అంజలి ప్రధాన పాత్రలో ZEE 5, ఫిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’ టీజర్ విడుదల

జూలై 19 నుంచి ZEE 5 స్ట్రీమింగ్ కానున్న వెబ్ సిరీస్

యాబైకి పైగా చిత్రాల్లో హీరోయిన్‌గా, విలక్షణ పాత్రల్లో మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా ఈ సిరీస్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. 


టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే.. రేడియోలో చ‌క్క‌టి పాట వ‌స్తుంటుంది.. ప్ర‌శాంత‌మైన ప‌ల్లెటూరు.. బ‌స్సులో కూర్చున్న అమ్మాయి (అంజ‌లి) ఆ స్వ‌చ్చ‌మైన గాలిని ఆస్వాదిస్తుంటుంది.. ఈ సన్నివేశంతో ప్రారంభ‌మైన టీజ‌ర్‌కు ఈ ప్ర‌పంచం లొంగిపోయేది రెండిటికే .. ఒక‌టి సొమ్ముకి, ఇంకొక‌టి సోకు అనే డైలాగ్ ఓ అమ్మాయి ఈ ప్ర‌పంచాన్ని అర్థం చేసుకున్న తీరుని చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంది. అంజ‌లి మ‌రో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో మెప్పించే ప్ర‌య‌త్నం చేసింద‌ని టీజ‌ర్‌లో ఆమె న‌టించిన స‌న్నివేశాల‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. 

ఓ వైపు ప్రేమ కురిపిస్తూనే మ‌రో వైపు ఆగ్ర‌హావేశంతో ఊగిపోయే ఆమె పాత్ర‌ను చూస్తుంటే ఆమె పోషించిన పాత్ర‌లోని భావోద్వేగాలు ఎంత లోతుల్లో ఉన్నాయో అర్థ‌మ‌వుతుంది. ప్ర‌శాంతంగా ఉండే ఆ ప‌ల్లెటూరుకి అమ్మాయి ఎందుకు వ‌చ్చింది.. ఆమెకు అక్క‌డ ఎదురైన ప‌రిస్థితులేంటి? ఆమె ఎవ‌రిపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌నుకుంది.. ఎందుకు? అనే విష‌యాలు తెలియాలంటే జూలై 19న ZEE 5లో స్ట్రీమింగ్ కానున్న‌ ‘బహిష్కరణ’ సిరీస్ చూడాల్సిందే. 

ఈ సిరీస్‌కు ప్రసన్నకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సిద్ధార్థ్ సదాశివుని సంగీతాన్ని సమకూరుస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 

భార‌త‌దేశంలో అతి పెద్ద ఓటీటీ మాధ్య‌మం ZEE 5. ప‌లు భాష‌ల్లో వైవిధ్య‌మైన సినిమాలు, సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు అప‌రిమిత‌మైన వినోదాన్ని ఇది అందిస్తోంది. ఇదే క్ర‌మంలో ‘బహిష్కరణ’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియెన్స్‌ను త్వరలోనే అలరించనుంది. 

 ZEE5 గురించి...

జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావ‌డంతో జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌లుగుతోంది.

నటీనటులు:
 
అంజలి, రవీంద్ర విజయ్, శ్రీతేజ్, అనన్య నాగళ్ల, షణ్ముక్, చైతన్య సాగిరాజు, మహ్మద్ బాషా, బేబీ చైత్ర తదితరులు

సాంకేతిక వర్గం:

నిర్మాణ సంస్థ: ఫిక్సల్ పిక్చర్స్ ఇండియా, నిర్మాత: ప్రశాంతి మలిశెట్టి, రైటర్ - డైరెక్టర్ : ముఖేష్ ప్రజాపతి, డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ: 
ప్రసన్న కుమార్, సంగీతం : సిద్ధార్ద్ సదాశివుని, ఎడిటర్ : రవితేజ గిరిజాల, కాస్ట్యూమ్ డిజైనర్ : అనూష పుంజాల, ఆర్ట్ డైరెక్టర్ : ప్రియం క్రాంతి, కో - రైటర్ : వంశీ కృష్ణ పొడపటి, డైలాగ్ రైటర్ : శ్యామ్ చెన్ను, కో- డైరెక్టర్ : రమేష్ బోనం, అసోసియేట్ డైరెక్టర్: ఆదిత్య ఆకురాతి, పి.ఆర్.ఒ: బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి).

Comments

Popular posts from this blog

Surya Purimetla's character first look from 'Ari' was released on the occasion of the inauguration of Ayodhya Ram Mandir

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"