హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఆకట్టుకుంటున్న విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ "తుఫాన్" స్నీక్ పీక్, ఆగస్టు 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "తుఫాన్". ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో "తుఫాన్" సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. "తుఫాన్" సినిమాను ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈరోజు మేకర్స్ ఈ సినిమా స్నీక్ పీక్ రిలీజ్ చేశారు.
"తుఫాన్" సినిమా స్నీక్ పీక్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఆకట్టుకుంది. పోలీస్ ఆఫీసర్ ఓ హోటల్ నిర్వహిస్తున్న యువకుడిని, అతని మదర్ ను డాలీ అనే వ్యక్తి గురించి, మాల్ లో జరిగిన సంఘటన గురించి ఇంటరాగేట్ చేస్తాడు. ఆ మాల్ లో తప్పు చేస్తున్న కొందరిని కొట్టిన వ్యక్తి గురించి ప్రశ్నిస్తాడు. పోలీస్ ఆఫీసర్ తో పాటు పదుల సంఖ్యలో విలన్స్ ఆ హోటల్ కు వస్తారు. వీళ్లంతా తెలుసుకోవాలనుకుంటున్న వ్యక్తి వారి ఎదుటే నిలబడతాడు. పోలీస్ ఆఫీసర్ ముందే ఆ విలన్స్ తో ఫైట్ చేస్తాడు హీరో. స్నీక్ పీక్ లోని ఈ యాక్షన్ సీక్వెన్స్ "తుఫాన్" సినిమాలో హైలైట్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ తో వచ్చిన హైప్ స్నీక్ పీక్ తో మరింత పెరగనుంది.
నటీనటులు - విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్స్ - షిమోనా స్టాలిన్
డిజైనర్ - తండోరా చంద్రు
యాక్షన్ కొరియోగ్రాఫర్ - సుప్రీమ్ సుందర్
ఆర్ట్ డైరెక్టర్ - అరుముగస్వామి
ఎడిటింగ్ - ప్రవీణ్ కేఎల్
మ్యూజిక్ - అచ్చు రాజమణి, విజయ్ ఆంటోనీ
డైలాగ్ రైటర్ - భాష్య శ్రీ
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
నిర్మాతలు - కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా
రచన, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ - విజయ్ మిల్టన్
Comments
Post a Comment