ఆహాలో దూసుకుపోతోన్న ‘టీనేజర్స్ 17/18’

కన్నడలో వచ్చిన ‘హడినెలెంటు’కి డబ్బింగ్ వర్షన్‌గా ‘టీనేజర్స్ 17/18’ అనే చిత్రం తెలుగు ఆడియెన్స్‌కి ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది. యథార్థ సంఘటనల ఆధారంగా టీనేజర్స్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ చిత్రం ఉంంటుంది. యూత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ఇందులో చూపించారు. ఈ చిత్రానికి అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇక ఓటీటీ ఆడియెన్స్‌ను పలకరించేందుకు ఈ చిత్రం వచ్చేసింది. సెప్టెంబర్ 21 నుంచి ఈ సినిమా ఆహాలోకి వచ్చేసింది. హనుమాన్ మీడియా మీద నిర్మాత బాలు చరణ్ ఈ మూవీని ఆహాలోకి తీసుకొచ్చారు.

మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఒట్టావా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇలా అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో టీనేజర్స్ చిత్రం అందరినీ ఆకట్టుకుని అవార్డులను సాధించింది. పృథ్వీ కొననూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మించారు. ఇక ఈ చిత్రంలో షెర్లిన్ బోస్లే, నీరజ్ మాథ్యూ, రేఖా కుడ్లిగి, సుధా బెలావుడి, భవానీ ప్రకాష్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. 

ఇక ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. అర్దరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతున్నా.. ఇప్పటికే మిలియన్ల మినిట్ వ్యూస్‌తో ఈ చిత్రం దూసుకుపోతోంది. ఇప్పటికే ఆహాలో ఈ సినిమా టాప్ 4 లోకి వచ్చేసింది. 12 గంటల్లో 15 మిలియన్ మినిట్ వ్యూస్‌తో ఆహాలో ట్రెండ్ అవుతోంది.

Comments

Popular posts from this blog

Surya Purimetla's character first look from 'Ari' was released on the occasion of the inauguration of Ayodhya Ram Mandir

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

త్రిగుణ, మేఘా చౌదరి, మల్లి యేలూరి, Dr Y. జగన్ మోహన్, యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ 'జిగేల్' ఫస్ట్ లుక్ రిలీజ్