్లిమ్స్, ట్రైలర్ కు విశేష స్పందన లభించింది, ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు బుచ్చిబాబు గారు విడుదల చేసారు. అక్టోబర్ 4న దక్షిణ చిత్రాన్ని గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. థ్రిల్లింగ్ సినిమాలకు సరికొత్త డిఫనేషన్ ఈ సినిమా ఇవ్వబోతోందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
మళ్ళీ తులసి రామ్ గారు టాలీవుడ్ కి మరో ట్రెండ్ సెట్టర్ సైకో థ్రిల్లర్ ని దక్షిణ సినిమాతో ఇవ్వబోతున్నారు.
నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేవుతోందని అక్టోబర్ 4న విడుదల కాబోతున్న దక్షణ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది, నైజాం లో దక్షిణ సినిమాను మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుందని నిర్మాత అశోక్ షిండే తెలిపారు.
సాయి ధన్సిక, రిషబ్ బసు, స్నేహ సింగ్, కరుణ,ఆర్నా ములెర్, మేఘన చౌదరి. మరియు నవీన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : రామకృష్ణ (ఆర్.కె), సంగీతం : బాలాజీ, నిర్మాణ సంస్థ: కల్ట్ కాన్సెప్ట్స్, నిర్మాత : అశోక్ షిండే, రచన - దర్శకత్వం : ఓషో తులసీరామ్.
Comments
Post a Comment