మంత్రి దుర్గేష్ తో కెఎస్. రామారావు సమావేశం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను   నిర్మాత కె .ఎస్ . రామారావు  అభినందించారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు బాబు నాయుడు గారి మంత్రి వర్గంలో కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ శాఖను నిర్వహిస్తున్నారు . 
సోమవారం రోజు అమరావతిలో మంత్రి దుర్గేష్ తో నిర్మాత రామారావు సమావేశమయ్యారు . త్వరలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశమై సినిమారంగ సమస్యల గురించి చర్చిద్దామని దుర్గేష్ రామారావుతో చెప్పారు . 
ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు  సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, అందుకు సహజమైన లొకేషన్లు , ప్రోత్సహించే ప్రభుత్వం ఉన్నాయని రామారావు తెలిపారు . 
సినిమా పరిశ్రమ పట్ల అవగాహన వున్న కందుల దుర్గేష్  మంత్రిగా ఉండటం పట్ల రామారావు హర్షం వ్యక్తం చేశారు .

Comments

Popular posts from this blog

జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ‘కేస్‌ నం. 15’

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘రైస్ మిల్’ షూటింగ్ పూర్తి !!!

ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి త్వరలో రాబోతున్న సత్యం రాజేష్, శ్రవణ్ , కాలకేయ ప్రభాకర్ !!!